అసలు రాజ్యసభకు నామినేషన్ అందుకోవాలంటే కావాల్సిన అర్హతేంటి. ఆ పదవి వచ్చాక దేశం పట్ల సమాజం పట్ల మనకు ఎలాంటి బాధ్యతలు ఉంటాయి. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతున్న చర్చ. ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కు ఆ గౌరవం దక్కడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అంతటి ఉన్నతమైన గౌరవానికి ఆయన అర్హుడని బిజెపి ప్రభుత్వం ఏ ప్రాతిపదికన నిర్ణయం తీసుకుందనే కోణంలో పెద్ద పోస్ట్ మార్టమే జరుగుతోంది. ఇళయరాజా గురించి […]
ఇవాళ నుంచి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లు వేగమందుకోబోతున్నాయి. రాజమౌళి రంగంలోకి దిగారు. దుబాయ్, బెంగళూర్ ఈవెంట్ల తాలూకు పనుల్లో టీమ్ బిజీగా ఉంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు పబ్లిసిటీ క్యాంపైన్ కోసం రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో మళ్ళీ ఫ్రెష్ గా ఇంటర్వ్యూలు మొదలుపెట్టారు. అందులో భాగంగా జక్కన్న బాహుబలి 3 ప్రస్తావన తేవడం, భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందనే హింట్ ఇవ్వడం ప్రభాస్ అభిమానులను ఒక్కసారిగా యాక్టివ్ చేసింది. దీనికోసం తమ వద్ద ప్రణాళిక […]
బాహుబలి సినిమా రెండు భాగాలూ చూశాం కానీ అసలు దానికన్నా ముందు ఏం జరిగింది, శివగామి లైఫ్ లో ముఖ్యమైన సంఘటనలు ఏమిటి, ఆమెకు భర్తకు మధ్య సంబంధాలు ఎలా ఉండేవి, ఆ సామ్రాజ్య స్థాపనకు కారణమైన అసలు బాహుబలి ఎవరు లాంటి ఎన్నో ప్రశ్నలు జనం మదిలో మెదిలాయి. అందుకే నెట్ ఫ్లిక్స్ ఈ అవకాశాన్ని వాడుకునే ఉద్దేశంతో బిగినింగ్ కు ముందు ఏం జరిగిందో చూపాలనే ఉద్దేశంతో ఓ వెబ్ సిరీస్ ని మూడేళ్ళ […]
దేవిశ్రీ ప్రసాద్, కీరవాణి ఈ రెండు సినిమా ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేర్లు. తమదైన శైలిలో ఒక బ్రాండ్ ని ఏర్పరుచుకుని ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ ని ఎన్నో ఇచ్చారు ఈ ఇద్దరూ. కీరవాణి 90వ దశకంనుంచే తన ప్రస్థానం ఆరంభించగా దేవిశ్రీ ప్రసాద్ చాలా చిన్న వయసులోనే 1999లో లాంచ్ అయ్యాడు. నిజానికి ఇద్దరి మధ్య కెరీర్ గ్యాప్ 9 సంవత్సరాలే. కీరవాణి గత కొంత కాలంగా సినిమాలు తగ్గించుకున్నారు. చేసినవాటిలోనూ చెప్పుకోదగ్గ సంగీతాన్ని ఇవ్వలేకపోయారు. […]
సాహో తర్వాత బాహుబలి తరహాలో ఎక్కువ రోజులు వెయిట్ చేయాలేమో అని దిగులు చెందుతున్న డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కు దర్శకుడు రాధాకృష్ణ గుడ్ న్యూస్ ఇచ్చేశాడు. తన దర్శకత్వంలో యువి క్రియేషన్స్, కృష్ణంరాజు గారి స్వంత సంస్థ గోపికృష్ణ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ ఫస్ట్ లుక్ అతి త్వరలో విడుదల చేయబోతున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించేశారు. ఇటీవలే జార్జియా షెడ్యూల్ పూర్తి చేసుకున్న టీం అనుకున్న టైం కంటే త్వరగా తిరిగి […]
2018లో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన కెజిఎఫ్ సీక్వెల్ రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది. అక్టోబర్ 23న రాఖీ భాయ్ థియేటర్లలో అడుగు పెడతాడని అధికారికంగా ప్రకటించేశారు. దీన్ని బట్టి షూటింగ్ దాదాపు అయిపోయినట్టేనని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే దీని మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు కన్నడ తమిళ్ నుంచే కాకుండా హిందీలోనూ కెజిఎఫ్ చాప్టర్ 2 మీద భారీ పెట్టుబడులు రెడీ చేసుకుంటున్నారు. ఈసారి బాహుబలి రికార్డులను […]
ప్రతి రెండుమూడేళ్లకు ప్రేక్షకుల అభిరుచులు డిమాండ్లు మారిపోతున్న ప్రస్తుత తరుణంలో ఒక హీరోయిన్ దశాబ్దంన్నర పాటు పరిశ్రమలో టాప్ ప్లేస్ లో కొనసాగడం చిన్న విషయం కాదు. అందులోనూ హీరోలకు ధీటుగా తనకంటూ సోలో మార్కెట్ ని సృష్టించుకోవడం అందరి వల్లా సాధ్యమయ్యేది కాదు. సూపర్ తో అనుష్కను పరిచయం చేసినప్పుడు నాగార్జున కానీ పూరి జగన్నాధ్ కానీ తను ఇంత స్థాయికి చేరుకుంటుందని ఊహించారో లేదో కానీ స్వీటీ అని అభిమానులు ముద్దుగా పిలిచే అనుష్క […]
గత ఏడాది అక్టోబర్ ముందు వరకు దర్శకుడు సురేందర్ రెడ్డి పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోయింది. కారణం మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి సినిమా. చిరు డ్రీం ప్రాజెక్ట్ ని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న దర్శకుడిగా ఇతని మీద చాలా చర్చ జరిగింది. ఇక్కడ వంద కోట్ల షేర్ రాబట్టుకున్నప్పటికీ బయటి రాష్ట్రాల్లో మాత్రం ఘోరంగా విఫలమయ్యింది సైరా. పాన్ ఇండియా కలలను ఛిద్రం చేస్తూ ఫైనల్ గా నష్టాలు మిగిల్చింది. అభిమానులను సైతం సైరా […]
టాలీవుడ్ లోనే కాదు ఇండియా మొత్తం మీద క్రేజీ ప్రాజెక్ట్ గా పేరు తెచ్చుకున్న రాజమౌళి మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఇంకో జూలైలోపు పూర్తి కానుంది. ఆపై నాలుగైదు నెలలు పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు ప్రమోషన్ కోసం ప్లాన్ చేసుకున్న జక్కన్న ఈసారి బాహుబలి రికార్డులను తనే బద్దలు కొట్టాలని గట్టి నిశ్చయంతో ఉన్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ “రామ రావణ రాజ్యం”గా ఫిక్సయ్యిందని ఓ మీడియాలో వస్తున్న వార్తలు […]
బాహుబలి తర్వాత నేషనల్ లెవెల్ లో స్టార్ అయిపోయిన డార్లింగ్ ప్రభాస్ కొత్త సినిమా షూటింగ్ మంచి స్పీడ్ తో జరుగుతోంది. ప్రపంచమంతా కోవిడ్ వైరస్ భయంతో వణికిపోతుంటే యూనిట్ భయపడకుండా షూటింగ్ కోసం జార్జియా వెళ్ళిపోయింది. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేయబోతున్నారని తెలిసింది. తాజాగా మరో థ్రిల్లింగ్ అప్ డేట్ లీకైపోయింది. దాని ప్రకారం ఇందులో హీరోయిన్ పూజాహెగ్డే యువరాణి పాత్రను పోషిస్తోందని సమాచారం. యూరోప్ […]