iDreamPost
android-app
ios-app

బాహుబలిలో కట్టప్పగా సంజయ్ దత్ ఎందుకు చేయలేదంటే: విజయేంద్ర ప్రసాద్

Vijayendra Prasad: టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలోకి చేర్చిన సినిమా బాహుబలి. ఈ సినిమాలో కట్టప్ప పాత్ర ఎంతో ప్రత్యేకమైనది. అయితే ఆ పాత్ర కోసం తొలుత సంజయ్ దత్ ను అనుకున్నట్లు సీని రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.

Vijayendra Prasad: టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలోకి చేర్చిన సినిమా బాహుబలి. ఈ సినిమాలో కట్టప్ప పాత్ర ఎంతో ప్రత్యేకమైనది. అయితే ఆ పాత్ర కోసం తొలుత సంజయ్ దత్ ను అనుకున్నట్లు సీని రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.

బాహుబలిలో కట్టప్పగా సంజయ్ దత్ ఎందుకు చేయలేదంటే: విజయేంద్ర ప్రసాద్

టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలోకి చేర్చిన సినిమా బాహుబలి. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చెక్కిన అద్భుత కళఖండమే బాహుబలి. అప్పటిక వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే కేవలం ఓ ప్రాంతానికి మాత్రమే అనే భావన ఉండేది. కానీ బాహుబలి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ పేరు అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. ఈ సినిమాలోని ప్రతిపాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా సినిమాకే హైలెట్ గా నిలిచిన కట్టప్ప పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కటప్ప పాత్ర గురించి ఆ సినీ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. కట్టప్ప పాత్రను తొలుత సంజయ్ దత్ ను అనుకున్నామని, అయితే ఆయన ఎందుకు రాలేదు అనే విషయాలను ఈ ఇంటర్వ్యూలో విజయేంద్రప్రసాద్ వెల్లడించారు.

2015 జూలై 10వ తేదీ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మర్చిపోలేని రోజు. కారణం.. ఎన్నో రికార్డులను తిరగరాసిన, బాహుబలి సినిమా విడుదలైంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ వంటి పలువురు ప్రముఖులు నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టించి. ఇక సినిమా ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలోని ప్రతి పాత్రకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతి ప్రపంచ స్థాయికి చేరింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా గురించి సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ పలు ఆసక్తికర విషయాలను తెలియజేశారు.

బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రకు ఎంతటి పేరు వచ్చిందో  ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కట్పప్ప పాత్రలో ప్రముఖ నటుడు సత్యరాజ్ పరకాయ ప్రవేశం చేశారు. ఆ పాత్రకు సత్యరాజ్ తప్ప మరోకరు న్యాయం చేయలేరు అనేంతలా  నటించారు. అయితే వాస్తవానికి కట్టప్ప పాత్రను సంజయ్ దత్ కోసం రాశారంట. కానీ ఆయనకు అందుబాటులో లేకపోవడంతో సత్యరాజ్ ను సంప్రదించారట. అలా కట్టప్ప పాత్ర సంజయ్ దత్ నుంచి సత్యరాజ్ వద్దకు వెళ్లింది.

ఓ ఇంటర్వ్యూలో సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. “బాహుబలి సినిమాను ప్రభాస్ కోసం రాసిందే. కానీ కట్టప్పగా మాత్రం  సంజయ్ దత్ ను అనుకున్నాం. కానీ ఆయన అందుబాటులో లేకపోవడంతో సత్యరాజ్ ను అప్రోచ్ అయ్యాం.  ప్రభాస్ తో సినిమా చేయాలని మంచి కథకావాలని రాజమౌళి కోరాడు. అలానే స్త్రీ, పురుషులకు ఒకే విధమైన ప్రాధాన్యం ఉన్న యాక్షన్ డ్రామాగా ఉండాలన్నారు.  అప్పుడే కటప్ప పాత్ర పరిచయం చేశాను. అదేంటంటే ఓ విదేశీయుడు భారత్ కు వస్తాడు. ఓ వృద్ధుడు యువకులకు కత్తిసాము విద్యను నేర్పుతుంటే ఆ వీదేశీయుడు  కలుస్తాడు. మాటల సందర్భంలో బాహుబలి అనే వీరుడి గురించి వీదేశీయుడికి ఆ వృద్ధుడు వెల్లడిస్తాడు.

చేతిలో కత్తి ఉన్నంతకాలం అతన్ని ఎవరూ ఓడించలేరంటూ ఆ వృద్ధుడు చెబుతాడు.  అతడి స్టోరీ విన్న విదేశీయుడు.. ఆ బాహుబలిని కలవాలని కోరుతాడు. అయితే అతను లేడని తెలియడంతో ఆ వీరుడు ఎలా చనిపోయాడని వృద్ధుడిని అడుగుతాడు. తానే బాహుబలిని చంపిందని వృద్ధుడు వెల్లడిస్తాడు. అలానే రమ్యకృష్ణ పసిబిడ్డను ఎత్తుకుని నదిలోకి దిగడం, అలానే ఓ బాలుడు నిత్యం నది ఒడ్డునే ఆడుకోవడం.. ఇలా అన్ని అంశాలను కలిపి ఈ స్క్రీప్ట్ పూర్తి చేయడానికి నాలుగైదు నెలలు పట్టింది” అని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. మరి..కట్టప్ప పాత్ర విషయంలో విజయేంద్ర ప్రసాద్ తెలిపిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.