iDreamPost

షార్ట్స్, రీల్స్ చేస్తున్నారా? కొత్తవాళ్లు ఈ మానిటైజేషన్ రూల్స్ తెలుసుకోండి

FB, Insta, YT Monetization Rules: షార్ట్స్, రీల్స్ చేస్తున్నారా? కొత్తగా యూట్యూబ్, ఇన్ స్టా, ఫేస్ బుక్ పేజెస్ లో షార్ట్స్, రీల్స్ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ కథనం. డబ్బులు సంపాదించుకోవాలంటే మానిటైజేషన్ అవ్వాలి. దాని కోసం మీరు మానిటైజేషన్ రూల్స్ ని తెలుసుకోవాలి. ఎన్ని వ్యూస్ వస్తే మానిటైజేషన్ వస్తుంది. ఎంతమంది సబ్ స్క్రైబర్స్, ఎంతమంది ఫాలోవర్స్ రావాలి? ఎన్ని రకాలుగా డబ్బు సంపాదించుకోవచ్చు వంటి పూర్తి వివరాలు మీ కోసం.

FB, Insta, YT Monetization Rules: షార్ట్స్, రీల్స్ చేస్తున్నారా? కొత్తగా యూట్యూబ్, ఇన్ స్టా, ఫేస్ బుక్ పేజెస్ లో షార్ట్స్, రీల్స్ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ కథనం. డబ్బులు సంపాదించుకోవాలంటే మానిటైజేషన్ అవ్వాలి. దాని కోసం మీరు మానిటైజేషన్ రూల్స్ ని తెలుసుకోవాలి. ఎన్ని వ్యూస్ వస్తే మానిటైజేషన్ వస్తుంది. ఎంతమంది సబ్ స్క్రైబర్స్, ఎంతమంది ఫాలోవర్స్ రావాలి? ఎన్ని రకాలుగా డబ్బు సంపాదించుకోవచ్చు వంటి పూర్తి వివరాలు మీ కోసం.

షార్ట్స్, రీల్స్ చేస్తున్నారా? కొత్తవాళ్లు ఈ మానిటైజేషన్ రూల్స్ తెలుసుకోండి

ఈ మధ్య కాలంలో షార్ట్స్, రీల్స్ చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. ప్రతి ఒక్కరూ షార్ట్స్, రీల్స్ చేసి డబ్బులు సంపాదించాలి అని అనుకుంటున్నారు. మరి డబ్బులు రావాలంటే యూట్యూబ్ ఛానల్ కి, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ పేజీలకి మానిటైజేషన్ అనేది ఎనేబుల్ అవ్వాలి. అది జరగాలంటే మానిటైజేషన్ రూల్స్ ని తెలుసుకోవాలి. వీటిలో రెండు రకాల రూల్స్ ఉన్నాయి. మొదటిది కంటెంట్ కి సంబంధించింది.. రెండు యాడ్స్ కి సంబంధించింది. కంటెంట్ కి సంబంధించింది అంటే.. మీరు మీ ఒరిజినల్ కంటెంట్ ని మాత్రమే అప్లోడ్ చేయాలి. కాపీ రైటెడ్ కంటెంట్ ని అప్లోడ్ చేయకూడదు. అంటే వేరే వాళ్ళ కంటెంట్ ని అప్లోడ్ చేస్తే డబ్బులు రావు. అలానే వేరే వాళ్ళ మ్యూజిక్ ని వాడకూడదు. ఒకవేళ షార్ట్స్ లో వాడితే మీకొచ్చే ఆదాయంలో కొంత వాళ్లకు వెళ్ళిపోతుంది. కమ్యూనిటీ గైడ్ లైన్స్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అంటే మీ ఛానల్ లో వీడియోస్ లో వచ్చే ప్రకటనలకు అనుకూలంగా ఉండాలి. బెట్టింగ్ యాప్స్ ని, ఇల్లీగల్ యాప్స్ ని ఛానల్ లో ఎక్కడా కూడా ప్రమోట్ చేయకూడదు.    

యాడ్స్ రావాలంటే ఈ టాస్క్ లని ఫినిష్ చేయాలి

యూట్యూబ్:

మీరు యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నట్లైతే కనుక లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్.. ఈ రెండిటికీ మానిటైజేషన్ అనేది సెపరేట్ గా ఉంటుందని తెలుసుకోవాలి. 

యూట్యూబ్ షార్ట్స్:

యూట్యూబ్ షార్ట్స్ విషయానికొస్తే.. ఇందులో మీకు రెండు రకాలుగా డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. మొదటిది సబ్ స్క్రైబర్స్ నుంచి. రెండవది యూట్యూబ్ యాడ్స్ నుంచి. 

షార్ట్స్ ద్వారా సబ్ స్క్రైబర్స్ నుంచి డబ్బు సంపాదించుకోవడం:

ఛానల్ మెంబర్ షిప్స్, సూపర్ చాట్ అండ్ సూపర్ స్టిక్కర్స్, సూపర్ థాంక్స్ రూపంలో ఫ్యాన్స్ (సబ్ స్క్రైబర్స్) నుంచి కొంత అమౌంట్ ని పొందవచ్చు. దీని కోసం ఛానల్ పెట్టిన 90 రోజుల్లో 500 సబ్ స్క్రైబర్లు, 3 వీడియోలు పోస్ట్ చేసి ఉండాలి. వీటితో పాటు 90 రోజుల్లో 30 లక్షల వ్యూస్ వచ్చి ఉండాలి. 90 రోజుల్లో ఈ ఛాలెంజ్ పూర్తి చేయకపోతే మళ్ళీ మొదటి నుంచి మొదలుపెట్టాలి. ఇలా 90 రోజుల్లో 30 లక్షల వ్యూస్ రప్పించుకుంటే అప్పుడు ఫ్యాన్స్ నుంచి స్టిక్కర్స్, సూపర్ చాట్స్, సూపర్ థాంక్స్ రూపంలో డబ్బుని పొందవచ్చు. 

షార్ట్స్ తో యూట్యూబ్ యాడ్స్ ద్వారా డబ్బు సంపాదించుకోవడం:

యూట్యూబ్ నుంచి నేరుగా యాడ్స్ ద్వారా డబ్బు సంపాదించుకోవాలంటే.. ఛానల్ స్టార్ట్ చేసిన 90 రోజుల్లో 1000 సబ్ స్క్రైబర్స్ ఉండాలి. 90 రోజుల్లో మీరు పెట్టిన షార్ట్ వీడియోలకు కోటి వ్యూస్ వచ్చి ఉండాలి. 90 రోజులు దాటిన తర్వాత కోటిన్నర వ్యూస్ వచ్చినా కౌంట్ అవ్వదు. మళ్ళీ మొదటి నుంచి 90 రోజుల పాటు యజ్ఞం కొనసాగించాలి. 

యూట్యూబ్ లాంగ్ వీడియోస్:

యూట్యూబ్ లో లాంగ్ వీడియోస్ చేస్తున్నట్లైతే కనుక.. ఛానల్ స్టార్ట్ చేసిన ఏడాదిలో 500 సబ్ స్క్రైబర్స్, 3 వేల గంటల వాచ్ హవర్స్ ఉండాలి. అలానే 90 రోజుల్లో 3 వీడియోలు అప్లోడ్ చేసి ఉండాలి. 3 వేల గంటలు అంటే లక్ష 80 వేల వ్యూస్ వచ్చి ఉండాలి. అప్పుడు మీకు సూపర్ చాట్, సూపర్ థాంక్స్, సూపర్ స్టిక్కర్స్ రూపంలో ఫ్యాన్స్ నుంచి డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏడాదిలో 1000 సబ్ స్క్రైబర్స్ ఉండి.. 4 వేల గంటల వాచ్ హవర్స్ ఉండాలి.  అంటే 2 లక్షల 40 వేల వ్యూస్ రావాలి. అయితే లాంగ్ వీడియోస్ కి వాచ్ హవర్స్ కోసం చాలా మంది లైవ్ పెడుతుంటారు. అయితే లైవ్ లో వచ్చే వ్యూస్ కౌంట్ అవ్వవు. కొత్త మానిటైజేషన్ రూల్స్ ప్రకారం.. లైవ్ అయ్యాక వచ్చే వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతాయి. ఏడాదిలోపు మీరు ఈ ఛాలెంజ్ ని రీచ్ కాకపోతే మళ్ళీ ఏడాది పాటు కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి మీరు తీసుకునే కంటెంట్ ని కరెక్ట్ గా ఎంచుకోవాలి.

ఇన్స్టాగ్రామ్ రీల్స్ మానిటైజేషన్ రూల్స్:

ఇన్ స్టాగ్రామ్ లో కనీసం 1000 ఫాలోవర్స్ ఉండాలి. వయసు కనీసం 18 ఏళ్ళు నిండిన వారు అయి ఉండాలి. రీల్స్ అనేవి ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ కి, టర్మ్స్ ఆఫ్ యూజ్ కి అనుగుణంగా ఉండాలి. అశ్లీల కంటెంట్, బూతు కంటెంట్, వేరొకరిని తిట్టడం, రాజకీయాలకు సంబందించిన కంటెంట్ వంటి వాటికి మానిటైజేషన్ అనేది అవ్వదు. మ్యూజిక్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ సొంత మ్యూజిక్ మాత్రమే వాడాలి. లేదా ఇన్స్టాగ్రామ్ లైబ్రరీలో ఉన్న ఆడియోని వాడుకోవాలి. వేరొకరి అనుమతి లేకుండా కాపీ రైట్ మ్యూజిక్ ని వాడకూడదు. రీల్స్ డ్యూరేషన్ 90 సెకన్లు ఉండాలి. అయితే ఇంకా తక్కువ డ్యూరేషన్ ఉంటే రీచ్ పెరిగి మానిటైజేషన్ త్వరగా వచ్చే అవకాశం ఉంది. మీ రీల్స్ కి లైక్స్, కామెంట్స్, షేర్స్ ఎక్కువగా పడితే కనుక రెవెన్యూ సామర్థ్యం అనేది పెరుగుతుంది.

యాడ్స్, బ్రాండెడ్ కంటెంట్, ఇన్ స్టా రీల్స్ ప్లే బోనస్ ప్రోగ్రాం ద్వారా మానిటైజ్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆప్షన్ కేవలం ఎంపిక చేయబడ్డ దేశాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ రూల్స్ ని పాటిస్తూ, ఛాలెంజెస్ ని అధిగమిస్తే కనుక మీకు మానిటైజేషన్ అనేది వస్తుంది. అయితే నేరుగా ఇన్ స్టా యాడ్స్ ద్వారా వచ్చే ఆదాయంలో మెటాకి 45 శాతం వాటా వెళ్ళిపోతుంది. మిగతా 55 శాతం మీకు వస్తుంది. ఇది డైరెక్ట్ యాడ్ రెవెన్యూ. ఇది కాకుండా బ్రాండెడ్ కంటెంట్ అని ఒక ఫీచర్ ఉంటుంది. పలు రకాల బ్రాండ్స్ ని ప్రమోట్ చేయడం ద్వారా మీకు వారి నుంచి ఆదాయం వస్తుంది. అయితే మీకున్న ఫాలోవర్స్, రీల్స్ కి వచ్చే వ్యూస్ బట్టి బ్రాండ్ కి సంబంధించిన వాళ్ళు కాంటాక్ట్ అవుతారు.      

ఫేస్ బుక్ మానిటైజేషన్ రూల్స్:

ఫేస్ బుక్ పేజీలో వీడియోలు పోస్ట్ చేస్తున్నట్లైతే కనుక ఈ రూల్స్ ని ఫాలో అవ్వాలి. ఇందులో రెండు రకాలుగా సంపాదించుకునే అవకాశం ఉంది. మొదటిది స్టార్స్ ద్వారా, రెండవది యాడ్స్ ద్వారా. రీల్స్ కైనా, లాంగ్ వీడియోస్ కైనా ఇదే పద్ధతి.  

రీల్స్:

స్టార్స్ ద్వారా రీల్స్ కి డబ్బులు రావాలంటే:

మీరు రీల్స్ అప్లోడ్ చేసినప్పుడు సపోర్ట్ కోసం ఫాలోవర్స్ కి ఈ స్టార్ ఫీచర్ ని అందుబాటులో ఉంచవచ్చు. ఈ స్టార్ ని క్లిక్ చేస్తే ఫాలోవర్స్ మీకు కొంత అమౌంట్ అనేది సెండ్ చేస్తారు. ఒక్కో స్టార్ కి 0.01 డాలర్ సంపాదించుకోవచ్చు. అయితే ఈ స్టార్ ఎంత ధర ఉండాలనేది మీరు నిర్ణయించుకోవచ్చు. దీని కోసం మీ ఫేస్ బుక్ పేజ్ కి కనీసం 1000 ఫాలోవర్స్ ఉండాలి. ఆ ఫాలోవర్స్ ని 60 రోజుల పాటు మెయింటెయిన్ చేయగలగాలి. ఈ స్టార్స్ ద్వారా మనీ రావాలంటే 30 రోజుల్లో మీరు కనీసం 1000 స్టార్స్ ని రీచ్ అవ్వాలి. ఈ స్టార్స్ ద్వారా వచ్చిన దాంట్లో 10 శాతం ఫేస్ బుక్ ఉంచుకుని మిగతా 90 శాతం మీకు ఇస్తుంది. మీరు ఈ పేమెంట్ ని విత్ డ్రా చేయాలంటే 100 డాలర్లు రీచ్ అయి ఉండాలి. అంటే కనీసం 9 వేల వరకూ రీచ్ అయి ఉండాలి.    

యాడ్స్ ద్వారా రీల్స్ కి డబ్బులు రావడం:

10 వేల ఫాలోవర్స్ ఉండాలి. పోస్ట్ చేసే కంటెంట్ మీ సొంతదై ఉండాలి. కనీసం 5 రీల్స్ పోస్ట్ చేసి ఉండాలి. ఒక్కో రీల్ 60 సెకన్లు ఉండాలి. మీరు పోస్ట్ చేసిన రీల్స్ కి కనీసం 6 లక్షల నిమిషాల వ్యూస్ ఉండాలి. అంటే మీరు అప్లోడ్ చేసిన ఒక నిమిషం వీడియోకి 6 లక్షల వ్యూస్ రావాలి. 6 లక్షల వ్యూస్ కూడా పూర్తిగా ఒక నిమిషం పాటు మీ రీల్ ని 6 లక్షల మంది చూస్తేనే కౌంట్ అవుతుంది. లేదా 6 లక్షల సార్లు చూస్తే కౌంట్ అవుతుంది. ఫేస్ బుక్ పేజ్ లో మానిటైజేషన్ అవ్వాలంటే ఫేస్ బుక్ మానిటైజేషన్ రూల్స్ ని అనుగుణంగా మీ కంటెంట్ ఉండాలి. 

ఫేస్ బుక్ లాంగ్ వీడియోస్ కి మానిటైజేషన్ రూల్స్:

స్టార్స్ ద్వారా డబ్బు సంపాదించుకోవడం:

1000 ఫాలోవర్స్ కలిగి ఉండాలి. వీడియో డ్యూరేషన్ కనీసం 3 నిమిషాలైనా ఉండాలి. అప్పుడు స్టార్స్ ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చు. ఈ స్టార్స్ ద్వారా వచ్చిన దాంట్లో 10 శాతం ఫేస్ బుక్ ఉంచుకుని మిగతా 90 శాతం మీకు ఇస్తుంది. మీరు ఈ పేమెంట్ ని విత్ డ్రా చేయాలంటే 100 డాలర్లు రీచ్ అయి ఉండాలి. అంటే కనీసం 9 వేల వరకూ రీచ్ అయి ఉండాలి.    

ఫేస్ బుక్ యాడ్స్ ద్వారా డబ్బు రావాలంటే:

1000 ఫాలోవర్స్ ఉండాలి. 60 రోజుల్లో 15 వేల పోస్ట్ ఎంగేజ్మెంట్స్ ఉండాలి. 60 రోజుల్లో లక్ష 80 వేల నిమిషాల వ్యూస్ ఉండాలి. 60 రోజుల్లో 3 నిమిషాల వీడియోలకు ఒక నిమిషం చొప్పున 30 వేల వ్యూస్ వచ్చి ఉండాలి.   

మీకు ఈ కథనం ఉపయోగపడుతుందనుకుంటే సేవ్ చేసి పెట్టుకోండి. అలానే మీకు తెలిసిన కొత్త క్రియేటర్స్ కి ఈ ఆర్టికల్ ని షేర్ చేయండి. అలానే ఫేస్ బుక్, ఇన్ స్టా, యూట్యూబ్ మానిటైజేషన్ రూల్స్ లో ఏ ప్లాట్ ఫామ్ రూల్స్ మీకు బాగా నచ్చాయో కామెంట్ చేయండి. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి