iDreamPost

హర్రర్ మూవీ ‘ముంజ్యాకు’ బాహుబలితో కనెక్షన్.. కట్టప్పపై హీరోయిన్ కామెంట్స్!

Sharvari Wagh Comments On Sathyaraj: బాలీవుడ్ బ్యూటీ శర్వరి వాఘ్ ప్రధాన పాత్రలో నటించిన హార్రర్ మూవీ ముంజ్యా. జూలై 7వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీ బాహుబలి కట్టప్ప ఆయినా సత్యరాజ్ పై కామెంట్స్ చేసింది.

Sharvari Wagh Comments On Sathyaraj: బాలీవుడ్ బ్యూటీ శర్వరి వాఘ్ ప్రధాన పాత్రలో నటించిన హార్రర్ మూవీ ముంజ్యా. జూలై 7వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీ బాహుబలి కట్టప్ప ఆయినా సత్యరాజ్ పై కామెంట్స్ చేసింది.

హర్రర్ మూవీ ‘ముంజ్యాకు’ బాహుబలితో కనెక్షన్.. కట్టప్పపై హీరోయిన్ కామెంట్స్!

ఇటీవల కాలంలో ఎన్నో హర్రర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. చాలా సినిమాలు కామెడీతో కూడిన హర్రర్ స్టోరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అంతేకాక మరికొన్ని సినిమాలు అయితే ప్రేక్షకులను వణికించేలా  చేశాయి. గతంలో మసూద, పొలిమేర, పొలిమేర-2, విరుపాక్ష వంటి హర్రర్ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అంతేకాక బాక్సాఫీస్ వద్ద సూపర్ హీట్ గా నిలిచాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీ శర్వరి వాఘ్ ప్రధాన పాత్రలో నటించిన హార్రర్ మూవీ ముంజ్యా. జూలై 7వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇది ఇలా ఉంటే…ఈ సినిమాలోని హీరోయిన్ బాహుబలి కట్టప్పపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

బాలీవుడ్ బ్యూటీ శర్వారి కీలక పాత్రలో నేష్ విజన్ బ్లాక్ బస్టర్ హార్రర్ కామెడీ యూనివర్స లో భాగంగా తెరకెక్కిన సినిమా ముంజ్యా. జూన్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతేకాక కామెడీతో పాటు భయపెట్టే అంశాలతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇది ఇలా ఉంటే.. డిఫరెంట్ స్టోరీ కలిగిన ఈ అయితే ముంజ్యా సినిమాలో ప్రముఖ నటుడు సత్యరాజ్ కీలక పాత్రలో నటించారు. ఇక బాహుబలి సినిమాలో కట్టప్పగా చేసిన సత్యరాజ్ పాత్రతో ముంజ్యాకు కనెక్షన్ ను ఉన్నట్లు తెలుస్తోంది. అది సినిమా చూస్తే..తెలుస్తుందని కామెంట్స్ వినిపిస్తోన్నాయి.

ఇది ఇలా ఉంటే బాహుబలి కట్టప్ప అయిన సత్యరాజ్ పై ముంజ్యా హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సత్యరాజ్‌తో పని చేసిన అనుభవం గురించి హీరోయిన్ శర్వారి వాఘ్ చెబుతూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ సత్యరాజ్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. తనకు రాజమౌలి అంటే ఇష్టమని, ఆయన తీసిన బాహుబలి సినిమాకు పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చింది. ఆ సినిమాను చాలా సార్లు చూశానని, ఇక ఆ మూవీలో కట్టప్పగా చేసిన సత్య రాజ్ గారితో తాను స్క్రీన్ షేర్ చేసుకోబోతోన్నానని తెలియడంతో తన ఆనందానికి అవధులు లేవని చెప్పుకొచ్చింది. షూటింగ్ టైమ్ లో సత్యరాజ్ అంకితభావం, నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యం కలిగిందని, ఆయన్నుంచి చాలా నేర్చుకున్నానని  శర్వరి వాఘ్ తెలిపింది.

ఎలాంటి సన్నివేశంలోనైనా సరే సత్యరాజ్ సర్ ఎంతో నిబద్ధతో ప్రతి సన్నివేశానికి జీవం పోశారని చెప్పింది. అంతేకాక ఆయనతో కలిసి మళ్లీ పని చేయాలని ఉందని, అలాంటి అవకాశం రావాలని కోరుకుంటున్నట్లు ఈబ్యూటీ తెలిపింది. ఇక ముంజ్యా సినిమా విషయానికి వస్తే.. దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించగా, దిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి..మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. తొలుత మంచి కలెక్షన్స్ తెచ్చుకున్న ఈ హర్రర్  చిత్రం మొదటి వారం రోజుల్లో వసూళ్లు తగ్గిపోయాయి. మోనా సింగ్, శర్వరి వాఘ్, అభయ్ వర్మ నటించిన ముంజ్యా సినిమాలో నటించారు. మొత్తంగా సత్యరాజ్ పై శర్వరి వాఘ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి