iDreamPost
android-app
ios-app

Demonte Colony 2: OTT లోకి డీమాంటీ కాలనీ 2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

  • Published Aug 29, 2024 | 11:03 AM Updated Updated Aug 29, 2024 | 11:07 AM

Demonte Colony 2 OTT Release Date: హారర్‌ చిత్రాలు అభిమానించే ప్రేక్షకులకు డీమాంటీ కాలనీ 2 బెస్ట్‌ ఆప్షన్‌ అని చెప్పవచ్చు. ఈ క్రమంలో సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌కు సంబంధించి ఆసక్తికర వార్త వినిపిస్తుంది. ఆ వివరాలు..

Demonte Colony 2 OTT Release Date: హారర్‌ చిత్రాలు అభిమానించే ప్రేక్షకులకు డీమాంటీ కాలనీ 2 బెస్ట్‌ ఆప్షన్‌ అని చెప్పవచ్చు. ఈ క్రమంలో సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌కు సంబంధించి ఆసక్తికర వార్త వినిపిస్తుంది. ఆ వివరాలు..

  • Published Aug 29, 2024 | 11:03 AMUpdated Aug 29, 2024 | 11:07 AM
Demonte Colony 2: OTT లోకి డీమాంటీ కాలనీ 2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

హారర్‌ సినిమాలు ఇష్టపడే వారికి డీమోంటి కాలనీ మూవీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. హారర్‌ మూవీల్లో ఈ చిత్రానికి సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. తమిళ్‌ మూవీ అయినా.. తెలుగులోనూ ఆకట్టుకుంది.. ప్రేక్షకులను భయపెట్టింది. ఈ సినిమాతోనే అజయ్‌ ఆర్ జ్ఞానముత్తు దర్శకుడిగా పరిచయం అయ్యారు. సుమారు ఎనిమిదేళ్ల క్రితం అనగా 2015లో వచ్చిన డీమాంటీ కాలనీ భారీ విజయం సాధించిన నేపథ్యంలో దీని సీక్వెల్‌గా డీమాంటీ కాలనీ 2 తాజాగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. గత వారం అనగా ఆగస్టు 23, 2024న తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఫస్ట్‌ పార్ట్‌ లానే.. డీమాంటీ కాలనీ 2 కూడా ప్రేక్షకులను విపరీతంగా భయపెట్టడంలో సక్సెస్‌ అయ్యింది. సినిమాకు మంచి టాక్‌ వచ్చింది.

ఇక ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే డీమాంటీ కాలనీ 2 డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ5’ తీసుకుంది. తమిళ వెర్షన్ ‘జీ తమిళ్’లో స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం ఓటీటీ హక్కులు మాత్రమే కాదు… శాటిలైట్ హక్కులను కూడా ‘జీ టీవీ’ నెట్వర్క్ సంస్థ తీసుకుంది. ఈ క్రమంలో డీమాంటీ కాలనీ 2 ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌పై ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక థియేటర్లో ప్రేక్షకులను భయపెట్టిన డీమాంటీ కాలనీ 2 సెప్టెంబర్‌ చివరి వారంలో ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే ఖచ్చితమైన విడుదల తేదీ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ సెప్టెంబర్‌లో మాత్రం కచ్చితంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటున్నారు.

ఇక ఈ చిత్రంలో అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్ హీరోహీరోయిన్లుగా నటించగా.. అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా ఫస్ట్‌ పార్ట్‌లోని క్లైమాక్స్‌ సీన్‌తో డీమాంటీ కాలనీ 2 మూవీ ప్రారంభం అవుతుంది. ఓ సందర్భంలో ప్రధాన పాత్రధారులంతా ఆ ఇంట్లోకి వెళ్తారు. వారికి అక్కడ నమ్మలేని, భయంకర ఘటనలు ఎదురవుతాయి. డీమాంటీ ఇంట్లో ఉన్న ఆ శక్తి ఏంటి, దాని నుంచి ఎలా ప్రాణాలు కాపాడుకున్నారు అనేది మిగతా స్టోరీ. హారర్‌ సినిమాలు ఇష్టపడే వారికి డీమాంటీ కాలనీ 2 బెస్ట్‌ ఆప్షన్‌ అని.. ఒంటరిగా సినిమా చూస్తే గ్రేట్‌ అంటున్నారు.. ఇప్పటికే ఈ మూవీ చూసిన వాళ్లు.