iDreamPost
android-app
ios-app

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నఇంటర్వ్యూ! ఈమె కథ ఏమిటో తెలుసా?

  • Published Aug 22, 2024 | 1:30 PM Updated Updated Aug 22, 2024 | 1:30 PM

Krishna Kumari YouTube Interview: ఓ నెల రోజులుగా సోషల్‌ మీడియాలో కృష్ణకుమారి అనే మహిళకు చెందిన ఇంటర్వూ తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకు ఆమె కథ ఏంటో తెలుసా.. లేదా అయితే ఇది చదవండి

Krishna Kumari YouTube Interview: ఓ నెల రోజులుగా సోషల్‌ మీడియాలో కృష్ణకుమారి అనే మహిళకు చెందిన ఇంటర్వూ తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకు ఆమె కథ ఏంటో తెలుసా.. లేదా అయితే ఇది చదవండి

  • Published Aug 22, 2024 | 1:30 PMUpdated Aug 22, 2024 | 1:30 PM
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నఇంటర్వ్యూ! ఈమె కథ ఏమిటో తెలుసా?

కృష్ణ కుమారి.. ఓ నెల రోజులుగా ఈమె పేరు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఆమెకు సంబంధించిన ఇంటర్వ్యూ తెగ వైరల్‌​ అవుతోంది. పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉన్న తనను ఓ వ్యక్తి బలవంతంగా కిడ్నాప్‌ చేసి పెళ్లి చేసుకున్నాడని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె తన పిల్లలు కావాలని కోరుతూ.. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ని ఆశ్రయించింది. ఇక ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించింది. ఇక ఇంటర్వ్యూ చూసిన వారు.. రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు. ఇక సదరు మహిళ పేరు కృష్ణ కుమారి. హైదరాబాద్‌లోనే నివాసం ఉండేది. మరి ఆమె జీవితంలో ఏం జరిగింది.. ఇంటర్వ్యూలో ఆమె ఏం చెప్పింది.. ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది అనే పూర్తి వివరాలు మీ కోసం..

ఈమహిళ పేరు కృష్ణకుమారి. ఆమెది చాలా ఉన్నతమైన కుటుంబం. తండ్రి పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పని చేసేవాడు. ఎస్సైగా విధులు నిర్వహించేవాడు. ఈ మహిళ బీకాం కంప్యూటర్స్‌ పూర్తి చేసింది. ఇలా ఉండగా ఆమెకు బస్టాప్‌లో బాలు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పది రోజుల వ్యవధిలోనే అతడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీని గురించి కృష్ణకుమారి తన తల్లిదండ్రులకు చెబితే వారు అంగీకరించలేదు. తాత మద్దతు ఉండటంతో.. చివరకు ఆమె.. ప్రేమించిన వ్యక్తి బాలుని వివాహం చేసుకుంది. ఆ వ్యక్తి అనాథ.. జాబ్‌ లేదు. దాంతో వివాహం అయిన ప్రారంభంలో ఆస్తి కోసం గొడవ చేశాడు. కృష్ణకుమారికి ఆమె తల్లిదండ్రులు ఇస్తానన్న ఆస్తిని తన పేరు మీద రాయాలని డిమాండ్‌ చేశాడు. అందుకు వారు అంగీకరించ లేదు. దాంతో కృష్ణకుమారి తల్లిదండ్రుల దగ్గరే ఉంది.

ఎనిమిది నెలల తర్వాత తిరిగి కాపురానికి వెళ్లింది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. అయితే సంపాదన లేదన్న కారణంతో బాలు.. తన భార్య కృష్ణ కుమారికి అబార్షన్‌ చేయించాడు. దీని గురించి ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో వారు అతడిని నిలదీశారు. అయితే తనకు సరైన సంపాదన లేని కారణంగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాడు బాలు. ఆ తర్వాత మరో ఏడాది పాటు కృష్ణకుమారి తల్లిదం‍డ్రుల వద్దే ఉంది. సంవత్సరం తర్వాత బాలు వచ్చి కృష్ణ కుమారిని తనతో సొంత ఊరు ప్రకాశం జిల్లా, మార్కాపురం తీసుకెళ్లాడు. అప్పటికే అతడికి వీఆర్‌ఓ జాబ్‌ వచ్చింది. ఇక అప్పటి నుంచి వారి జీవితం బాగానే ఉంది. ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు.

ఇన్‌స్టా రీల్స్‌ ఎంట్రీతో మొత్తం తలకిందులు

భర్త, ఇద్దరు పిల్లలతో సంతోషంగా సాగుతున్న వీరి జీవితంలో ఇన్‌స్టా రీల్స్‌ భూకంపం సృష్టించాయి. భర్త అంగీకారంతో కృష్ణకుమారి రీల్స్‌ చేయసాగింది. ఇలా ఉండగా ఆమెకు ఇన్‌స్టాలో విజయలక్ష్మి అనే మహిళ పరిచయం అయ్యింది. అది కాస్త స్నేహంగా మారింది. దాంతో కృష్ణకుమారి తన అడ్రెస్‌ చెప్పడంతో.. విజయలక్ష్మి ఆమె ఇంటికి వచ్చి ఉండసాగింది. వెళ్లిపోమ్మని చెబితే.. వెళ్లను ఇక్కడే పనిమనిషిగా ఉంటాను అంటూ కృష్ణకుమారి ఇంట్లోనే ఉండసాగింది. నాలుగు నెలలు వారి ఇంట్లోనే ఉంది. ఈ సమయంలో కృష్ణకుమారి భర్త బాలుకి, విజయలక్ష్మికి మధ్య సంబంధం ఏర్పడటం.. కృష్ణకుమారి విజయలక్ష్మికి 4 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. వీటి గురించి అడగ్గా గొడవ జరిగి.. విజయలక్ష్మి కృష్ణకుమారి ఇంటి నుంచి వెళ్లిపోయింది.

కామేష్‌ ఎంట్రీతో..

కృష్ణకుమారి ఇంటి నుంచి వెళ్లి పోయిన విజయలక్ష్మి.. జ్యోతి, కామేష్‌ అనే ఇద్దరిని తీసుకొచ్చి బాలు ఇంటి ఎదురుగానే ఓ హోటల్‌ పెట్టుకుని ఉండేది. జ్యోతి, కామేష్‌లు లవర్స్‌.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కొన్ని రోజుల తర్వాత కృష్ణకుమారి మళ్లీ విజయలక్ష్మితో మాట్లాడసాగింది. ఇలా ఉండగా ఓ రోజు వీరంతా కలిసి విజయవాడ గుడికి వెళ్లారు. అక్కడ కామేష్‌ కృష్ణకుమారిని పెళ్లి చేసుకుని తన ఇంటికి తీసుకెళ్లాడు. భర్త, ఇద్దరు పిల్లలను వదిలేసి ఆమె అతడి వెంట వెళ్లిపోయింది. కొన్నాళ్ల పాటు కామేష్‌ ఇంట్లోనే ఉంది. ఈలోపు అతడు కృష్ణకుమారిని హింసించడం, కొట్టడం చేయసాగాడు. అతడి టార్చర్‌ భరించలేక.. ఆమె అక్కడ నుంచి వచ్చేసింది.

ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఎవరూ కృష్ణకుమారిని చేరదీయడం లేదు. ఈ క్రమంలో పిల్లలు తనకు కావాలంటూ కృష్ణకుమారి.. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌లో చెప్పుకొచ్చింది. ముందు కామేష్‌ తనను కిడ్నాప్‌ చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని చెప్పిన కృష్ణకుమారి.. ఇంటర్వ్యూలో మాత్రం.. అతడిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాని చెప్పి షాకిచ్చింది. ఇక ఇంటర్వ్యూ చూసిన వారు ఆమె గురించి నీది అమాయకత్వమో.. అతి తెలివో అర్థం కావడం లేదంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Jojobet GirişmeritbetmeritbetholiganbetTophillbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler