iDreamPost
android-app
ios-app

భర్త బర్త్ డే.. భార్య చేసిన పనికి మైండ్ పోతుంది. OTTలో షాకింగ్ మూవీ!

  • Published Jul 30, 2024 | 3:00 AM Updated Updated Jul 30, 2024 | 3:00 AM

OTT Murder Mystery Thriller : కొన్ని సినిమాలు మొదట చూడడానికి కాస్త బోర్ కొట్టినా కానీ.. చూడగా చూడగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఇక క్లైమాక్స్ కి అయితే బుర్ర గిర్రున తిరుగుతుంది. ఈ సినిమా కూడా అలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

OTT Murder Mystery Thriller : కొన్ని సినిమాలు మొదట చూడడానికి కాస్త బోర్ కొట్టినా కానీ.. చూడగా చూడగా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఇక క్లైమాక్స్ కి అయితే బుర్ర గిర్రున తిరుగుతుంది. ఈ సినిమా కూడా అలాంటిదే. మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో ఓసారి చెక్ చేసేయండి.

  • Published Jul 30, 2024 | 3:00 AMUpdated Jul 30, 2024 | 3:00 AM
భర్త బర్త్ డే.. భార్య చేసిన పనికి మైండ్ పోతుంది. OTTలో షాకింగ్ మూవీ!

ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథలన్నీ.. ఒక మర్డర్ జరిగిన తర్వాత.. ఆ మర్డర్ ఎవరు చేశారు .. ఎందుకు చేశారు అనే కాన్సెప్ట్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇక ఆ కేసును సాల్వ్ చేసేటప్పుడు .. దానికి సంబంధించిన ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి. పోలీసులు ఆ కేసును ఏ విధంగా సాల్వ్ చేస్తారు ? అనే దానిపై కథ ఇంట్రెస్టింగ్ గా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. ఇక మూవీ క్లైమాక్స్ కి బుర్ర గిర్రున తిరుగుతుంది. అసలు ఏంటి ఈ మూవీ.. ఈ సినిమాను మీరు చూశారా లేదా.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేయండి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఆల్బర్ట్ అనే ఓ వ్యక్తికీ క్రిప్టో కరెన్సీ మీద సడెన్ గా ఇంట్రెస్ట్ వస్తుంది. దాని వలన ఆల్బర్ట్ చాలా ఎక్కువ డబ్బును సంపాదిస్తాడు . అయితే ఆల్బర్ట్ దగ్గర నుంచి.. ఆ డబ్బును రాబట్టడం కోసం చాలా మంది ట్రై చేస్తారు. ఈ క్రమంలో సడెన్ గా ఎవరో అతనిని చంపేస్తారు. సో ఈ కేసును టేక్ అప్ చేయడానికి రాజీవ్ అనే ఆఫీసర్ ను నియమిస్తారు. రాజీవ్.. రాబర్ట్ డెత్ ఎలా జరిగింది అనే విషయంపై విచారణ మొదలుపెడతాడు. ముందుగా రాబర్ట్ గురించి.. అతని భార్య రాగిణిని ఇంట్రాగేట్ చేస్తారు. కానీ ఆమె నుంచి అంత ఇన్ఫర్మేషన్ రాదు. ఈ క్రమంలో వారికి ఆల్బర్ట్ చనిపోయిన ముందు రోజు అతని బర్త్ డే పార్టీ జరిగినట్లు తెలుస్తుంది. దీనితో ఆ పార్టీలో ఏం జరిగింది అనే విషయాలపై.. ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు.

కట్ చేస్తే వారికి ఈ కేసు విషయంలో చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. ఆ బర్త్ డే పార్టీకి.. చాలా పెద్ద పెద్ద వారు వచ్చారని.. రాబర్ట్ కి చాలా మందితో సంబంధాలు ఉన్నాయని వారికి తెలుస్తుంది. అయితే ఈ కేసు క్రిప్టో కరెన్సీ తో కూడా ముడిపడి ఉంది కాబట్టి.. వారికి ఈ విచారణలో చాలా ఇబ్బందులు ఎదురౌతూ ఉంటాయి. రాబర్ట్ ఫోన్ లో అసలు క్రిప్టో కరెన్సీ కి సంబంధించిన సెర్చ్ లిస్ట్ కూడా ఉండదు. మరి అసలు ఎలా అంత డబ్బు సంపాదించాడనే డౌట్ వస్తుంది. అయితే కేవలం డబ్బు కోసమే ఆల్బర్ట్ ను చంపారని మాత్రం వారికి అర్ధమౌతుంది. అలాగే ఆ బర్త్ డే పార్టీలోనే ఎదో జరిగి ఉంటుందనే అనుమానాలు కూడా బలపడతాయి. దీనితో బర్త్ డే పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కరిని విచారించినా కానీ.. వారికి అసలు హంతకులు ఎవరనేది మాత్రం తెలియదు. అసలు చివరికి ఏమైంది ? ఈ కేసులో ఇంకా ఎంత మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ? ఆల్బర్ట్ వైఫ్ ఈ కేసులో పోలీసులకు సహాయం చేస్తుందా లేదా ! ఆ ఇంట్లో వాళ్లంతా రాబర్ట్ డెత్ విషయంలో నిజాలే చెప్తున్నారా ? అసలు కిల్లర్ ఎవరై ఉంటారు ? ఇవ్వన్నీ తెలియాలంటే.. “హౌస్ ఆఫ్ లైస్” అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా ప్రస్తుతం జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio