iDreamPost
android-app
ios-app

డైరెక్ట్ గా OTT లోకి ఇంట్రెస్టింగ్ Sci-Fi థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

  • Published Jul 25, 2024 | 1:30 AMUpdated Jul 25, 2024 | 1:30 AM

OTT Sci-Fi Movie: ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ మూవీస్ కూడా బాగానే క్రేజ్ సంపాదించుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయిపోతుంది. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

OTT Sci-Fi Movie: ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ మూవీస్ కూడా బాగానే క్రేజ్ సంపాదించుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయిపోతుంది. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

  • Published Jul 25, 2024 | 1:30 AMUpdated Jul 25, 2024 | 1:30 AM
డైరెక్ట్ గా OTT లోకి ఇంట్రెస్టింగ్ Sci-Fi థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

సైన్స్ ఫిక్షన్ సినిమాలకు కూడా ఇప్పుడు ప్రేక్షకులు బాగానే అట్ట్రాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఓటీటీ లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వచ్చిన సినిమాలను చూసేసి ఉంటారు. అయినా సరే ఈ జోనర్ లో ఇంకా ఏమైనా సినిమాలు ఉన్నాయేమో అని సెర్చ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దాదాపు ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలలో అయితే ఫ్యూచర్ గురించి చెప్తూ ఉంటారు. లేదా ఎవరికి తెలియని గతం గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. ఈ రెండిటి గురించి తెలుసుకోవాడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో ఓటీటీ లోకి మరొక ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ రాబోతుంది. దానికి సంబంధించిన వివరాలు చూసేద్దాం.

ఓటీటీ లోకి రాబోతున్న ఈ సినిమా పేరు.. “గ్యారా గ్యారా”. కాలంలో వెనక్కు వెళ్ళి గతాన్ని మార్చవచ్చా అనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో.. ఈ మూవీని తెరకెక్కించారు మేకర్స్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. టైమ్ అనేది అసలు నిజంగా ఉందా ? అందరు టైమ్ టైమ్ అంటూ పరిగెడుతూ ఉంటారు. అదంతా నిజామా లేక భ్రమ ? ఇలా చాలా మంది చాలా సార్లు ఆలోచించే ఉంటారు. ఇలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమానే ఇది.కాగా ఈ సినిమాలో ధైర్య కార్వా, కృతికా కామ్రా, రాఘవ్ జుయెల్, గౌతమి కపూర్, గౌరవ్ శర్మ, ముక్తి మోహన్ లాంటి వారు ముఖ్య పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాను నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 లో రిలీజ్ చేయనున్నారు. ఆగష్టు 9 నుంచి జీ5 లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు మేకర్స్.

ఇక గ్యారా గ్యారా ట్రైలర్ విషయానికొస్తే.. ఇందులో 1990 లో ఓ పోలీస్ ఆఫీసర్ ప్రెసెంట్ లో ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ తో వాకీటాకీ ద్వారా సంప్రదిస్తూ ఉంటాడు. అది కూడా కేవలం 60 సెకండ్స్ మాత్రమే సరిగ్గా రాత్రి 11.11 సమయంలో వీరిద్దరి మధ్య కన్వర్సేషన్ జరుగుతుంది. వీరిద్దరూ కలిసి గతంలో జరిగిన ఓ క్రైం ను ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు వేరు వేరు కాలాల్లో ఉన్నట్లు మాత్రం వాళ్లకు తెలియదు. మరి వీరిద్దరూ కలిసి.. వర్తమానాన్ని, భవిష్యత్తును మార్చగలరా.. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాల్సిందే. మరి ఈ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి