iDreamPost
android-app
ios-app

బాహుబలి సీన్ రీ క్రియేట్.. శివగామిలా మారిన ఆ ప్రముఖ దర్శకుడు ఎవరంటే..?

తెలుగు పరిశ్రమ గురించి చెప్పుకోవాలంటే.. బాహుబలికి ముందుకు బహుబలికి తర్వాత అన్నట్లుగా మారిపోయింది. ఈ సినిమా దక్షిణాది పరిశ్రమనే కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న ఇండస్ట్రీలను చూపు టాలీవుడ్ పడేలా చేసింది. అయితే ఇందులో ఓ కీలక సన్నివేశాన్ని రీ క్రియేట్ చేశాడు ప్రముఖ దర్శకుడు.

తెలుగు పరిశ్రమ గురించి చెప్పుకోవాలంటే.. బాహుబలికి ముందుకు బహుబలికి తర్వాత అన్నట్లుగా మారిపోయింది. ఈ సినిమా దక్షిణాది పరిశ్రమనే కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న ఇండస్ట్రీలను చూపు టాలీవుడ్ పడేలా చేసింది. అయితే ఇందులో ఓ కీలక సన్నివేశాన్ని రీ క్రియేట్ చేశాడు ప్రముఖ దర్శకుడు.

బాహుబలి సీన్ రీ క్రియేట్..  శివగామిలా మారిన ఆ ప్రముఖ దర్శకుడు ఎవరంటే..?

డార్లింగ్ ప్రభాస్‌ను పాన్ ఇండియన్ స్టార్ చేసిన మూవీ బాహుబలి. దర్శక ధీరుడు జక్కన చెక్కిన అద్భుతమైన సినీ కావ్యాలలో తొలి వరుసలో ఉంటుంది. ఈ సినిమ రెండు భాగాలుగా తెరకెక్కించిన సంగతి విదితమే. బాహుబలి ది బిగినింగ్. బాహుబలి ది కంక్లూజ్. ఈ మూవీ కోసం ప్రభాస్ మరో సినిమా ఒప్పుకోకుండా ఐదేళ్లు కష్టపడ్డాడని, ఆ కష్టానికి ప్రతిఫలం దక్కిందని ఇప్పటికీ ఇండస్ట్రీలో చెప్పుకుంటారు. అలాగే తెలుగు సినిమా దశ, దిశను ఈ చిత్రం మార్చేసింది అనడంలో ఎటువంటి సంకోచం లేదు. ఇందులో అనుష్క, తమన్నా హీరోయిన్స్. రానా ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, అడవి శేష్, సుదీప్, రోహిణీ కీలక పాత్రలు పోషించిన సంగతి విదితమే.

ఇక బాహుబలి-1 తొలి సీనే సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తుంది. తొలి సినిమాలో.. ఓ చంటి బిడ్డను చేతిలో పట్టుకుని రమ్యకృష్ణ ప్రాణాలతో పోరాడుతుంది. నదిలో పడిపోయిన శివగామి.. అమరేంద్ర బాహుబలి బతకాలి అంటూ బిడ్డను పైకి ఎత్తి పట్టుకుని తను నీళ్లలో మునిగిపోతుంది. ఈ మూవీకి ఈ సీన్ తొలి హైలెట్‌గా నిలవడమే కాదు.. చూస్తుంటే గూస్ బంప్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఇదే సీన్ రిపీట్ చేశాడు ప్రముఖ డైరెక్టర్. తన కొడుకులను కూడా బహుబలి రేంజ్‌లో పైకెత్తి సోషల్ మీడియాలో షేర్ చేడంతో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇంతకు ఈ పిల్లలను బహుబలిలా ఎత్తుకున్న ఆ దర్శకుడు ఎవరంటే విఘ్నేశ్ శివన్. ఫాదర్స్ డే సందర్బంగా తన కొడుకులు ఉయిర్, ఉలగం ఈ సీన్ రీక్రియేట్ చేశాడు నయన్ హాస్బెండ్.

ఫాదర్స్ డ సందర్బంగా తన కవల పిల్లలతో గడిపిన స్వీట్ మొమొరీస్‌ను పంచుకున్నాడు విఘ్నేశ్. నీటిలో మునిగి తన పిల్లలను చేతిలో పైకెత్తి పట్టుకున్న ఫోటోలను ఇన్ స్టా వేదికగా షేర్ చేశాడు. మై డియర్ బాహుబలి 1 అండ్ 2 (ఉయిర్, ఉలగం).. హ్యాపీ ఫాదర్స్ డే. తన జీవితంలో వీరి రాకతో ఎంతో సంతోషం నిండిపోయిందని పేర్కొంటూ ఈ ఫోటోలను షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. పలువరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. వాట్ ఎ క్రియేటివిటీ.. వాట్ ఎ విజన్ అని ఓ నెటిజన్.. క్యూట్ అంటూ కొంత మంది నెటిజన్లు కామెంట్స్ చేశారు. మొత్తానికి బాహుబలి సినిమా సీన్ రీ క్రియేట్ చేసి.. ప్రభాస్ అభిమానుల మనస్సు దోచుకున్నాడు ఈ దర్శకుడు.

 

View this post on Instagram

 

A post shared by Vignesh Shivan (@wikkiofficial)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి