iDreamPost
android-app
ios-app

ఫ్రీ స్ట్రీమింగ్ కు వచ్చేసిన భారీ బడ్జెట్ థ్రిల్లర్ మూవీ ‘ది లేడి కిల్లర్’.. ఎక్కడంటే ?

  • Published Sep 04, 2024 | 4:34 PM Updated Updated Sep 04, 2024 | 4:34 PM

Thriller Movie The Lady Killer In Youtube: కొన్ని సార్లు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలు.. ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడతాయన్న సంగతి తెలియనిది కాదు. ఈ క్రమంలో అలాంటి ఓ సినిమా ఫ్రీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Thriller Movie The Lady Killer In Youtube: కొన్ని సార్లు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలు.. ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడతాయన్న సంగతి తెలియనిది కాదు. ఈ క్రమంలో అలాంటి ఓ సినిమా ఫ్రీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 04, 2024 | 4:34 PMUpdated Sep 04, 2024 | 4:34 PM
ఫ్రీ స్ట్రీమింగ్ కు వచ్చేసిన భారీ బడ్జెట్ థ్రిల్లర్ మూవీ ‘ది లేడి కిల్లర్’.. ఎక్కడంటే ?

కొన్ని సినిమాలకు భారీ బడ్జెట్ కేటాయించినా.. స్టార్ క్యాస్టింగ్ ఉన్నా సరే.. ఆయా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడతాయి. అయితే థియేటర్ లో రిలీజ్ అయినా ఏ సినిమా అయినా సరే ఓటీటీ లోకి రావాల్సిందే. ఒక్కోసారి థియేటర్ లో మెప్పించకపోయినా సరే.. ఓటీటీ లో మాత్రం మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతూ ఉంటాయి. అయితే ఇలా భారీ బడ్జెట్ తో రూపొందించి.. బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయినా సినిమాలలో ది లేడీ కిల్లర్ సినిమా కూడా.. ఇప్పటివరకు రిలీజ్ అయినా ప్లాప్ సినిమాలలో అతి పెద్ద ప్లాప్ మూవీ ఇదే. దీనితో ఈ సినిమాను ఏ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ కొనకపోవడంతో.. ఫ్రీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాం.

ది లేడి కిల్లర్ మూవీని ఏకంగా రూ.45 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. ఇక భారీ అంచనాల మధ్యన థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం రూ.45 వేలు మాత్రమే రాబట్టడం విచిత్రం. పైగా ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ కిడ్ అర్జున్ కపూర్ , భూమి ఫడ్నేకర్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా ప్లాప్ అయింది. గత ఏడాది నవంబర్ లోనే ఈ మూవీ రిలీజ్ కాగా థియేట్రికల్ రన్ కూడా ఎక్కువ రోజులు సాగలేదు. మొదట ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ దక్కించుకోగా.. ప్లాప్ అవ్వడంతో నెట్ ఫ్లిక్స్ కూడా పక్కన పెట్టేసింది. దీనితో ఏ ఓటీటీ కొనకపోవడంతో.. డైరెక్ట్ గా యూట్యూబ్ లోనే రిలీజ్ చేశారు. ఎలాగూ ఫ్రీ నే కాబట్టి.. అసలు ఈ మూవీ ఎందుకు ప్లాప్ అయింది.. స్టోరీ ఏంటో ఓ లుక్ వేసేయండి.

అయితే మూవీ యూట్యూబ్ లోకి వచ్చి రెండు రోజులు గడిచింది. ఫ్రీ గా అందుబాటులోకి తీసుకువచ్చినా కానీ ఈ మూవీకి ఆదరణ లభించకపోవడం గమనార్హం. రెండు రోజుల్లో ఈ మూవీకి కేవలం 4 లక్షల వ్యూస్ మాత్రమే వచ్చాయి. అలాగే కామెంట్స్ కూడా చాలా దారుణంగా పెడుతున్నారు. అయితే అసలు ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలో కూడా సరిగా జరగలేదని.. అర్జున్ కపూర్, భూమి ఫడ్నేకర్ ప్రమోషన్స్ చేయమని తేల్చి చెప్పారని.. సమాచారం. సినిమా జనాల్లో రిజిస్టర్ అవ్వకపోవడం కూడా ప్లాప్ అవ్వడానికి ఒక రీజన్ అని భావిస్తున్నారు నెటిజన్లు. అసలు సినిమా ఏంటో.. ఈ సినిమా కథేంటో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.