iDreamPost
android-app
ios-app

15 ఏళ్ళ ‘స్వీట్’ ప్రయాణం

  • Published Mar 12, 2020 | 6:22 PM Updated Updated Mar 12, 2020 | 6:22 PM
  • Published Mar 12, 2020 | 6:22 PMUpdated Mar 12, 2020 | 6:22 PM
15 ఏళ్ళ ‘స్వీట్’ ప్రయాణం

ప్రతి రెండుమూడేళ్లకు ప్రేక్షకుల అభిరుచులు డిమాండ్లు మారిపోతున్న ప్రస్తుత తరుణంలో ఒక హీరోయిన్ దశాబ్దంన్నర పాటు పరిశ్రమలో టాప్ ప్లేస్ లో కొనసాగడం చిన్న విషయం కాదు. అందులోనూ హీరోలకు ధీటుగా తనకంటూ సోలో మార్కెట్ ని సృష్టించుకోవడం అందరి వల్లా సాధ్యమయ్యేది కాదు. సూపర్ తో అనుష్కను పరిచయం చేసినప్పుడు నాగార్జున కానీ పూరి జగన్నాధ్ కానీ తను ఇంత స్థాయికి చేరుకుంటుందని ఊహించారో లేదో కానీ స్వీటీ అని అభిమానులు ముద్దుగా పిలిచే అనుష్క అంతకన్నా ఎక్కువే సాధించింది. మార్చి 12తో తన సినిమా ప్రయాణంలో 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న అనుష్క ఇంకా అలరిస్తూనే ఉంది. తన మూవీ కోసం ప్రేక్షకులు ఎదురు చూసే స్థాయిని ఇంకా పదిలంగా కాపాడుకుంటూనే ఉంది.

2005లో సూపర్ ద్వారా ఇంట్రొడ్యూస్ అయిన అనుష్కకు మొదటి సినిమానే హిట్ కాలేదు. సూపర్ ఆశించిన అంచనాలు అందుకోలేకపోయింది. ఆ తర్వాత మహానంది కూడా యావరేజ్ గానే నిలిచింది. మూడో సినిమా విక్రమార్కుడుతో రాజమౌళి చేతిలో పడ్డాక అనుష్క కెరీర్ ఊపందుకుంది. అటుపై జయాపజయాలు సమానంగా పలకరించినా బాలన్స్ చేసుకుంటూ వచ్చిన అనుష్కలోని నిజమైన నటి అరుంధతిలోనే బయట పడింది. 2009లో వచ్చిన ఈ విజువల్ వండర్ లో జేజెమ్మగా అనుష్క విశ్వరూపాన్ని ప్రేక్షకులు వసూళ్ల వర్షం కురిపించారు. స్టార్ హీరోలు సైతం షాకయ్యేలా ఇండస్ట్రీ రికార్డులు సాధించడం చూసి ఇతర భాషల్లోనూ అనుష్క గురించి మాట్లాడుకున్నారు.

తర్వాత వరసగా ప్రభాస్, మహేష్ బాబు, రవితేజ, గోపి చంద్, వెంకటేష్, అల్లు అర్జున్, విక్రమ్, రజనీకాంత్, సూర్య లాంటి స్టార్ హీరోలందరి సరసన నటించి ఎన్నో బ్లాక్ బస్టర్లు తన ఖాతాలో వేసుకుంది. ఇక బాహుబలి గురించి ప్రత్యేకించి చెప్పాల్సింది ఏమి లేదు. అటు తల్లిగా వయసు మళ్ళిన పాత్రలో ఇటు అమరేంద్ర బాహుబలి భార్యగా దేవసేనగా అనుష్కను తప్ప ఇంకెవరిని ఊహించుకోలేని రీతిలో అందులో జీవించేసింది. భాగమతి లాంటి హారర్ మూవీ ఆడిందంటే దానికి కారణం కేవలం అనుష్క పెర్ఫార్మన్స్ తప్ప మరొకటి కాదు. ఏప్రిల్ 2న విడుదల కాబోతున్న హారర్ థ్రిల్లర్ నిశ్శబ్దంతో మరో గొప్ప హిట్ అందుకుంటుందని ఫ్యాన్స్ చాలా అంచనాలతో ఉన్నారు. 15 ఏళ్ళు కాదు ఇంకో 25 ఏళ్ళు అయినా అనుష్కను చూసేందుకు ఇష్టపడేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom