థియేటర్లలో ఎలాగూ కొత్త సినిమాలు వస్తుంటాయి కానీ ఇల్లు కదలకుండా కూర్చున్న చోటే కాలక్షేపం అయ్యే అవకాశం ఇస్తున్నవి ఓటిటిలే. 10వ తేదీన అంటే సుందరానికి, 777 ఛార్లీలతో పాటు ఇంకో రెండు చిన్న సినిమాలు హాల్లో అడుగుపెడుతున్నాయి. వాటికి ధీటుగా స్మాల్ స్క్రీన్ ఎంటర్ టైన్మెంట్ కూడా ముస్తాబవుతోంది. అవేంటో చూద్దాం. జీ5లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అందుకుంటున్న మూవీ ‘కిన్నెరసాని'(KINNERASANNI). మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన ఈ థ్రిల్లర్ జనవరిలో రావాల్సింది. కానీ […]
ప్రపంచవ్యాప్తంగా గొప్ప పాపులారిటీ ఉన్న నెట్ ఫ్లిక్స్ ఇండియాలోనే కొంత వీక్ గా ఉండటాన్ని స్వయానా ఆ కంపెనీ సిఈఓ ఒప్పుకున్న సంగతి తెలిసిందే. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా సబ్స్క్రిప్షన్ ధరలు కూడా తగ్గించి ప్రేక్షకులకు చేరువయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయినప్పటికీ సగటు మధ్యతరగతి జీవికి నెట్ ఫ్లిక్స్ చందా ఖరీదైన వ్యవహారమే. అందుకే తమ బ్రాండ్ ని మరింత బలంగా జనంలోకి తీసుకెళ్లేందుకు ఈ సంస్థ కొత్త ప్రణాళికలతో ముందడుగు వేస్తోంది. విక్టరీ […]
ఇటీవలే డిస్నీ హాట్ స్టార్ లో విడుదలైన హ్యూమన్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు ముందు ట్రైలర్ రూపంలో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేపింది. పేదవాడి నుంచి ధనవంతుడి దాకా అందరినీ జలగలా పీల్చుకు తింటున్న కార్పొరేట్ మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఇది రూపొందటంతో అంచనాలు పెరిగాయి. కంటెంట్ అందరికీ రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఇలాంటి సిరీస్ లను ఓటిటిలు హిందీతో పాటు తెలుగు తమిళం తదితర భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నాయి. హ్యూమన్ […]
గత ఏడాది తాలూకు కరోనా ప్రభావం ఓటిటి సంస్థలకు ఎంత పెద్ద వరంగా మారిందో కళ్లారా చూశాం. పెద్ద హీరోల సినిమాలు థియేటర్ కు వెళ్లే అవసరం లేకుండా నేరుగా ఇంట్లోనే కూర్చుని కుటుంబంతో సహా చూడొచ్చని రెండేళ్ల క్రితం ఎవరైనా ఊహించారా. కనీసం కలలో కూడా అనుకోలేని వింత ఇది. కానీ వాస్తవం అయ్యింది. నిర్మాతలకు తమ సినిమాలు అమ్ముకునేందుకు ఆప్షన్లు పెరిగాయి. దానికి తగ్గట్టే సినిమా బడ్జెట్ ని మించిన మొత్తాన్ని హక్కుల రూపంలో […]
బాహుబలి నిర్మాతల ఓటిటి వెంచర్ లో భాగంగా నిర్మించిన వెబ్ సిరీస్ పరంపర మొన్న శుక్రవారం నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. శరత్ కుమార్, జగపతిబాబు, నవీన్ చంద్ర లాంటి నోటెడ్ ఆర్టిస్టులతో పాటు ట్రైలర్ లో చూపించిన ప్రొడక్షన్ వేల్యూస్ భారీగా కనిపించడంతో దీని మీద ఆసక్తి పెరిగింది. దీనికి కృష్ణ విజయ్ – విశ్వనాథ్ అరిగెల సంయుక్తంగా దర్శకత్వం వహించారు. పవర్ పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ టచ్ ఇస్తూ […]
