iDreamPost
android-app
ios-app

కీరవాణి దేవిశ్రీ – వాళ్లకే ఎందుకలా

  • Published Mar 30, 2020 | 4:50 AM Updated Updated Mar 30, 2020 | 4:50 AM
కీరవాణి దేవిశ్రీ  – వాళ్లకే ఎందుకలా

దేవిశ్రీ ప్రసాద్, కీరవాణి ఈ రెండు సినిమా ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేర్లు. తమదైన శైలిలో ఒక బ్రాండ్ ని ఏర్పరుచుకుని ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ ని ఎన్నో ఇచ్చారు ఈ ఇద్దరూ. కీరవాణి 90వ దశకంనుంచే తన ప్రస్థానం ఆరంభించగా దేవిశ్రీ ప్రసాద్ చాలా చిన్న వయసులోనే 1999లో లాంచ్ అయ్యాడు. నిజానికి ఇద్దరి మధ్య కెరీర్ గ్యాప్ 9 సంవత్సరాలే. కీరవాణి గత కొంత కాలంగా సినిమాలు తగ్గించుకున్నారు. చేసినవాటిలోనూ చెప్పుకోదగ్గ సంగీతాన్ని ఇవ్వలేకపోయారు. కానీ రాజమౌళి అంటే మాత్రం ఎక్కడ లేని ఎనర్జీ జోష్ తో సాలిడ్ స్కోర్ ఇస్తారు.

మొన్న ఆర్ఆర్ఆర్ వీడియో టీజర్ లో చిన్న బిట్ తోనే తన విశ్వరూపం చూపించారు. ఈయన బెస్ట్ వర్క్ ఇంతకు ముందు ఏదీ అని గుర్తు చేసుకుంటే బాహుబలి తప్ప ఇంకేదీ గుర్తు రాదు. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలకు మ్యూజిక్ ఇచ్చారు కానీ అవి అంచనాలు అందుకోలేకపోయాయి. కానీ బాహుబలి టైంలోనే సవ్యసాచి, జువ్వ, లచ్చిమిదేవికి లెక్కుంది, ఓం నమో వెంకటేశాయ, సైజ్ జీరో, దిక్కులు చూడకు రామయ్య ఇలా చాలానే చేశారు కానీ దేంట్లోనూ ఒక్క పాట గుర్తుండదు. మరి రాజమౌళికి మాత్రమే ఫామ్ లో రావడం వెనుక కారణం అంతు చిక్కదు.

ఇక దేవిశ్రీ ప్రసాద్ విషయానికి వస్తే గత మూడేళ్ళలో రంగస్థలం మినహాయించి కంప్లీట్ బెస్ట్ ఆల్బమ్ ఇచ్చి చాలా కాలమయ్యింది. పిలిచి మరీ వినయ విధేయ రామ, మహర్షి, సరిలేరు నీకెవ్వరు, చిత్రలహరి, హలో గురు ప్రేమ కోసమే లాంటి ఆఫర్లు ఇస్తే ఒక్కో దాంట్లో ఒక్కో పాట మాత్రమే బాగుందనిపించేలా అవుట్ ఫుట్ ఇచ్చారు కానీ అవుట్ అండ్ అవుట్ గా బెస్ట్ అనిపించేది ఇవ్వలేకపోయారు. కానీ సుకుమార్ టీంలోకి వెళ్ళగానే దేవిశ్రీప్రసాద్ లోని అసలైన సంగీత దర్శకుడు బయటికి వస్తాడు.

ఇటీవలే విడుదలైన ఉప్పెన ఆడియోని ఉదాహరణగా చెప్పొచ్చు. ఆన్ లైన్ లో దీని ట్రాక్స్ ఆల్రెడీ వైరల్ అయ్యాయి. ఇదే స్థాయి మ్యూజిక్ ని ఇతరులకు దేవి ఎందుకు ఇవ్వలేకపోతున్నాడనేది భేతాళ ప్రశ్న. రాబట్టుకోవడం దర్శకుల చేతుల్లో ఉంటుందన్నది నిజమే అయినా ఈ పరిస్థితి గతంలో లేదుగా. మరి రాజమౌళికి కీరవాణి, సుకుమార్ కాంపౌండ్ కి దేవి శ్రీ ప్రసాద్ ఇలా ప్రత్యేకంగా మ్యూజిక్ ఇవ్వడంలో కారణం ఏదైనా వీళ్ళు అందరికి ఇలాంటి ట్యూన్స్ ఇస్తే మాత్రం సంగీత ప్రియులకు ఒకే ఏడాదిలో మంచి ఆల్బమ్స్ ఎక్కువ ఆస్వాదించే అవకాశం దక్కుతుంది. మరి దీని వెనుక ఆ రహస్యం ఏమిటో