iDreamPost
android-app
ios-app

సీరియల్ నటి శ్రీవాణికి రోడ్డు ప్రమాదం.. టెన్షన్ లో భర్త విక్రమాదిత్య

  • Published Oct 14, 2024 | 5:05 PM Updated Updated Oct 14, 2024 | 5:05 PM

Serial actress Srivani : మూడు రోజుల క్రితం శ్రీవాణి ఫ్యామిలీ అంతా కలిసి చీరాల బీచ్ కు వెళ్తుండగా శ్రీవాణికి యాక్సిడెంట్ అయినట్లు.. శ్రీవాణి భర్త విక్రమాదిత్య చెప్పుకొచ్చాడు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Serial actress Srivani : మూడు రోజుల క్రితం శ్రీవాణి ఫ్యామిలీ అంతా కలిసి చీరాల బీచ్ కు వెళ్తుండగా శ్రీవాణికి యాక్సిడెంట్ అయినట్లు.. శ్రీవాణి భర్త విక్రమాదిత్య చెప్పుకొచ్చాడు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Oct 14, 2024 | 5:05 PMUpdated Oct 14, 2024 | 5:05 PM
సీరియల్ నటి శ్రీవాణికి రోడ్డు ప్రమాదం.. టెన్షన్ లో భర్త విక్రమాదిత్య

బుల్లి తెర సీరియల్ నటి శ్రీవాణి అందరికి పరిచయమే. సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య బాగా ఫేమస్ అవుతుంది. ఈ క్రమంలో తాజాగా శ్రీవాణి భర్త విక్రమాదిత్య శ్రీవాణికి యాక్సిడెంట్ అయినట్లు చెప్పుకొచ్చాడు. మూడు రోజుల క్రితం శ్రీవాణి ఫ్యామిలీ అంతా కలిసి చీరాల బీచ్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పాడు. శ్రీవాణి కార్ కి యాక్సిడెంట్ అవ్వడంతో.. ఆమెకు బలమైన గాయాలు తగిలాయి. హ్యాండ్ కు ఫ్రాక్చర్ అవ్వడం , నుదిటిపైన గట్టి దెబ్బ తగలడంతో.. ప్లాస్టిక్ సర్జరీ చేయమని డాక్టర్స్ ను కోరారట. ఎందుకంటే వారు నిత్యం తెరమీద కనపడాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి సమయంలో మార్క్స్ కనిపించడకుండా ఉండేందుకు శ్రీవాణి భర్త అలా కోరారట.

కానీ డాక్టర్స్ మాత్రం దానికి స్టిచెస్ మాత్రమే వేయాలని చెప్పారంటూ విక్రమాదిత్య తెలియజేశారు. అలాగే ఈ వీడియో పోస్ట్ చేస్తూ.. శ్రీవాణి త్వరగా రికవర్ అవ్వాలని .. విష్ చేయాలంటూ అందరిని కోరారు. ఇక వీడియో చూసిన ఆమె ఫాలోవెర్స్ కూడా అలాగే విష్ చేస్తూ ఉన్నారు. ప్రతి రోజు అనేక రకాల కొత్త కంటెంట్ తో అందరిని ఉత్సాహ పరిచే శ్రీవాణి.. అలాంటి పరిస్థితిలో ఉండడం చూసి ఆమె అభిమానులు చింతిస్తున్నారు. వీలైనంత త్వరగా ఆమె కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా భార్య భర్తలిద్దరూ కలిసి అనేక సీరియల్స్ లో నటిస్తూ ఉంటారు. ఇదే విషయాన్నీ శ్రీవాణి భర్త కూడా తెలియజేశారు. వారిద్దరూ కొత్త కొత్త డెసిషన్స్ తీసుకున్నాం అని.. భార్య భర్తలుగా ఓకే సీరియల్ లో నటిచడానికి కూడా కమిట్ అయ్యామని చెప్పుకొచ్చాడు.

అంతా బాగానే జరుగుతుంది అనుకునే సమయంలో.. ఇలాంటి ఓ సంఘటన జరిగిందని బాధపడ్డారు. అలాగే ఆ వేంకటేశ్వరుడి దయ వలన ప్రమాదం నుంచి బయటపడ్డామంటూ ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నారు.. ఆమె భర్త , కూతురు. ఇక వీరి కష్టాన్ని చూసిన వారంతా కూడా మీ మీద పడిన దిష్టి పోయింది..కాబట్టి కంగారుపడకండి అంటూ వారికి దైర్యం చెప్తున్నారు. శ్రీవాణి త్వరగా కోలుకుని.. మునిపటిలా వారి ముందుకు రావాలని రాసుకొస్తున్నారు. ఏదేమైనా ఈ మధ్య కాలంలో ఇలాంటి రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. వారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్ని ప్రమాదాలు తప్పడం లేదు.

Jojobet GirişBetcioivermectin tabletpusulabetpusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Giriş