iDreamPost
android-app
ios-app

OTT లోకి తెలుగులో వచ్చేసిన టైమ్ ట్రావెల్ మూవీ.. ‘కాలింగ్ 1980’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Aug 24, 2024 | 1:30 PM Updated Updated Aug 24, 2024 | 1:30 PM

OTT New Release-Telugu Movie Calling 1980: టైమ్ ట్రావెల్ సినిమాలు భలే ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. అందులోను అవి తెలుగులో ఉంటే ఇంకాస్త ఫ్రీ గా చూసేయొచ్చు. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీ లోకి వచ్చేసింది. పైగా దీనిని ఫ్రీ గా చూసేయొచ్చు.

OTT New Release-Telugu Movie Calling 1980: టైమ్ ట్రావెల్ సినిమాలు భలే ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. అందులోను అవి తెలుగులో ఉంటే ఇంకాస్త ఫ్రీ గా చూసేయొచ్చు. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీ లోకి వచ్చేసింది. పైగా దీనిని ఫ్రీ గా చూసేయొచ్చు.

  • Published Aug 24, 2024 | 1:30 PMUpdated Aug 24, 2024 | 1:30 PM
OTT లోకి తెలుగులో వచ్చేసిన టైమ్ ట్రావెల్ మూవీ.. ‘కాలింగ్ 1980’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

ఓటీటీ లోకి ఏదైనా కొత్త సినిమా వస్తుందంటే.. ఎప్పుడెప్పుడు ఈ మూవీని చూద్దామా అని ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. ఇక అవి రెగ్యులర్ సినిమాలు కాకుండా తమకు నచ్చిన జోనర్ లో.. అందులోను తెలుగులో ఉన్నాయంటే ఆ సినిమాలపై ఇంకాస్త ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో లేటెస్ట్ గా ఓటీటీ లోకి ఓ ఇంట్రెస్టింగ్ టైమ్ ట్రావెల్ మూవీ వచ్చేసింది. పైగా దీనిని ఫ్రీ గా చూసేయొచ్చు. కాబట్టి ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేయండి.

ఈ తెలుగు సినిమా పేరు కాలింగ్ 1980.. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర.. భార్య ప్రియాంక ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటించారు. కాగా ఈ సినిమాకు రాజ్ కిరణ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రియాంక ఉపేంద్రతో పాటు.. శ‌ర‌ణ్య శెట్టి, ర‌మేష్ పండిట్ కూడా ప్రధాన పాత్రలో నటించారు. 2021లో కన్నడలో రిలీజ్ అయినా 1980 సినిమాకు డబ్బింగ్ వెర్షన్ గా కాలింగ్ 1980 ను రూపొందించారు. ఈ సినిమా కాన్సెప్ట్ బాగున్నా కానీ ఎందుకో ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమాను నేరుగా యూట్యూబ్ లో రిలీజ్ చేశారు మేకర్స్. కాబట్టి ఈ వీకెండ్ ఏదైనా మంచి టైమ్ ట్రావెల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూడాలంటే మాత్రం.. ఈ మూవీ బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. 1980 లో ఆప్సేత‌ల్లి అనే గ్రామంలో.. వరుసగా మిస్సింగ్ కేసులు నమోదు అవుతూ ఉంటాయి. దీనితో ఆ మిస్సింగ్ కేసులకు సంబంధించిన మిస్టరీని ఛేదించేందుకు.. ప్రియ అనే బుక్ రైటర్ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో తర్వాత మిస్ అయ్యేది తనే అనే నిజం బయటపడుతుంది. ఇంతలో ఆమె ల్యాండ్ లైన్ నెంబర్ కు సాన్వి అనే అమ్మాయి కాల్ చేస్తుంది. కానీ శాన్వి 2020 వ సంవత్సరంలో ఉంటుంది. అసలు ఇరవై ఏళ్ళు వెనక్కు వెళ్లి ప్రియతో శాన్వి ఎలా మాట్లాడింది ? ఎందుకు మాట్లాడింది ? వీరిద్దరికి మధ్య ఉన్న సంబంధం ఏంటి ? కిడ్నపర్స్ బారి నుంచి ప్రియాను శాన్వి సేవ్ చేసిందా లేదా ? అనేదే తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమా అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.