iDreamPost
android-app
ios-app

సురేందర్ రెడ్డి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి?

  • Published Mar 10, 2020 | 2:49 PM Updated Updated Mar 10, 2020 | 2:49 PM
సురేందర్ రెడ్డి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి?

గత ఏడాది అక్టోబర్ ముందు వరకు దర్శకుడు సురేందర్ రెడ్డి పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోయింది. కారణం మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి సినిమా. చిరు డ్రీం ప్రాజెక్ట్ ని అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న దర్శకుడిగా ఇతని మీద చాలా చర్చ జరిగింది. ఇక్కడ వంద కోట్ల షేర్ రాబట్టుకున్నప్పటికీ బయటి రాష్ట్రాల్లో మాత్రం ఘోరంగా విఫలమయ్యింది సైరా. పాన్ ఇండియా కలలను ఛిద్రం చేస్తూ ఫైనల్ గా నష్టాలు మిగిల్చింది. అభిమానులను సైతం సైరా పూర్తి స్థాయిలో సంతృప్తిపరచలేకపోయింది.

ఇదిలా ఉండగా ఇది జరిగి ఐదు నెలలు దాటినా ఇప్పటిదాకా సూరి కొత్త సినిమా ఎవరితో చేస్తాడనే క్లారిటీ లేదు. రామ్ చరణ్ తో ఉండొచ్చన్న టాక్ కొద్దిరోజులు నడిచింది. ధృవ సీక్వెల్ ప్లాన్ చేశారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే స్క్రిప్ట్ లాక్ కాలేదని తర్వాత తెలిసింది. అల్లు అర్జున్ రేస్ గుర్రం 2 చేయాలనే ఆసక్తితో ఉన్నట్టు ఇంకో వార్త వచ్చింది. అదీ ఉత్తుత్తిదేనని కన్ఫర్మ్ అయ్యింది. బన్నీ సుకుమార్ సినిమా తర్వాత ఎవరితో చేస్తాడనే విషయం ఎవరికీ తెలియదు.

రవితేజతో మరోసారి టైఅప్ అవుతాడా అనుకుంటే కిక్ 2 ఫలితం చూశాక ఇది జరిగే పని కాదని చిన్నపిల్లాడు కూడా చెబుతాడు. మంచి బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో వేసుకున్న సూరికి ఇప్పుడీ పరిస్థితి రావడం విచిత్రమే. సైరా ఒకవేళ బాహుబలి తరహాలో పాన్ ఇండియా లెవెల్ లో రికార్డులు సృష్టించి ఉంటే ఇప్పుడు సీన్ వేరుగా ఉండేది. కానీ తలచింది ఒకటి జరిగింది వేరు. అసలు సూరి ఎవరిని దృష్టిని పెట్టుకుని కథను సిద్ధం చేసుకుంటున్నాడో కూడా సస్పెన్సుగానే ఉంది. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన సుకుమార్ కే రెండేళ్ల అజ్ఞాతవాసం తప్పలేదు. అలాంటిది సైరా తర్వాత వెంటనే సూరికి భారీ డిమాండ్ వచ్చేయాలనుకోవడం అత్యాశే అవుతుంది. మాస్ పల్స్ ని పసిగట్టి ఎంటర్ టైనింగ్ గా మసాలా సినిమాలు తీసే సురేందర్ రెడ్డి వీలైనంత త్వరగా కొత్త సినిమాతో రావాలని అభిమానులు కోరుతున్నారు. మరి తను ఎప్పుడు బయటపడతాడో వేచి చూడాలి

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişJojobetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbetHoliganbet Giriş