Tirupathi Rao
Youtube Introduces New Privacy Feature- DeepFake: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ డీప్ ఫేక్ వీడియోల హడావుడి బాగా పెరిగిపోయింది. ఏది నిజమో? ఏది అబద్ధమో చెప్పే పరిస్థితి లేదు. అలాంటి వాటిని అరికట్టేందుకు యూట్యూబ్ ముందడుగు వేసింది.
Youtube Introduces New Privacy Feature- DeepFake: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ డీప్ ఫేక్ వీడియోల హడావుడి బాగా పెరిగిపోయింది. ఏది నిజమో? ఏది అబద్ధమో చెప్పే పరిస్థితి లేదు. అలాంటి వాటిని అరికట్టేందుకు యూట్యూబ్ ముందడుగు వేసింది.
Tirupathi Rao
టెక్నాలజీ పెరిగిన తర్వాత ఏ చిన్న విషయాన్ని కూడా నిర్ధారించే పరిస్థితి లేదు. మన ప్రమేయం లేకుండానే మనతో వీడియోలు చేసేస్తున్నారు. ఆ వీడియోలో ఉన్న మీరు కాదు.. మీరే చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే టెక్నాలజీ అంత బాగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయిన తర్వాత ఏది తప్పో? ఏది ఒప్పో తెలుసుకునే పరిస్థితి కూడా లేదు. ముందైతే షేర్లు కొట్టేస్తున్నారు. అయితే అలాంటి పరిస్థితికి యూట్యూబ్ చెక్ పెట్టనుంది. ఇకనుంచి యూట్యూబ్ లో ఆర్టిఫీషియల్ ఇంటిలెజెన్స్ సహాయంతో రూపొందించిన వీడియోలను ఇట్టే కనిపెట్టచ్చు. అంతేకాదు.. అది తప్పుడు సమాచారం అయితే రిపోర్ట్ కూడా కొట్టచ్చు.
ఆర్టిఫీషియల్ ఇంటిలెన్స్ వచ్చిన తర్వాత ఫేక్ వీడియోలు, ఫేక్ సమాచారం బాగా పెరిగిపోయింది. కంటెంట్ క్రియేటర్లు కూడా ఆర్టిఫీషియల్ ఇంటిలెజన్స్ సహాయంతో కొన్ని కొన్ని వీడియోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఫాలోవర్లు, సబ్ స్క్రైబర్లను పెంచుకునేందుకు ఈ పనులు చేస్తున్నారు. అయితే ఇక నుంచి ఆలాంటి పనులకు యూట్యూబ్ చెక్ పెట్టనుంచి. ముఖ్యంగా ఏఐ ఆధారిత కంటెంట్ ని కంట్రోల్ చేసేందుకే ఈ పని చేస్తోంది. ఇక నుంచి కంటెంట్ క్రియేటర్లు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వీడియోలు రూపొందిస్తే.. వాళ్లు ముందుగానే చెప్పాల్సి ఉంటుంది. ఈ వీడియో ఏఐ ఆధారిత టెక్నాలజీ రూపొందించాం ఆని మెన్షన్ చేయాలి.
అంతేకాకుండా సమాచారం కచ్చితంగా నిజమైనదే అయ్యి ఉండాలి. ఒకవేళ తప్పుడు సమాచారంతో వీడియోలు పోస్ట్ చేస్తే.. యూజర్లకు రిపోర్ట్ కొట్టే ఆస్కారం కూడా ఉంది. ఒకవేళ యూజర్స్ రిపోర్ట్ కొడితే యూట్యూబ్ ఆ వీడియోలను పరిశీలించి.. నిజంగానే తప్పుడు సమాచారం అయితే గనుక చర్యలు తీసుకుంటుంది. ఇలా డీప్ ఫేక్ కంటెంట్ ని మీరు తేలిగ్గా రిపోర్ట్ చేయచ్చు. అలాగే ఏది ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో చేసిన కంటెంట్ అనేది తెలిసిపోతుంది. అంతేకాకుండా.. మీ ఫొటో, మీ వాయిస్ ని గనుక వాడి ఏఐ సాయంతో డీప్ ఫేక్ కంటెంట్ క్రియేట్ చేస్తే మీరు వెటంనే దానిని రోపోర్ట్ చేయచ్చు. నిజంగానే మీ ప్రమేయం లేకుండా మీకు సంబంధించిన చిత్రాలు, వాయిస్, సమాచారం వాడితే దానిని తొలగిస్తారు కూడా. ప్రస్తుతం యూట్యూబ్ లో కూడా ఈ ఏఐ వీడియోలు బాగా పెరిగిపోయాయి. వాటిలో ఈ డీప్ ఫేక్ వీడియోల ఆట కట్టించేందుకే యూట్యూబ్ ఈ తరహా ఫీచర్స్ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే యూజర్స్ వ్యక్తిగత గోప్యతకు రక్షణగా కూడా ఈ నిర్ణయాలు ఉపయోగపడతాయి. మరి.. యూట్యూబ్ తీసుకొచ్చిన ఈ ఫీచర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.