iDreamPost
android-app
ios-app

OTT లోకి అనుపమ వివాదాస్పద మూవీ.. ఎప్పుడంటే !

  • Published Aug 05, 2025 | 4:12 PM Updated Updated Aug 05, 2025 | 4:12 PM

కొన్ని సినిమాలు అనుకోకుండా కొన్ని వివాదాలలో చిక్కుకుంటూ ఉంటాయి. అయితే అనుపమ మూవీ మాత్రం రిలీజ్ కాకముందే వివాదాలతో ఫేమస్ అయింది. ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించిన కోర్టు డ్రామా J.S.K. ఈ సినిమాలో సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

కొన్ని సినిమాలు అనుకోకుండా కొన్ని వివాదాలలో చిక్కుకుంటూ ఉంటాయి. అయితే అనుపమ మూవీ మాత్రం రిలీజ్ కాకముందే వివాదాలతో ఫేమస్ అయింది. ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించిన కోర్టు డ్రామా J.S.K. ఈ సినిమాలో సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

  • Published Aug 05, 2025 | 4:12 PMUpdated Aug 05, 2025 | 4:12 PM
OTT లోకి అనుపమ వివాదాస్పద మూవీ.. ఎప్పుడంటే !

కొన్ని సినిమాలు అనుకోకుండా కొన్ని వివాదాలలో చిక్కుకుంటూ ఉంటాయి. అయితే అనుపమ మూవీ మాత్రం రిలీజ్ కాకముందే వివాదాలతో ఫేమస్ అయింది. ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించిన కోర్టు డ్రామా J.S.K. ఈ సినిమాలో సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించారు. కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై J. ఫణీంద్ర కుమార్ ఈ సినిమాను నిర్మించారు. మోలీవుడ్ లో ఈ సినిమా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందింది. అయితే ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేషన్ విషయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ తో సుదీర్ఘ వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ వివాదాలన్నీ తొలిగిపోయి ఇప్పుడు ఓటిటి లోకి రానుంది ఈ సినిమా.

J.S.K – జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ కథ విషయానికొస్తే.. ప్రముఖ న్యాయవాది డేవిడ్ అబెల్ డోనోవన్ హాయంతో లైంగిక వేధింపుల నుండి బయటపడిన జానకి విద్యాధరన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. న్యాయం కోసం పోరాడుతున్న ఓ యువతి, ఆ న్యాయవాది చివరకు గెలిచారా? లేదా? అసలు జానకి జీవితంలో ఏం జరిగింది? న్యాయం కోసం చేయాల్సి వచ్చిన పోరాటం ఏంటి? అనేది ఈ కథా సారాంశం. కోర్టు డ్రామాలు ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది.

ఇప్పుడు ఈ మూవీ తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 15 నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ zee5 లో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి వచ్చే వీకెండ్ ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.