Swetha
హర్రర్ మూవీస్ లో కాస్త కామిడి.. కాస్త సస్పెన్స్ యాడ్ చేస్తే ఇక సినిమా అంతా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈ క్రమంలో ఓ పాపులర్ హర్రర్ కామిడి మూవీ త్వరలో ఓటిటిలోకి రాబోతుంది. డైరెక్టర్ ఎస్.ప్రేమ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సెల్వ రాఘవన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, గీతికా తివారి , సంతానం లాంటి వారు ముఖ్య పాత్రలలో నటించారు.
హర్రర్ మూవీస్ లో కాస్త కామిడి.. కాస్త సస్పెన్స్ యాడ్ చేస్తే ఇక సినిమా అంతా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈ క్రమంలో ఓ పాపులర్ హర్రర్ కామిడి మూవీ త్వరలో ఓటిటిలోకి రాబోతుంది. డైరెక్టర్ ఎస్.ప్రేమ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సెల్వ రాఘవన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, గీతికా తివారి , సంతానం లాంటి వారు ముఖ్య పాత్రలలో నటించారు.
Swetha
హర్రర్ సినిమాలంటే ఎవరికీ మాత్రం ఇష్టం ఉండదు . కానీ అదే హర్రర్ మూవీస్ లో కాస్త కామిడి.. కాస్త సస్పెన్స్ యాడ్ చేస్తే ఇక సినిమా అంతా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈ క్రమంలో ఓ పాపులర్ హర్రర్ కామిడి మూవీ త్వరలో ఓటిటిలోకి రాబోతుంది. డైరెక్టర్ ఎస్.ప్రేమ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సెల్వ రాఘవన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, గీతికా తివారి , సంతానం లాంటి వారు ముఖ్య పాత్రలలో నటించారు. మరి ఈ సినిమా ఏంటి .. దీని కథేంటి .. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. హిచ్ కాక్ అనే దర్శకుడు .. కిస్సా ను సీక్రెట్ గా ఓ సినిమాను చూడడానికి పర్సనల్ గా పిలుస్తాడు. కిస్సా తన స్టైల్ లో మూవీ రివ్యూస్ ఇస్తూ ఉంటాడు. కిస్సా అది కూడా ఓ నార్మల్ మూవీ అనుకుని అక్కడకు వస్తాడు. కానీ ఒక్కసారి ప్రొజెక్టర్ ఆన్ అవ్వగానే కిస్సా ప్రపంచం ఒక్కసారిగా తలకిందులుగా మారిపోతుంది. కొంతసేపటికీ అతను దెయ్యాలు భూతాలు ఉండే ఓ క్రూయిజ్ లో కన్ను తెరుస్తాడు. అక్కడ ఎలా ఉండాలి ఏంటి అని అంతా ఓ డైరీలో రాసిపెట్టి ఉంటుంది. అతనితో పాటు మరో ఇద్దరు రివ్యూవర్స్ కూడా అక్కడ చిక్కుకుంటారు. దీనితో వారు డైరీలో విషయాలు డీకోడ్ చేయడానికి రెడీ అవుతారు. పైగా కిస్సా గర్ల్ ఫ్రెండ్ కూడా ఓ ఆత్మగా మారినట్టు కనిపిస్తుంది. ఆ తర్వాత ఏమైంది ? అసలు రివ్యూవర్స్ ను ఎందుకు టార్గెట్ చేశారు ? సినిమా స్టార్ట్ అవ్వగానే మరో ప్రపంచానికి వెళ్ళడానికి రీజన్ ఏంటి ? చివరకు ఏమైంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ సినిమా పేరు ‘డెవిల్స్ డబుల్: నెక్ట్స్ లెవల్’ సినిమా టైటిల్ కార్డ్స్ పడుతున్నప్పటికీ చివరి వరకు సీట్ ఎడ్జ్ లో కూర్చోపెడుతుంది. . ‘దిల్లుకు దుడ్డు’లో ఫ్రాంచైజీలో నాలుగో భాగంగా ఇది రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జీ5 లో జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మళయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వచ్చేస్తుంది. కాబట్టి ఈ వెరైటీ హర్రర్ కామిడి థ్రిల్లర్ ను అసలు మిస్ చేయకుండా చూసేయండి. ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.