iDreamPost
android-app
ios-app

వార్నింగ్ ఇచ్చిన 2 రోజులకే.. అన్నంత పని చేసిన మా అధ్యక్షుడు మంచు విష్ణు!

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లుగా వ్యాఖ్యలు, వీడియోలు చేస్తూ వార్తల్లో నిలిచాడు ప్రణీత్ హనుమంతు. అతడిపై నటులు స్పందిచడంతో జైలు పాలయ్యాడు. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లుగా వ్యాఖ్యలు, వీడియోలు చేస్తూ వార్తల్లో నిలిచాడు ప్రణీత్ హనుమంతు. అతడిపై నటులు స్పందిచడంతో జైలు పాలయ్యాడు. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు

వార్నింగ్ ఇచ్చిన 2 రోజులకే.. అన్నంత పని చేసిన మా అధ్యక్షుడు మంచు విష్ణు!

సోషల్ మీడియా వచ్చాక వెర్రి వెయ్యి తలలు వేస్తుంది. ఏదైనా చేయోచ్చు, ఎలా అయినా మాట్లాడొచ్చు అంటూ యూట్యూబ్, ఇన్ స్టా, ట్విట్టర్ వేదికగా కొంత మంది రెచ్చిపోతున్నారు. అవి కాస్త హద్దులు మీరిపోతున్నాయి. కొంత మంది వ్యక్తులు, వీడియోలను టార్గెట్ చేస్తూ వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపైన సరైన నియంత్రణ లేకపోవడతో మనలెవడ్రా ఆపేది అంటూ ఇష్టమొచ్చినట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అందుకు ఉదాహరణ యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు ఘటనే. ఇతరుల వీడియోలపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేస్తూ, మాటల్లో చెప్పలేని పదజాలం వాడుతూ కామెంట్స్ చేసింది ఈ బృందం. చివరకు తండ్రి, కూతుళ్ల బంధంపై కూడా అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ శునకానందాన్ని పొందారు.

స్టార్స్ ఈ వీడియోపై స్పందించడంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రణీత్ హనుమంతును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. ఇదిలా ఉంటే.. ఈ ట్రోలర్ల రోస్టింగ్‌కు సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా బలౌతున్నారు. ఈ విషయంపై తాజాగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా స్పందించాడు.  హీరోయిన్లు, హీరోల భార్యలపై కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అసభ్యకరమైన వీడియోలు, కామెంట్స్ చేస్తున్నాయని తమకు కంప్లయింట్స్ వచ్చాయని, సోషల్ మీడియా వేదికగా సెక్సువల్ అబ్యూస్ చేయడం సరికాదని హెచ్చరించాడు విష్ణు. ఫేక్ పేజీలతో ఇలాంటి వీడియోలు చేస్తున్నారని,  హీరో హీరోయిన్లపై అసభ్యకరమైన వీడియోలు, కామెంట్స్ చేసిన వారు.. ఆయా యూట్యూబ్ ఛానల్స్ నుండి 48 గంటల్లోగా తీసేయాలని, లేకుంటే యూట్యూబ్‌తో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 అంతేకాకుండా సైబర్ సెక్యూరిటీకి కంప్లయింట్ చేసి.. యూట్యూబ్ టీంతో చర్చించి  ఆయా ఛానల్ తొలగించేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంచు విష్ణు.  వార్నింగ్ ఇచ్చిన 2 రోజులకే.. అన్నంత పని చేసిన మా అధ్యక్షుడు మంచు విష్ణు.  ఐదు యూట్యూబ్ ఛానల్స్ పై కొరడా ఝుళిపించింది ‘మా’. ఇచ్చిన గడువు పూర్తికావడంతో అసభ్యకరమైన వీడియోలు, కామెంట్స్ తొలగించని యూట్యూబ్ ఛానల్స్ ను తొలగించింది. ఐదు యూట్యూబ్ ఛానల్స్ పై కొరడా ఝుళిపించింది ‘మా’. ఇది ప్రారంభం మాత్రమే అని పేర్కొంది. ‘జస్ట్ వాచ్ బీబీబీ’, ‘ట్రోల్స్ రాజా’, ‘బచిన లలిత్’, ‘హైదరాబాద్ కుర్రాడు’, ‘ఎక్స్‌వైజెడ్ ఎడిట్జ్ 007’ ఛానల్స్ ఉన్నాయి. ముందు ముందు మరిన్ని ఛానెల్స్ డిలీట్ అయ్యేలా చేస్తామని చెప్పుకొచ్చింది. వార్నింగ్ ఇచ్చిన 48 గంటల్లోపే చెప్పిన పని చేసింది మా. యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తెలంగాణలోని నాంపల్లి కోర్టు గురువారం పంపింది.