iDreamPost
android-app
ios-app

యూజర్లకు షాక్ ఇచ్చిన YouTube.. ప్రీమియం ధరలు భారీగా పెంపు!

  • Published Aug 27, 2024 | 1:26 PM Updated Updated Aug 27, 2024 | 1:26 PM

YouTube Premium Hikes Prices: యూజర్లకు యూట్యూబ్ గట్టి షాక్ ఇచ్చింది. సబ్​స్క్రిప్షన్ ధరల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్ ప్రీమియం ప్లాన్స్ కొత్త ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

YouTube Premium Hikes Prices: యూజర్లకు యూట్యూబ్ గట్టి షాక్ ఇచ్చింది. సబ్​స్క్రిప్షన్ ధరల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్ ప్రీమియం ప్లాన్స్ కొత్త ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Aug 27, 2024 | 1:26 PMUpdated Aug 27, 2024 | 1:26 PM
యూజర్లకు షాక్ ఇచ్చిన YouTube.. ప్రీమియం ధరలు భారీగా పెంపు!

ప్రముఖ ఆన్​లైన్ వీడియో షేరింగ్ ప్లాట్​ఫామ్ యూట్యూబ్​కు మరింత ఆదరణ పెరుగుతోంది. క్వాలిటీ కంటెంట్ అందిస్తుండటం, ప్రతి అంశానికి సంబంధించిన సమాచారం అందుబాటులో ఉండటంతో దీని సబ్​స్క్రిప్షన్ కోసం యూజర్లు ఎగబడుతున్నారు. మొదట్లో కంటెంట్​ను ఫ్రీగా అందించిన ఈ ప్లాట్​ఫామ్.. ఆ తర్వాత సబ్​స్క్రిప్షన్​ ప్లాన్స్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయినా మంచి సర్వీసెస్ అందిస్తుండటంతో సబ్​స్క్రిప్షన్​కు డిమాండ్ ఏర్పడింది. అయితే ఏటా ప్రీమియం ధరల్ని పెంచుతూ పోతుండటంతో యూజర్లు షాక్ అవుతున్నారు. యూట్యూబ్​లో యాడ్​ ఫ్రీ కంటెంట్ కావాలనుకునే వారికి ధరల మోత మోగుతోంది. తాజాగా మరోమారు కస్టమర్లకు గట్టి షాక్ తగిలింది.

యూట్యూబ్ మరోమారు సబ్​స్క్రిప్షన్ ప్లాన్స్​ ధరల్ని పెంచింది. దీంతో యూజర్ల మీద మరింత భారం పడనుంది. యూట్యూబ్ ప్రీమియం ప్లాన్స్ ధరల్ని ఏకంగా 58 శాతం వరకు పెంచింది. ఇప్పటివరకు ఇండియాలో యూట్యూబ్ ప్రీమియం నెలవారీ ప్లాన్ రూ.129గా ఉండేది. ఈ ప్లాన్​ కోసం నెక్స్ట్ నుంచి మరో 20 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక మీదట ఇండివిడ్యువల్ మంత్లీ ప్లాన్ కావాలంటే నెలకు రూ.149 చెల్లించాలి. ఇంతకుముందు వరకు నెలకు రూ.79గా ఉన్న స్టూడెంట్ ప్లాన్ కోసం ఇక నుంచి రూ.89 కట్టాల్సి ఉంటుంది. ఫ్యామిలీ ప్లాన్ ధరలు కూడా భారీగా పెరిగాయి. రూ.189 ఉన్న ఫ్యామిలీ మంత్లీ ప్లాన్​ ధర ఏకంగా రూ.299కి పెరిగింది. ఇండివిడ్యువల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు కూడా పెరిగాయి.

big shock for youtube users

నెలవారీ ఇండివిడ్యువల్ ప్రీపెయిడ్ ప్లాన్ ఇంతకుముందు వరకు రూ.139 ఉండగా.. ఇప్పుడు దాని ధర రూ.159కి పెరిగింది. రూ.399గా ఉన్న ఇండివిడ్యువల్ ప్రీపెయిడ్ క్వార్టర్లీ ప్లాన్ ధర కాస్తా రూ.459కి పెరిగింది. ఇండివిడ్యువల్ ప్రీపెయిడ్ యానువల్ ప్లాన్ ధర రూ.1290 నుంచి రూ.1490కి పెరిగింది. ఇండియన్ యూజర్లకు యూట్యూబ్ గట్టిగా షాక్ ఇచ్చింది. ప్రీమియంలో ఉన్న 6 ప్లాన్స్ ధరను భారీగా పెంచింది. యూట్యూబ్ నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. ఇలా అడ్డగోలుగా ధరలు పెంచుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఒకేసారి 58 శాతం పెంచడం కరెక్ట్ కాదని, యూజర్లపై ఇంత భారం మోపడం ఏంటని నిలదీస్తున్నారు. ఏడాదికి ఇంత అని పెంచితే బాగుంటుందని, ఒకేసారి భారీగా పెంచడం, షార్ట్ గ్యాప్​లో రేట్స్ హైక్ చేయడం వల్ల నెగెటివ్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి.. యూట్యూబ్ ప్రీమియం ప్లాన్స్ ఛార్జీలను అమాంతం పెంచడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.