Tirupathi Rao
OTT Movie Suggestions- Best Horror Movie: హారర్ చిత్రాలు ఇష్టపడే వాళ్లు కూడా ఈ సినిమా చూస్తే కాస్త కంగారు పడతారు. ఎందుకంటే ఇందులో వచ్చే సీన్స్, మ్యూజిక్, షాట్స్ అన్నీ కూడా మిమ్మల్ని వణికిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
OTT Movie Suggestions- Best Horror Movie: హారర్ చిత్రాలు ఇష్టపడే వాళ్లు కూడా ఈ సినిమా చూస్తే కాస్త కంగారు పడతారు. ఎందుకంటే ఇందులో వచ్చే సీన్స్, మ్యూజిక్, షాట్స్ అన్నీ కూడా మిమ్మల్ని వణికిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Tirupathi Rao
ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా హారర్ మూవీస్ చూడటం అనేది ఒక బిగ్ బ్యాడ్ హ్యాబిట్. కానీ, దానిని మానడం మాత్రం మన వల్లకాదు. అందుకే ఇండస్ట్రీలో కొత్త కొత్త హారర్ చిత్రాలు వస్తూనే ఉన్నాయి. అవి సూపర్ డూపర్ హిట్లు అవుతూనే ఉన్నాయి. ఈ ఓటీటీలు వచ్చిన తర్వాత ఎప్పుడో వచ్చిన బెస్ట్ హారర్ చిత్రాలు కూడా ఇప్పుడు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. మనకు నచ్చిన చిత్రాన్ని.. నచ్చినన్ని సార్లు చూసేయచ్చు. అలాంటి కోవకు చెందిన ఒక బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ హారర్ చిత్రాన్ని మీకోసం తీసుకొచ్చాం. ఇది అలాంటి ఇలాంటి మూవీ కాదు. ఒక ముని, ఒక చంద్రముఖి, ఒక కాంచన రేంజ్ లో ఉంటుంది. ఒక్కో సీన్ లో వాటిని మించే ఉంటుంది. ఒంటరిగా చూస్తే రెండు కాళ్లు వణకడం మాత్రం పక్కా.
ఈ సినిమాకి ఓవర్ హైప్ ఇస్తున్నాం అని అనుకోకండి. మూవీలో నిజంగానే విషయం ఉంటుంది. మీకు బాగా నచ్చుతుంది కూడా. ఒక్కో సీన్ కి పక్కన ఎవరూ లేకపోతే మాత్రం వణుకు పుడుతుంది. ఒక్కోసారి పక్కన ఎవరైనా ఉంటే వాళ్లనే దెయ్యం అనుకుని కేకలు వేసినా వేస్తారు. ఈ సినిమా కథ మొత్తం అన్ని హారర్ చిత్రాలు మాదిరిగానే ఒక ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక పాడుపడిన ఇంట్లోకి నలుగురు స్నేహితులు వెళ్తారు. వాళ్లు అనుకోకుండా అటుగా వెళ్తూ.. ఒక ఇంటిని చూస్తారు. అరే సిటీకి దగ్గర్లో ఇలాంటి ఇల్లు ఉందా అని సరదాగా లోపలికి వెళ్తారు. అదే వారి ప్రాణాల మీదకు తెస్తుంది. ఎందుకంటే ఆ ఇంట్లోకి వెళ్లిన వాళ్లు ప్రాణాలతో బయటకు వచ్చిన ప్రసక్తే లేదు.
ఆ ఇంట్లోకి వెళ్లిన కొద్దిసేపటికే అక్కడ ఏదో తెలియని ఒక దుష్ట శక్తి ఉందనే విషయం వారికి అర్థమవుతుంది. కానీ, అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోతుంది. అంటే వాళ్లు వచ్చిన విషయం ఆ ఆత్మకు తెలిసిపోతుంది. అది దాని ప్రతాపం చూపించడం స్టార్ట్ చేస్తుంది. వారిని ఆ ఇంట్లోనే బందీలుగా చేస్తుంది. పైగా అది బ్రిటీష్ వాడి ఆత్మ. బ్రిటీష్ వాళ్లు మన దేశాన్ని పాలించినప్పుడు ఇండియా వచ్చిన ఒక తెల్లదొర ఆత్మ అది. అతను సామాన్యంగానే నీచుడు. చనిపోయి ఆత్మ అయిన తర్వాత మరింత దారుణంగా తయారు అవుతాడు. బతికున్నప్పుడే ఆ ఇంట్లో ఉన్న అందరినీ హత్య చేస్తాడు. వారి ఆత్మలు కూడా ఆ ఇంట్లోనే బందీలుగా ఉంటాయి. అలా తెలియక ఎవరైనా ఆ ఇంట్లోకి వస్తే.. వాళ్లు ప్రాణాలతో తిరిగి వెళ్లరు.
అలాంటి ఇంట్లోకే ఈ నలుగురు ఫ్రెండ్స్ వెళ్తారు. మరి.. వాళ్ల పరిస్థితి ఏమైంది? అసలు ఆ తెల్లదొర ఎందుకు అందరినీ చంపేశాడు? చనిపోయిన తర్వాత కూడా వాళ్లు అంతా అక్కడే ఎందుకు బందీలుగా ఉన్నారు? అసలు ఆ తెల్లదొర ఆత్మను ఎలా గెలుస్తారు? అసలు గెలిచారా లేదా? వెళ్లిన ఫ్రెండ్స్ ప్రాణాలతో తిరిగి వచ్చారా? అనేదే కథ. ఈ సినిమా పేరు డిమోంటీ కాలనీ. ఈ సినిమాకి సీక్వెల్ కూడా రెడీగా ఉంది. కానీ, ఇంకా రిలీజ్ కాలేదు. ఎప్పుడు అనేది కూడా క్లారిటీ లేదు. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అయితే ప్రైమ్ లో అది ప్రస్తుతం స్ట్రీమింగ్ కావడం లేదు. కానీ, యూట్యూబ్ లో ఫుల్ సినిమా ఫ్రీగానే చూసేయచ్చు.