iDreamPost
android-app
ios-app

బాహుబలి రీరిలీజ్… అది కూడా ఊహించని ట్విస్ట్ తో

  • Published Jun 06, 2025 | 10:21 AM Updated Updated Jun 06, 2025 | 10:21 AM

Baahubali Re Release: మొత్తం తెలుగు ఇండస్ట్రీకే టర్నింగ్ పాయింట్ గా నిలిచిన సినిమా బాహుబలి. జక్కన్న చెక్కిన అద్భుతమైన కళాకండాలలో ఈ మూవీ ఎప్పటికి మొదటి స్థానంలోనే నిలిచిపోతుంది. ఇక ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాను మరోసారి వెండితెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నారట మేకర్స్.అయితే ఇక్కడే ఓ పెద్ద ట్విస్ట్ ఉంది.

Baahubali Re Release: మొత్తం తెలుగు ఇండస్ట్రీకే టర్నింగ్ పాయింట్ గా నిలిచిన సినిమా బాహుబలి. జక్కన్న చెక్కిన అద్భుతమైన కళాకండాలలో ఈ మూవీ ఎప్పటికి మొదటి స్థానంలోనే నిలిచిపోతుంది. ఇక ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాను మరోసారి వెండితెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నారట మేకర్స్.అయితే ఇక్కడే ఓ పెద్ద ట్విస్ట్ ఉంది.

  • Published Jun 06, 2025 | 10:21 AMUpdated Jun 06, 2025 | 10:21 AM
బాహుబలి రీరిలీజ్… అది కూడా ఊహించని ట్విస్ట్ తో

టాలీవుడ్ లో రీరిలీజ్ కు చాలా నార్మల్ అయిపోయాయి. ప్రేక్షకులు కూడా వాటిని చాలా బాగా సెలెబ్రేట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా రీరిలీజ్ అయిన ఖలేజాకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలియనిది కాదు. ఈ సినిమాకు దాదాపు రూ.10 కోట్ల వసూళ్ల మార్కును అందుకుందని అంటున్నారు. ఇంకా ఈ సినిమా థియేటర్స్ లో రన్ అవుతూనే ఉంది. అయితే ఇప్పటివరకు చేసిన రీరిలీజ్ లు ఇకపై చేయబోయే రీరిలీజ్ లు ఓ లెక్క ఈ సినిమా రీరిలీజ్ ఓ లెక్క. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ట్రీట్ అవ్వడం ఖాయం.

మొత్తం తెలుగు ఇండస్ట్రీకే టర్నింగ్ పాయింట్ గా నిలిచిన సినిమా బాహుబలి. జక్కన్న చెక్కిన అద్భుతమైన కళాకండాలలో ఈ మూవీ ఎప్పటికి మొదటి స్థానంలోనే నిలిచిపోతుంది. ఇక ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాను మరోసారి వెండితెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నారట మేకర్స్. ఆల్రెడీ ఆర్క మీడియా వర్క్స్ సంస్థ ఇందుకోసం సన్నాహాలు కూడా మొదలుపెట్టిందట. అయితే ఇక్కడే ఓ పెద్ద ట్విస్ట్ ఉంది. ఇప్పటివరకు రీరిలీజ్ చేసిన సినిమాలన్నీ కూడా సింగల్ పార్ట్ మూవీస్ ఏ. కానీ బాహుబలి రెండు పార్ట్స్ ఉంటుంది. మరి ఇప్పుడు రెండు పార్ట్స్ లో ఓ దానిని రీరిలీజ్ చేస్తే దేనికి అర్ధం లేకుండా పోతుంది.

అలా అని రెండిటిని ఒకేసారి రీరిలీజ్ చేయలేరు. రెండు ఒకదానిని మించి ఒకటి ఉంటాయి. అలా అని ముందు ఒకటి తర్వాత ఒకటి రీరిలీజ్ చేయడం కూడా సాధ్యం కాదు. సో అందుకని.. ఈ రెండు పార్ట్స్ లోని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ను తీసుకుని ఆ రెండిటిని మెర్జ్ చేసి ఆ ప్రింట్ ను థియేటర్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట మేకర్స్. ఇందుకోసం ఎడిటింగ్ పనులను కూడా మొదలైనట్టు సమాచారం. బాహుబలి రెండు భాగాలూ కలిపి ఐదున్నర గంటల నిడివి ఉంటుంది. దీనిని మూడున్నర గంటలకు కుదించి కొత్తగా థియేటర్ లో రీరిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఇక ఇది ఎప్పుడు థియేటర్ లో రీరిలీజ్ అవుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet