iDreamPost
android-app
ios-app

కన్నడ OTT రికార్డ్స్ బద్దలుకొట్టిన ‘అయ్యనా మానే’.. ఇప్పుడు తెలుగులో కూడా

  • Published May 14, 2025 | 3:21 PM Updated Updated May 14, 2025 | 3:21 PM

సినిమాలతో పాటు ఈ మధ్య కాలంలో కొన్ని వెబ్ సిరీస్ లు కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. అలాంటి వాటిలో ఇప్పుడు చెప్పుకోబోయే వెబ్ సిరీస్ కూడా ఒకటి. త్వరలోనే ఈ సిరీస్ తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు రాబోతుంది. మరి ఈ సిరీస్ ఏంటో చూసేద్దాం.

సినిమాలతో పాటు ఈ మధ్య కాలంలో కొన్ని వెబ్ సిరీస్ లు కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. అలాంటి వాటిలో ఇప్పుడు చెప్పుకోబోయే వెబ్ సిరీస్ కూడా ఒకటి. త్వరలోనే ఈ సిరీస్ తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు రాబోతుంది. మరి ఈ సిరీస్ ఏంటో చూసేద్దాం.

  • Published May 14, 2025 | 3:21 PMUpdated May 14, 2025 | 3:21 PM
కన్నడ OTT రికార్డ్స్ బద్దలుకొట్టిన ‘అయ్యనా మానే’.. ఇప్పుడు తెలుగులో కూడా

కంటెంట్ బావుంటే లాంగ్వేజ్ తో సంబంధం లేదు. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు సినిమాలతో పాటు డైరెక్ట్ గా OTT లో రిలీజ్ అయ్యే వెబ్ సిరీస్ లు కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. అలాంటి వాటిలో ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ కూడా ఒకటి. కుషీ రవి, అక్షయ నాయక్, మానసి సుధీర్ ప్రధాన పాత్రలుగా ‘అయ్యనా మానే’ . దీనికి రమేష్ ఇందిర దర్శకత్వం వహించారు. జీ5 కన్నడ ఒరిజినల్ సిరీస్ అయినా ఈ సిరీస్ IMDbలో 8.6 రేటింగ్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే కన్నడతో పాటు హిందీ తమిళ భాషల్లో కూడా ఈ సిరీస్ కు మంచి ఆదరణ లభించింది. ఇక ఇప్పుడు ఈ సిరీస్ మే 16 నుంచి తెలుగులో కూడా స్ట్రీమింగ్ కానుంది.

అసలు ఈ సిరీస్ లో చెప్పుకోడానికి అంతలా ఏముంది. ఎందుకు ఈ సిరీస్ అంత పాపులర్ అవుతుంది. అనే విషయానికొస్తే.. ఈ వెబ్ సిరీస్ కథ అంతా కూడా చిక్ మంగళూరు నేపథ్యంలో కొనసాగుతూ ఉంటుంది. మొత్తం ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ ఈ కథ కొనసాగుతూ ఉంటుంది. ప్రతి మరణం కూడా ఓ శాపం వలెనే అని వారంతా నమ్ముతూ ఉంటారు. అలా జాజి ఆ కుటుంబంలోకి ప్రవేశించినపుడు తన ప్రాణాలను ప్రమాదం ఉందని పసిగడుతుంది. అలా అక్కడ నమ్మకమైన ఓ మనిషి ద్వారా ఆ ఇంటి రహస్యాలను బయటకు తీస్తూ వస్తుంది. అసలు వారంతా చనిపోవడానికి కారణం ఏంటి ? జాజి ఎలాంటి ఆధారాలను బయటకు రాబట్టింది ? నిజంగా శాపం వలెనే వారు చనిపోతున్నారా ? అసలు ఆ శాపం వెనుక గల కారణం ఏంటి ? ఇవన్నీ తెలియాలంటే ఈ సస్పెన్స్ ఫ్యామిలీ థ్రిల్లర్ చూడాల్సిందే. ఈ సిరీస్ తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుందని ఎలాంటి సందేహం లేకుండా చెప్పేయొచ్చు. కాబట్టి ఈ సిరీస్ ను అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరిఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.