ఇటీవలి కాలంలో DYI విధానం బాగా పాపులర్ అవుతోంది. ఏదైనా సొంతంగా తయారుచేయడం, సొంతగా సృష్టించడం, సృజన చేయడంపై ప్రజలకు ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్లుగానే సోషల్ మీడియాలోనూ ట్యూటోరియల్స్, లెర్నింగ్ వీడియోస్ సంఖ్య సైతం బాగా పెరిగింది. అయితే ఇప్పుడు అలాంటి వీడియోనే ఒక యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. కేరళలోని తిరువనంతపురంలో జరగిన ఈ సంఘటన వైరల్ గా మారింది. ఒక మైనర్ బాలుడు యూట్యూబ్ లో చూసి వైన్ ఎలా చేయాలో తెలుసుకున్నాడు. […]
డిజిటల్ విప్లవం వచ్చిన కొత్తలో యూట్యూబ్ పేరు పెద్దగా ఎవరికీ తెలిసింది కాదు. కానీ, స్మార్ట్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయిన తరుణంలో, ఇప్పుడు అన్ని రకాల కంటెంట్ కు యూట్యూబ్ వీడియోలు రిఫెరెన్స్ గా మారుతున్నాయి. అలా ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదించేవారికి యూట్యూబ్ అద్భుతమైన వేదికైంది. తాజాగా ఇన్నేళ్ళ యూట్యూబ్ ప్రయాణంలో 1బిలియన్ పైన వ్యూస్ వచ్చిన మ్యూజిక్ వీడియోలన్నింటినీ ఒక దగ్గరకు చేర్చింది యూట్యూబ్. భక్తి గీతాల దగ్గర నుంచి వెస్టర్న్ బీట్స్ వరకు […]
భారతదేశంలోని డిజిటల్ మీడియా నియంత్రించడానికి మరో చట్టం రానుంది. వచ్చే వారం పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం తీసుకురానున్న సవరించిన బిల్లు ప్రకారం , ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవచ్చు. ఇప్పటివరకు ఏ చట్టం, లేదా, ఏ ప్రభుత్వ నియంత్రణ ద్వారా నిర్వచించని మీడియా రిజిస్ట్రేషన్ కోసం, బిల్లు రానుంది. ఇందులో డిజిటల్ మీడియాకూడా భాగమే. ఇకపై డిజిటల్ మీడియా వార్తలను చట్టంలో చేర్చడానికి ప్రెస్ , పీరియాడికల్స్ రిజిస్ట్రేషన్ బిల్లును సవరించే ప్రక్రియను, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ […]
సృజనాత్మకత పేరుతో వచ్చే కొన్ని ప్రకటనలు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తుంటాయి. క్రియేటివిటీతో ఫలానా ఉత్పత్తిని ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నంలో హద్దు దాటిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ప్రకటనలపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నేరుగా యూట్యూబ్, ట్విట్టర్ లకు లేఖ రాసింది. కొన్ని పర్ఫ్యూమ్/ బాడీ స్ప్రే ప్రకటనలు శృతి మించుతున్నాయని కేంద్ర శాఖ పేర్కొంది. సామూహిక అత్యాచారాలను ప్రోత్సహించేలా చిత్రీకరించిన సదరు ప్రకటనలను వెంటనే తొలగించాలని స్పష్టం చేసింది. మహిళల నైతికత, […]
అదేంటి ఎప్పుడో వచ్చిన మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా ఇప్పుడు వంద కొట్టడం ఏమిటా అని ఆశ్చర్యపడకండి. ఈ రికార్డు వేరే. యుట్యూబ్ లో వంద మిలియన్ల వ్యూస్ సాధించిన మొదటి తెలుగు స్ట్రెయిట్ మూవీగా శ్రీమంతుడు ఖాతాలో కొత్త ఘనత వచ్చి చేరింది. ఇప్పటిదాకా ఏ టాలీవుడ్ సినిమాకు ఈ ఫీట్ సాధ్యం కాలేదు. గతంలో పాటలు, లిరికల్ వీడియోస్, వీడియో సాంగ్స్ కు ఇంత కన్నా ఎక్కువ వీక్షణలు వచ్చాయి కాని రెండున్నర గంటల […]
స్టార్ హీరోల సినిమాలకు వసూళ్లు తగ్గినప్పుడు అభిమానులను మళ్ళీ ఆకర్షించడం కోసం, ప్రేక్షకులకు మరోసారి ఆప్షన్ ఇచ్చేందుకు ఎడిటింగ్ టేబుల్ లో తీసేసిన సీన్లు, పాటలు కలపడం కొత్తగా వచ్చిన ట్రెండ్ కాదు. నిన్న సరిలేరు నీకెవ్వరు టీమ్ త్వరలో కొన్ని సన్నివేశాలను జోడించబోతున్నామని అవి చాలా హిలేరియస్ గా ఉంటాయని చెప్పారు. నిజానికి అవి అంత కామెడీ ఉన్న ఎపిసోడ్లే అయితే ముందే అలా కోతకు గురయ్యేవి కాదుగా. ఇప్పుడు ఇవి యాడ్ చేసినంత మాత్రాన […]