తెలుగులో ఇటీవలి కాలంలో వెబ్ సిరీస్ ల నిర్మాణం ఊపందుకుంది. జీ5 నుంచి వచ్చిన గాడ్స్ అఫ్ ధర్మపురి, రెక్కీ లాంటివి మంచి విజయం సాధించడంతో తాజాగా ఏటిఎంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. దీనికి హరీష్ శంకర్ కథను అందించడం ఒక విశేషమైతే దిల్ రాజు సమర్పకుడిగా స్మాల్ స్క్రీన్ డెబ్యూ ఇదే కావడం మరో ప్రత్యేకత. సి చంద్రమోహన్ దర్శకత్వం వహించారు. ప్రమోషన్లు గట్రా గట్టిగానే చేశారు. ట్రైలర్ చూశాక సినిమా రేంజ్ కంటెంట్ ఉందని అర్థమైపోవడంతో […]
ఇప్పుడంతా ఓటిటి కాలం. ఒకప్పుడంటే థియేటర్లు మాత్రమే ఆప్షన్ గా ఉండేవి. తర్వాత శాటిలైట్ ఛానల్స్ వచ్చాయి. కొనేళ్లు విసిడి డివిడిలు రాజ్యమేలాయి. వాటి వైభవం పూర్తిగా తగ్గిపోయాక ఇప్పుడా స్థానాన్ని డిజిటల్ కంపెనీను ఆక్రమించుకుంటున్నాయి. వినియోగదారుడి సౌకర్యమే లక్ష్యంగా ఇంటికే ఎంటర్ టైన్మెంట్ తీసుకొస్తున్న వీటి తాకిడి ఏ స్థాయిలో ఉందంటే కొత్త సినిమాలతో మొదలుపెట్టి వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ దాకా అన్నీ వీటిలో చూసేంతగా జనాలు అలవాటు పడిపోతున్నారు. ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ […]
రేపు దసరా పండగ సందర్భంగా థియేటర్లలో గాడ్ ఫాదర్, ది ఘోస్ట్, స్వాతిముత్యంలు సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. వీటికే మాత్రం తీసిపోని తరహాలో ఓటిటి కంటెంట్ కూడా రెడీ అవుతోంది. ఇవాళ చెప్పాపెట్టకుండా అమెజాన్ ప్రైమ్ లో ‘ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ రిలీజ్ చేసేశారు. కనీస పబ్లిసిటీ లేకుండా మైత్రి లాంటి పెద్ద బ్యానర్ మూవీ ఇలా రావడం ఆశ్చర్యమే. పట్టుమని నెల తిరక్కుండానే మూడో వారంలోనే డిజిటల్ లో రావడం విశేషం. […]
అమెజాన్ ప్రైమ్ amazon prime లార్డ్ ఆఫ్ ద రింగ్స్ బాగా నచ్చిన వారికి అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ కానున్న The Lord of the Rings: The Rings of Power కచ్చితంగా ఎట్రాక్ట్ చేస్తుంది. ఇది తెలుగులో రావడం ఎక్కువమంది ఆడియన్స్ కి నచ్చే విషయం. నెట్ ఫ్లిక్స్ netflix ఈ వారం నెట్ ఫ్లిక్స్ లో పెద్దగా ఆకట్టుకొనే సినిమాలు, సీరీస్ లు లేవు. కాని ఫ్యామిలీ […]
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ నటించిన పాన్ ఇండియా సినిమా విక్రాంత్ రోణ. కొత్తనేపథ్యం, కొత్త తరహా కథనం. కేజీఎఫ్ తర్వాత వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. తెలుగులో నిర్మాతలకు లాభలనిచ్చింది. జూలై 28న రిలీజైన ఈ పాన్ ఇండియా మూవీ అంచనాలకు తగ్గట్టుగానే రిలీజైన నాలుగు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్లో చేరింది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజైన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి రాబోతోంది. […]
సినిమా ఎంత పెద్ద హిట్ అయినా మహా అయితే నెల రోజుల కంటే ఎక్కువ రన్ రాలేని పరిస్థితుల్లో థియేటర్ కు వెళ్లలేని ఆడియన్స్ ఓటిటి కోసం ఎదురు చూడటం సహజం. అందులోనూ ఇటీవలే టాలీవుడ్ సక్సెస్ రేట్ విపరీతంగా పెరగడంతో వాటిని ఎప్పుడెప్పుడు స్మార్ట్ స్క్రీన్ మీద చూద్దామాని ఎదురు చూస్తున్న వాళ్ళ సంఖ్య కోట్లలో ఉంటోంది. ఓసారి ఆ వివరాలపై ఓ లుక్ వేద్దాం.దర్శకుడు హను రాఘవపూడి ఆవిష్కరించిన అందమైన దృశ్య కావ్యం ”సీతారామం’ […]
కరోనా కాలంలో థియేటర్లు మూతబడినప్పుడు నిర్మాతల పాలిట ఓటిటిలు ఎంత పెద్ద కల్పతరువుగా వ్యవహరించాయో చూశాం. ఒకవేళ ఇవే లేకపోతే వి, నిశ్శబ్దం, జగమే తంత్రం లాంటి పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాలు చవిచూసి నష్టాలు మిగిల్చేవి. ఒరేయ్ బుజ్జిగా లాంటి చిన్న చిత్రాలను సైతం ఇవి ఆదుకున్న సందర్భాలు ఎన్నో. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. చేదు అనుభవాలు ఎదురుకున్న దృష్యా మీడియం రేంజ్ మూవీస్ కి సవాలక్ష కండీషన్లు పెడుతున్నాయి. […]
అక్కినేని కాంపౌండ్ నుంచి వచ్చినప్పటికీ హీరోగా అంతగా సక్సెస్ కాలేకపోయిన సుశాంత్ అల వైకుంఠపురముతో సపోర్టింగ్ రోల్స్ కు వచ్చేసిన సంగతి తెలిసిందే. తాజాగా డిజిటల్ డెబ్యూ కూడా చేసేశాడు. గత ఏడాది వరుడు కావలెనుతో ప్రయత్నం చేసి ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన దర్శకురాలు లక్ష్మి సౌజన్యకు ఓటిటి డెబ్యూ ఇది. మా నీళ్ల ట్యాంక్ పేరుతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఇవాళ్టి నుంచి జీ5లో అందుబాటులోకి వచ్చింది. ట్రైలర్ గట్రా ప్రమోషన్లు ఏదో ఎంటర్ […]
తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల షోలు టైంతో సంబంధం లేకుండా రద్దవుతున్నాయి. భారీ వర్షాలకు తోడు మొన్న వచ్చిన కొత్త సినిమాల్లో కంటెంట్ మరీ యావరేజ్ గా కూడా లేకపోవడంతో జనం థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదు. ది వారియర్ బుకింగ్స్ కూడా చాలా నెమ్మదిగా ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హ్యాపీ బర్త్ డేకు రెండో రోజు నుంచే నెగటివ్ షేర్స్ మొదలయ్యాయి. జార్జ్ రెడ్డి ఫేమ్ సందీప్ మాధవ్ నటించిన […]
థియేటర్లలో అదరగొట్టిన సినిమాలు ఓటీటీల్లోనూ సక్సెస్ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ ఇప్పటికీ ఓటీటీలో టాప్10లోనే ఉంది. విక్రమ్ ను స్ట్రీమింగ్ లో చూసేవాళ్లు ఎక్కువున్నారు. కేజీఎఫ్ 2కి ఓటీటీలోనూ అదే క్రేజ్. థియేటర్లలో సినిమాను చూసి ఎంజాయ్ చేసినవాళ్లు, ఓటీటీలో నచ్చిన పాట, సీన్ కోసం పదేపదే సినిమాలు వాచ్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ కు రిపీట్ అడియన్స్ చాలా ఎక్కువ. ఇక మీడియం, చిన్న సినిమాల కోసం. ఓటీటీలోనే వెతుకుతున్నారు. చాలా సినిమాలు నెల రోజులకే ఓటీటీ ప్లాట్ఫామ్లోకి […]