iDreamPost
android-app
ios-app

ప్రభాస్ 21కి బ్లాస్టింగ్ కాంబినేషన్ : అఫీషియల్

  • Published Feb 26, 2020 | 7:29 AM Updated Updated Feb 26, 2020 | 7:29 AM
  • Published Feb 26, 2020 | 7:29 AMUpdated Feb 26, 2020 | 7:29 AM
ప్రభాస్ 21కి బ్లాస్టింగ్ కాంబినేషన్ : అఫీషియల్

బాహుబలి కోసం నాలుగేళ్లు సాహో కోసం రెండేళ్లు త్యాగం చేసిన డార్లింగ్ ప్రభాస్ స్పీడ్ పెంచుతున్నాడు. ప్రస్తుతం జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ పాన్ ఇండియా స్టార్ తో ప్రతిష్టాత్మక వైజయంతి బ్యానర్ ఓ భారీ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఇందాకే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దర్శకుడు ఎవరో కూడా చెప్పేశారు. మహానటితో తన సత్తాను చాటిన నాగ అశ్విన్ తో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కబోతోంది. హీరొయిన్ ఇతర టీం వివరాలు వెల్లడించలేదు.

వైజయంతి సంస్థ 50 సంవత్సరాల వేడుక జరుపుకునే సందర్భంలో ఇది సెట్ కావడం నిజంగా స్పెషల్ న్యూసే. అసలు ఎలాంటి లీక్ లేకుండా ఈ న్యూస్ బయటికి రాకుండా జాగ్రత్త వహించిన యూనిట్ సరైన టైంలో బ్లాస్టింగ్ అనౌన్స్ మెంట్ ఇచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి ఎందరో జెనరేషన్ హీరోలతో సినిమాలు తీసిన అశ్వినీదత్ కు ప్రభాస్ తో చేయలేదన్న లోటు మాత్రం అలాగే మిగిలిపోయింది.

మరోవైపు మహానటి వచ్చి రెండేళ్లు దాటుతున్నా నాగ అశ్విన్ ఏది తీస్తాడు అనే సస్పెన్సు కూడా ఇన్నాళ్లు కొనసాగింది. సో తను వర్క్ చేసింది ప్రభాస్ స్క్రిప్ట్ మీదే అన్న క్లారిటీ వచ్చేసింది. ఎవడే సుబ్రహ్మణ్యంతోనే తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నప్పటికీ హీరో లేకుండా చాలా క్లిష్టమైన మహానటి కథను తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఎమోషన్స్ ని చూపడంలో మాస్టర్ అయిన నాగ అశ్విన్ ఇప్పుడు ప్రభాస్ ని ఎలాంటి కథలో ఏ పాత్రలో చూపిస్తాడో అన్న ఉత్సుకత అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లోనూ మొదలయ్యింది. 400 కోట్ల బడ్జెట్ తో ఊహకందని థీమ్ తో ఇది తెరకెక్కబోతోందట. ఆ విజువల్ వండర్ అప్డేట్స్ కోసం ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio