iDreamPost
android-app
ios-app

తెలుగులో డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో దుల్క‌ర్ స‌ల్మాన్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ!

  • Published Jul 05, 2024 | 10:59 AM Updated Updated Jul 05, 2024 | 10:59 AM

Dulquer Salmaan: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో కొత్త ట్రెండ్ నడుస్తుంది. ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలు ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లేదా యూట్యూబ్ లో దర్శనమిస్తున్నాయి.

Dulquer Salmaan: ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో కొత్త ట్రెండ్ నడుస్తుంది. ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలు ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లేదా యూట్యూబ్ లో దర్శనమిస్తున్నాయి.

  • Published Jul 05, 2024 | 10:59 AMUpdated Jul 05, 2024 | 10:59 AM
తెలుగులో డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో దుల్క‌ర్ స‌ల్మాన్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ!

ప్రపంచంలో టెక్నాలజీ రంగంలో ఎన్నో అద్భుతమైన మార్పలు వచ్చాయి.  ఎంటర్‌టైన్‌మెంట్, కమ్యూనికేషన్, వైజ్ఞానిక  రంగంలో ఎంతో అభివృద్ది జరుగుతుంది.  ఒకప్పుడు థియేటర్ల వద్ద క్యూ లైన్లో నిల్చుని పడిగాపులు కాస్తూ సినిమాలు చూసేవారు.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇంట్లో కూర్చొని యూట్యూబ్, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో నచ్చిన సినిమాలు చూసే అవకాశం లభిస్తుంది. ఓటీటీలో కొత్త కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ ప్రతి వారం రిలీజ్ అవుతున్నాయి. ఒకప్పటి హిట్ చిత్రాలు ఇక యూట్యూబ్‌లో రిలీజ్ అవుతున్నాయి. తాజాగా స్టార్ హీరో దుల్కన్ సల్మాన్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ తెలుగులో సందడి చేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మాలీవుడ్ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కన్ సల్మాన్ పాన్ ఇండియా హీరోగా తన సత్తా చాటుతున్నాడు. ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోల తనయుడు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ కొద్దిమంది మాత్రమే సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తున్నారు. అలాంటి వారిలో దుల్కన్ సల్మాన్ ఒకరు. మాలీవుడ్ లోనే కాదు.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు  చేస్తూ పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకన్నాడు.  తాజాగా దుల్కన్ సల్మాన్ హీరోగా నటించిన ‘సెకండ్ షో’ మూవీ తెలుగులో డైరెక్ట్ గా యూట్యూబ్ లో విడుదలైంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీతోనే మాలీవుడ్ లోకి దుల్కన్ సల్మాన్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు.

2012లో ‘సెకండ్ షో’ మాలయాళంలో రిలీజ్ అయ్యింది. సూపర్ స్టార్ మమ్ముట్టి నట వారసుడిగా దుల్కన్ సల్మాన్ మొదటి సినిమా. ఈ మూవీతో మాస్ ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకున్నాడు దుల్కన్. ఈ మూవీలో దుల్కన్ మాత్రమే కాదు.. సన్నీ వేన్, గౌతమి నాయర్ తో పాటు పలువురు నటీనటులు మాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.. ఇప్పుడు మంచి నటులుగా కొనసాగుతున్నారు. దర్శకుడిగా శ్రీ నాథ్ రాజేంద్రన్ కి ఇది తొలి చిత్రం కావడం గమనార్హం. ఈ మూవీ ఇసుక అక్రమ రవాణాతో పాటు చీకటి వ్యాపారాలు నేపథ్యంలో వాస్తవ ఘటనల స్ఫూర్తితో తెరకెక్కించారు. హీరోగా మొదటి సినిమా అయినప్పటికీ నెగిటీవ్ షేడ్స్ తో ఉన్న క్యారెక్టర్ లో దుల్కన్ అద్భుతంగా నటించాడు. మాలీవుడ్ లో రిలీజ్ అయిన పదేళ్ల తర్వాత ‘సెకండ్ షో’ తెలుగు వెర్షన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్ట్ గా యూట్యూబ్ లో రిలీజ్ కావడంతో దుల్కన్ అభిమానులు తెగ సంతోషంలో ఉన్నారు. ఒక్కరోజులోనే ఈ మూవీ యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişHoliganbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetiptv satın aljojobet güncelHoliganbet Girişjojobet günceljojobet güncel