iDreamPost
android-app
ios-app

కిలికి భాష ఉద్దేశం అదేనా? – Nostalgia

  • Published Feb 20, 2020 | 9:27 AM Updated Updated Feb 20, 2020 | 9:27 AM
కిలికి భాష ఉద్దేశం అదేనా? – Nostalgia

బాహుబలిలో కాలకేయ ప్రభాకర్ వాడిన కిలికి బాష గుర్తుందిగా. అర్థం కానీ పదాలతో చిత్ర విచిత్ర వాక్యాలతో రాజమౌళి చేయించిన ఈ ప్రయోగం బ్రహ్మాండంగా వర్కవుట్ అయ్యింది. ముఖ్యంగా పిల్లలు దీన్ని బాగా ఎంజాయ్ చేశారు. నిజానికి అది అసలు అది వాడుకలో ఉన్న భాషే కాదు. కానీ మనం సినిమా వరకే పరిమితం అనుకున్న కిలికి బాష నిజంగానే జనంలోకి రాబోతోంది.

తమిళ రచయిత మదన్ కార్కి తన బృందంతో కలిసి కిలికి బాషకు అక్షరాలు లిపిని తయారు చేసి రేపు లాంచ్ చేయబోతున్నాడు. జనం ఇదేదో సరదాగా చేసాననుకుంటారని భావించి రాజమౌళి చేతుల మీద దీన్ని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాడు. అంతేనా వరల్డ్ లోనే ఇది ఈజీ లాంగ్వేజ్ అంటూ ప్రమోషన్ కూడా మొదలుపెట్టేశాడు. ఎన్ని అక్షరాలు ఉంటాయి గ్రామర్ ఏంటి లాంటి అన్ని ప్రశ్నలకు రేపు వెబ్ సైట్ మొదలయ్యాక సమాధానం వెతుక్కోమంటున్నాడు. అసలే ఎక్కడికక్కడ దేశాల్లో రాష్ట్రాల్లో మాతృ భాషను కాపాడుకోవడమే అతి పెద్ద సవాల్ గా మారుతున్న తరుణంలో ఇలా కొత్తగా కిలికి బాషను విడుదల చేయడంలో ఆంతర్యం ఏమిటో వాళ్ళకే తెలియాలి.

ఒకవేళ దీన్ని సీరియస్ తీసుకుని క్లాసులు కూడా నిర్వహిస్తారేమో చూడాలి. అయితే దీనికి పెద్దగా కష్టపడనక్కర్లేదని సైట్ లో ఇచ్చిన సూచనల ప్రకారం శిక్షణ పొందితే చాలని చెబుతున్నాడు. ఇది ఎవరికి ఉపయోగపడుతుందో చెప్పలేం కానీ ప్రేమికులు మాత్రం ఇంట్లో వాళ్లకు స్నేహితులకు అర్థం కాకుండా కమ్యూనికేట్ చేయడానికి కిలికి భాషను ఎంచక్కా యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా బాగానే ఉంది కానీ మదన్ టీమ్ తాపత్రయం చూస్తుంటే కిలికి భాషలో సినిమా తీసి సబ్ టైటిల్స్ తో రిలీజ్ చేసినా ఆశ్చర్యం లేదు. రేపు అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా కిలికి లాంగ్వేజ్ మనముందుకు రాబోతోంది