వినోదం అంటే థియేటర్ టీవీనే కాదు దానికి మించి అనే స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా ఓటిటి వెబ్ సిరీస్ ల ట్రెండ్ విపరీతంగా పాకిపోతోంది. దానికి సాక్ష్యంగా గత రెండేళ్లలో వచ్చిన ఎన్నో సిరీస్ లు ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన ఆదరణ పొందుతున్నాయి. మన దేశంలోనూ ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్, స్కామ్ 1992 లాంటివి భారీ చిత్రాల రేంజ్ లో హైప్ ని రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. ఇక నెట్ ఫ్లిక్స్ లో స్క్విడ్ గేమ్స్ సృష్టిస్తున్న సంచలనం […]
ఇటీవలి కాలంలో మన స్టార్లు థియేటర్లలో ఆడే సినిమాలు మాత్రమే చేస్తామని గిరి గీసుకోకుండా మెల్లగా వెబ్ సిరీస్ ల వైపు వస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ వరకు చూసుకుంటే ఈ విషయంలో విక్టరీ వెంకటేష్ మొదటి అడుగు ఆల్రెడీ వేసేశారు. రానాతో కలిసి చేస్తున్న రానా నాయుడు ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటోంది. వేగంగానే చేయబోతున్నారు. నాగార్జున సైతం స్క్రిప్ట్ లు పరిశీలిస్తున్న విషయం ఆయనే స్వయంగా చెప్పారు. ఇక బాలకృష్ణ తన ఫస్ట్ స్టెప్ ఆహాలో […]
ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మహా అయితే పదేళ్లు ఉండేది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాల్సిందే. విజయశాంతి లాంటి ఒకరిద్దరు మినహాయించి లాంగ్ ఇన్నింగ్స్ ని ఎంజాయ్ చేసినవాళ్లు తక్కువే. రాధిక, రోజా, మధుబాల తదితరులు సపోర్టింగ్ రోల్స్ కి రావడం చూశాం. ఇక ఇప్పటి జెనరేషన్ కథానాయికలకు మాత్రం ఓటిటి ప్లాట్ ఫార్మ్ మంచి వేదికగా మారుతోంది. సెకండ్ ఇన్నింగ్స్ కు బలమైన ఊతమిస్తోంది. డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ మధ్య విపరీతమైన పోటీ నెలకొన్న […]
వెబ్ సిరీస్ అంటే ఆ ఎవరు చూస్తారు ఇంచుమించు సీరియల్లాగే ఉంటుంది కదాని కొందరనుకుంటున్నారు కానీ ప్రపంచవ్యాప్తంగా ఇవి సృష్టిస్తున్న సంచలనాలు చూస్తే మాత్రం నోరెళ్ళబెట్టక మానరు. దానికి సాక్ష్యంగా నిలుస్తోంది స్క్విడ్ గేమ్స్. గత నెల నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ మొదలుపెట్టిన ఈ వెబ్ సిరీస్ చాలా తక్కువ టైంలోనే ఆ ప్లాట్ ఫార్మ్ లోని పాత రికార్డులన్నీ బద్దలు కొడుతూ చరిత్ర సృష్టిస్తోంది. దీని హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్ మన భారతీయ […]
సృజనాత్మకత, ప్రేక్షకులను ఎంగేజ్ చేయించే కంటెంట్ ఉండాలే కానీ భాషతో సంబంధం లేకుండా మరీ ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ బ్రహ్మరధం పడతారని ఇటీవలి కాలంలో ఎన్నో వెబ్ సిరీస్ లు ఋజువు చేశాయి. స్ట్రేంజర్ థింగ్స్, మనీ హీస్ట్, డార్క్ లాంటివి ఇండియాలోనూ బ్రహ్మాండమైన ఆదరణ దక్కించుకున్నాయి. వీటికి డిమాండ్ ఏ స్థాయిలో ఉందంటే వరల్డ్ వైడ్ ఒకేసారి తెలుగు తమిళ భాషల్లోనూ రిలీజ్ చేసేలా సదరు ఓటిటి సంస్థలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇటీవలే రిలీజైన […]