iDreamPost
android-app
ios-app

మరో టికెట్ వర్త్ షో లోడింగ్… జక్కన్నకే ఇది సాధ్యం

  • Published Jul 11, 2025 | 11:08 AM Updated Updated Jul 11, 2025 | 11:08 AM

Baahubali The Epic: చాలా సింపుల్ కథను ఓ మంచి ఎలివేషన్ తో బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో.. విజువల్ గ్రాండియర్ గా చూపించాలి అంటే రాజమౌళి తర్వాతే ఎవరైనా. సింపుల్ కథలతో మ్యాజిక్ చేసి మూడు గంటల సేపు ఆడియన్స్ సీట్లకు అతుక్కునేలా చేయడం, ఆ సినిమా గురించి మరో ముప్పై ఏళ్ళైనా సరే మాట్లాడుకునేలా చేయడం కేవలం జక్కన్నకే సాధ్యం.

Baahubali The Epic: చాలా సింపుల్ కథను ఓ మంచి ఎలివేషన్ తో బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో.. విజువల్ గ్రాండియర్ గా చూపించాలి అంటే రాజమౌళి తర్వాతే ఎవరైనా. సింపుల్ కథలతో మ్యాజిక్ చేసి మూడు గంటల సేపు ఆడియన్స్ సీట్లకు అతుక్కునేలా చేయడం, ఆ సినిమా గురించి మరో ముప్పై ఏళ్ళైనా సరే మాట్లాడుకునేలా చేయడం కేవలం జక్కన్నకే సాధ్యం.

  • Published Jul 11, 2025 | 11:08 AMUpdated Jul 11, 2025 | 11:08 AM
మరో టికెట్ వర్త్ షో లోడింగ్… జక్కన్నకే ఇది సాధ్యం

చాలా సింపుల్ కథను ఓ మంచి ఎలివేషన్ తో బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో.. విజువల్ గ్రాండియర్ గా చూపించాలి అంటే రాజమౌళి తర్వాతే ఎవరైనా. సింపుల్ కథలతో మ్యాజిక్ చేసి మూడు గంటల సేపు ఆడియన్స్ సీట్లకు అతుక్కునేలా చేయడం, ఆ సినిమా గురించి మరో ముప్పై ఏళ్ళైనా సరే మాట్లాడుకునేలా చేయడం కేవలం జక్కన్నకే సాధ్యం. దాని వెనుక ఉన్న అతని కృషి , శ్రమ , పట్టుదల, కమిట్మెంట్.. అన్నీ ప్రతి ఫ్రేమ్ లోను కనిపిస్తూనే ఉంటాయి. ఇక తాజాగా బాహుబలి పదవ వార్షికోత్సవం జరిగింది. ఈ సెలెబ్రేషన్స్ లో మూవీ టీం అంతా పార్టిసిపేట్ చేశారు. నెట్టింట ప్రభాస్ న్యూ లుక్ ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో చూస్తూనే ఉన్నాము. ఈ సందర్భంగా బాహుబలి ది ఎపిక్ ను రేరెలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పటివరకు రీరిలీజ్ చేసిన సినిమాలు ఒకెత్తు.. ఈ సినిమా రీరిలీజ్ ఒకెత్తు. ఎందుకంటే ఇప్పటివరకు సినిమాలన్నీ మహా అయితే ఖ్వాలిటీ పెంచి లేదా డిలీటెడ్ సీన్స్ యాడ్ చేసి రీరీలీజ్ చేశారు. వాటికే బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిసింది. ఇక బాహుబలి అంటే ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇలా రెండు భాగాలుగా ఉన్న సినిమాను ఒకే భాగంగా కుదించి రిలీజ్ చేయడం అనేది.. మరో కొత్త సినిమాతో సమానమే. పైగా ఇది జక్కన్నకు కచ్చితంగా సవాల్ లాంటిదే. ఎందుకంటే రెండు భాగాలలో కూడా ఎక్కడా అనవసరమైన కంటెంట్ లేదు. ప్రతిదీ ఒక దానితో ఒకటి ఇంటెర్లింక్ అయ్యి ఉంటుంది. అలా ఆరు గంటలు ఉన్న మూవీని మూడు గంటలకు ట్రిమ్ చేయడం నిజంగా సాహసమే. సో కచ్చితంగా ఇది ఇంకో టికెట్ వర్త్ మూవీ అవుతుందని చెప్పొచ్చు. ఇలా చేయడం కేవలం జక్కన్నకు మాత్రమే సాధ్యం.

ఆల్రెడీ ఎడిటింగ్ పనులు కూడా మొదలయ్యాయట. SSMB 29 షూట్ లో బ్రేక్ దొరికినప్పుడల్లా జక్కన్న ఈ ఎడిటింగ్ పనులు చేసుకుంటున్నాడట. ఈ రీమాస్టర్డ్ వెర్షన్ కోసం జక్కన్న స్పెషల్ ఎడిటింగ్ టీం ను ఏర్పాటు చేసుకున్నాడట. ప్రేక్షకుల నుంచి ఎలాంటి కంప్లైంట్స్ రాకుండా.. మరో కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చేలా ఎలా ఉండాలో ఇన్పుట్స్ ఇస్తున్నాడట రాజమౌళి. ఒకవేళ ఈ సినిమా భారీ రేంజ్ లో వర్కౌట్ అయితే… వరల్డ్ మార్కెట్ లో కూడా సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. ఇది రీరిలీజ్ అనేకంటే న్యూరిలీజ్ అని చెప్పుకోవచ్చేమో. ఎందుకంటే ఇదంతా ఓ సినిమా తీయడంతో సమానం. సో జక్కన్న దీనికి కూడా టీం ని వెంటపెట్టుకుని తన పాన్ ఇండియా ప్రమోషన్ ఫార్ములా అప్లై చేస్తాడేమో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.