iDreamPost
android-app
ios-app

స్విమ్మింగ్ పూల్ లో ప్రాణాలు.. OTTలో ది బెస్ట్ థ్రిల్లర్!

  • Published Jul 01, 2024 | 8:42 PM Updated Updated Jul 01, 2024 | 8:42 PM

OTT Suggestions- Best Thriller The Pool Movie: ఓటీటీలో ఒక బెస్ట్ థ్రిల్లర్ ఉంది. మీరు ఈ సినిమాని ఇంకా చూడకపోతే మాత్రం ఒక మంచి థ్రిల్లర్ మిస్ అయినవాళ్లు అవుతారు.

OTT Suggestions- Best Thriller The Pool Movie: ఓటీటీలో ఒక బెస్ట్ థ్రిల్లర్ ఉంది. మీరు ఈ సినిమాని ఇంకా చూడకపోతే మాత్రం ఒక మంచి థ్రిల్లర్ మిస్ అయినవాళ్లు అవుతారు.

  • Published Jul 01, 2024 | 8:42 PMUpdated Jul 01, 2024 | 8:42 PM
స్విమ్మింగ్ పూల్ లో ప్రాణాలు.. OTTలో ది బెస్ట్ థ్రిల్లర్!

ఓటీటీలో చాలానే జానర్స్ అందుబాటులో ఉంటాయి. వాటిలో బాగా డిమాండ్ ఉన్న జానర్స్ హారర్, యాక్షన్, కామెడీ. ఇవి కాకుండా.. అందరూ ఇష్టపడే ఒక జానర్ ఉంది. అవి థ్రిల్లర్ మూవీస్. ఒక సరైన థ్రిల్లర్ చూస్తే మీరు కచ్చితంగా వావ్ అనాల్సిందే. అలాంటి ఒక థ్రిల్లర్ మూవీని మీకోసం తీసుకొచ్చాం. ఇందులో పెద్దగా కథ కూడా ఉండదు. కానీ, ఒక్కో సీన్ మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. అంతేకాకుండా.. మీరు ఈ సినిమాని ఫ్రీగానే చూసేయచ్చు. మరి.. ఆ మూవీ ఏది? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? అంత వావ్ అనిపించే పాయింట్స్ ఏమున్నాయి? అన్నీ తెలుసుకుందాం.

థ్రిల్లర్స్ అంటే సినిమాలో ఒక మంచి కాన్ ఫ్లిక్ట్ పాయింట్ ఉండాలి. అది ఈ మూవీలో చాలా మంచిదే ఉంది. కథ కూడా పెద్దగా ఏమీ ఇబ్బంది పెట్టదు. స్ట్రైట్ అవే చెప్పుకోవచ్చు. కథ ఏంటంటే.. హీరోకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అతను తన సమయాన్ని ఎక్కువగా అక్కడే గడుపుతూ ఉంటాడు. అతను స్విమ్ చేయడాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అతనికి ప్రేయసి కూడా ఉంటుంది. ఆమె కూడా తరచూ అక్కడికి వస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు హీరో పూల్ లో ఉండగా.. అక్కడ పనిచేసే వ్యక్తి పూల్ లో వాటర్ ని తీసేందుకు బటన్ నొక్కేసి వెళ్లిపోతాడు. అయితే ఆ సమయంలో పూల్ లో హీరో రిలాక్స్ అవుతున్న విషయాన్ని గమనించకుండా వెళ్లిపోతాడు. తీరా హీరో లేచి చూసే సమయానికి సగం నీళ్లు వెళ్లిపోయి ఉంటాయి.

The Pool

నిజానికి ఆ పూల్ లోతు 6 మీటర్లు. పైకి చేరుకోవడానికి అంత లోతులో మెట్లు ఏమీ ఉండవు. పైకి రావడానికి ఎంత ట్రై చేసినా కూడా అది వర్కౌట్ కాదు. హెల్ప్ హెల్ప్ అని ఎంత అరిచినా ఎవరూ పట్టించుకోరు. తన ఫోన్ కూడా పైనే ఉంటుంది. దానిని తీసుకునే ప్రయత్నంలో అది లోపల పడి ఆఫ్ అయిపోతుంది. కాసేపటికి తన గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. ఇతనికి సర్ ప్రైజ్ ఇవ్వాలి అని పూల్ లోకి దూకాలి అనుకుంటుంది. హీరో వద్దు అని అరవడంతో.. కంగారు పడి తల కాంక్రీట్ బల్లకు గుద్దుకుని పూల్ లో పడిపోతుంది.

వీళ్లు ఇద్దరు స్విమ్మింగ్ పూల్ లోనే ఇరుక్కుపోతారు. వారి దరిద్రనికి అక్కడ ఉన్న డ్రైనేజ్ పైప్ లో నుంచి ఒక మొసలి వస్తుంది. అలా ప్రతి సీన్ ఎంతో ఆసక్తిగా సాగుతూ ఉంటుంది. ఆ మొసలి ఎంట్రీతో కథ మొత్తం మారిపోతుంది. వీళ్లిద్దరి ప్రాణాలు ఇప్పుడు 6 మీటర్ల లోతు స్విమ్మింగ్ పూల్ లో మొసలి చేతిలో ఉంటాయి. మరి.. వాళ్లు బతికి బయట పడ్డారా? ఆ రాత్రి వాళ్లు తమ ప్రాణాలను కాపాడుకున్నారా? తెలియాలి అంటే మీరు ది పూల్ అనే సినిమా చూడాల్సిందే. ఇది ఓటీటీల్లో ఉండేది. కానీ, ఇప్పుడు అందుబాటులో లేదు. కానీ, యూట్యూబ్ లో మీరు సెర్చ్ చేస్తే ఫ్రీగానే చూసేయచ్చు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş