iDreamPost
android-app
ios-app

OTT లో మరో ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ కామిడి డ్రామా.. ఎక్కడంటే !

  • Published Jul 29, 2025 | 3:24 PM Updated Updated Jul 29, 2025 | 3:24 PM

ఒక వారంలో ఓటిటి లో ఎన్నో సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ వాటిలో కేవలం కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటూ ఉంటాయి. ఈ మధ్య చాలా వరకు హర్రర్ , సస్పెన్స్ థ్రిల్లర్స్ కె ఆడియన్స్ పెద్ద పీట వేస్తున్నారు

ఒక వారంలో ఓటిటి లో ఎన్నో సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ వాటిలో కేవలం కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటూ ఉంటాయి. ఈ మధ్య చాలా వరకు హర్రర్ , సస్పెన్స్ థ్రిల్లర్స్ కె ఆడియన్స్ పెద్ద పీట వేస్తున్నారు

  • Published Jul 29, 2025 | 3:24 PMUpdated Jul 29, 2025 | 3:24 PM
OTT లో మరో ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ కామిడి డ్రామా.. ఎక్కడంటే !

ఒక వారంలో ఓటిటి లో ఎన్నో సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ వాటిలో కేవలం కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటూ ఉంటాయి. ఈ మధ్య చాలా వరకు హర్రర్ , సస్పెన్స్ థ్రిల్లర్స్ కె ఆడియన్స్ పెద్ద పీట వేస్తున్నారు. ఫ్యామిలీ డ్రామాలు చాలా రేర్ గా వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఓ తమిళ ఫ్యామిలి కామిడి డ్రామా ఓటిటిలో ఎంట్రీ ఇచ్చింది. కాబట్టి ఈ సినిమాను అసలు మిస్ చేయకుండ చూడాల్సిందే. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కథేంటి అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఇన్బా చెల్లెలు గిరిజకు పెళ్ళైన పదేళ్ల తర్వాత ఓ కొడుకు పుడతాడు. ఆ బాబును అంతా ముద్దుగా లడ్డు అని పిలుస్తూ ఉంటారు. హీరోయిన్ రేఖ గిరిజ ఫ్రెండ్. గిరిజ ప్రెగ్నెన్సీ టైం లో ఇన్బా ను చూసి అతనితో ప్రేమలో పడుతుంది. పెద్దలను ఒప్పించి వీరు పెళ్లి చేసుకుంటారు. ఇక అసలు కథ అప్పటినుంచి స్టార్ట్ అవుతుంది. ఇన్బా కు లడ్డు అంటే చాలా ఇష్టం. వాళ్లంతా ఒకే ఇంట్లో కలిసి ఉండడం వలన.. ఇన్బా కు రేఖకు ప్రైవేట్ స్పేస్ దొరకదు. వీరిద్దరి మధ్యకు లడ్డు వస్తూనే ఉంటాడు. ఆ తర్వాత ఏమైంది? దాని వలన ఇంట్లో ఏమైనా గొడవలు వచ్చాయా ? ఇన్బా రేఖ బానే ఉంటారా ? చివరికి ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా పేరు ‘మామన్’ . తక్కువ బడ్జెట్ తో మూవీని రూపొందించినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సినిమా అదరగొట్టింది. థియేటర్ లో రిలీజ్ అయినా రెండు నెలలకు ఈ సినిమా ఓటిటి లోకి వచ్చింది . ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వీకెండ్ ఓ మంచి ఫ్యామిలీ డ్రామా చూడాలంటే ఈ సినిమా బెస్ట్ చాయిస్. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.