Dharani
Jharkhand Truck Driver YouTube Journey: లారీ డ్రైవర్‌గా చేస్తూనే.. యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ చేస్తూ.. నెలకు 10 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నాడో ఓ వ్యక్తి. అతడి వివరాలు..
Jharkhand Truck Driver YouTube Journey: లారీ డ్రైవర్‌గా చేస్తూనే.. యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ చేస్తూ.. నెలకు 10 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నాడో ఓ వ్యక్తి. అతడి వివరాలు..
Dharani
యూట్యూబ్ అంటే ఒకప్పుడు కేవలం వీడియోలు, సినిమాలు చూడటానికి పనికి వచ్చే ప్లాట్‌ఫామ్ అనుకునేవారు. కానీ నేటి కాలంలో అది ఎందరికో ఆదాయ వనరుగా మారింది. సెలబ్రిటీలు మొదలు సామాన్యుల వరకు ఎందరినో యూట్యూబ్ ఆదుకుంటుంది. మరీ ముఖ్యంగా కోవిడ్‌తో పరిస్థితులు మారడంతో.. సెలబ్రిటీలు సైతం.. యూట్యూబ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ప్రత్యేకంగా ఛానల్ పెట్టి.. వీడియోలు పోస్ట్ చేసి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. కంటెంట్ బాగుంటే చాలు.. వ్యూస్, సబ్‌స్క్రైబర్స్ పెరుగుతారు.. దాంతో పాటు ఇన్‌కమ్ కూడా పెరుగుతుంది. ఇక యూట్యూబ్ ఛానెల్ పెట్టి బాగా సంపాదిస్తున్న వారిలో పెద్ద పెద్ద చదువులు చదివిన వారు మాత్రమే ఉన్నారు అనుకుంటే పొరపాటే. పెద్దగా చదువులేని వారు సైతం యూట్యూబ్‌లో దూసుకుపోతున్నారు. మిలియన్ల కొద్ది సబ్‌స్క్రైబర్లతో.. కోట్ల కొద్ది వ్యూస్ సాధిస్తూ.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి ఓ ట్రక్కు డ్రైవర్ గురించి ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాం. ఈయన యూట్యూబ్‌లో నెలకు లక్షల్లో సంపాదిస్తూ.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆ వివరాలు..
టెక్నాలజీని సరిగ్గా వాడుకుంటే.. అది మన జీవితాలను ఎంతలా మారుస్తుందో తెలిపేందుకు ఉదాహరణగా నిలిచాడు ప్రముఖ యూట్యూబర్ రాజేశ్ రవానీ. జార్ఖండ్‌కు చెందిన ఇతడు గత 25 ఏళ్లుగా లారీ డ్రైవర్‌గా పని చేస్తోన్నాడు. కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారాడు. తన ట్రక్ జర్నీకి ఫుడ్ వ్లాగ్స్‌ని జత చేసి.. వీడియోలు తీసి అప్‌లోడ్ చేస్తూ.. ముందుకు సాగుతున్నాడు రాజేశ్. అదే అతడిని సెలబ్రిటీని చేసింది. ప్రస్తుతం అతని యూట్యూబ్ ఛానల్‌కు 1.86 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అతడు పోస్ట్ చేసే వీడియోల్లో.. ట్రక్ డ్రైవర్ల జీవితం ఎలా ఉంటుంది.. దానిలోనే వారు వంట ఎలా చేసుకుంటారు.. దారిలో పోలీసులు జరిపే తనిఖీలు, ప్రమాదాలు, రోడ్డుపై కనిపించే అసాధారణ దృశ్యాలు, ఇలా అన్నింటి గురించి వివరిస్తుంటాడు.
ఇతడి వీడియోలకు పెద్ద ఎత్తున వ్యూస్ వస్తుండటంతో.. ఆదాయం కూడా భారీగానే ఉంది. ఇక తాజాగా రాజేశ్ తన యూట్యూబ్ జర్నీ గురించి సిద్ధార్థ్ కన్నన్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు వెల్లడించాడు రాజేశ్. ట్రక్క్ డ్రైవర్‌గా పని చేసే తన జీవితాన్ని యూట్యూబ్ మలుపు తిప్పిందని.. ఒకప్పుడు నెలకు కేవలం 25-30 వేల రూపాయలు మాత్రమే సంపాదించే తను.. ఇప్పుడు నెలకు 4, 5 ఒక్కోసారి 10 లక్షల రూపాయలు కూడా సంపాదించిన రోజులు ఉన్నాయని గుర్తు చేసుకున్నాడు. ఇక యూట్యూబ్ మీద వచ్చిన ఆదాయంతోనే ఇల్లు కట్టుకున్నానని తెలిపాడు. తనకు ఇద్దరు కొడుకులు ఉన్నారని, వాళ్లే యూట్యూబ్ ఛానెల్ గురించి చెప్పారని ఓ సందర్భంలో వెల్లడించాడు రాజేశ్. ప్రస్తుతం ట్రక్ డ్రైవింగ్‌తో పాటు యూట్యబూ ఛానెల్‌ను కూడా నడిపిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు.