P Krishna
Greater Noida: ఇటీవల కాలంలో చాలా మంది తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించి సొసైటీలో లగ్జరీగా జీవించాలనే తాపత్రయంతో ఉన్నారు. ఇందుకోసం ఎలాంటి మోసాలు, అక్రమాలు చేయడానికి సిద్దపడుతున్నారు.
Greater Noida: ఇటీవల కాలంలో చాలా మంది తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించి సొసైటీలో లగ్జరీగా జీవించాలనే తాపత్రయంతో ఉన్నారు. ఇందుకోసం ఎలాంటి మోసాలు, అక్రమాలు చేయడానికి సిద్దపడుతున్నారు.
P Krishna
ఈ మధ్య చాలా మంది తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించి సొసైటీలో లగ్జరీగా జీవించాలని చూస్తున్నారు. ఇందుకోసం ఎన్నో అడ్డదారులు వెతుక్కుంటున్నారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్, హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్ స్మగ్లింగ్ ఇలా ఎన్నో రకాల దందాలు చేస్తూ లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. ఎలాంటి నేరాలు చేసేవారైనా చిన్న తప్పిదాలు చేసి పోలీసులకు చిక్కుతుంటారు. గ్రేటర్ నోయిడాలోని పార్శ్వనాథ్ పనోరమా సొసైటీలోని ఓ ఫ్లాట్‌లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న రాహుల్ చౌదరి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మీరట్ జిల్లాకు చెందిన రాహుల్ చౌదరి ఆరు నెలలుగా 10వ అంతస్తులో ఉన్న తన ఫ్లాట్‌లో ఆధునిక వ్యవసాయ విధానంతో గంజాయిని పెంచుతున్నాడు. వివరాల్లోకి వెళితే..
గ్రేటర్ నోయిడాలోని పార్శ్వనాథ్ పనోరమా సొసైటీలోని ఓ ఫ్లాట్‌లో అక్రమంగా కుండీల్లో గంజాయిని పెంచుతున్న రాహుల్ చౌదరి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికా నుంచి విత్తనాలు కొని ఇంట్లో కుండీల్లో ‘గంజాయి’ పండించాడు. వాటిని విక్రయించేందుకు డార్క్ వెబ్ సైట్ ని ఉపయోగించినట్లు తెలుస్తుంది. ఈ డార్క్ వెబ్ ద్వారా క్లయింట్స్ ని పరిచయం చేసుకొని వారికి గుట్టు చప్పుడు కాకుండా గంజాయి సరఫరా చేసేవాడు. రాహుల్ చౌదరి ఇటీవల వెబ్ సీరీస్ లు చూసి గంజాయి సాగు చేయడం.. ఎలా అమ్మాలో అన్న విషయం గురించి నేర్చుకున్నాడు. బయట ఎవరికీ అనుమానం రాకుండా తన ఫ్లాట్ లోనే పక్కా ప్లాన్ చేసి గంజాయి మొక్కలను పెంచాడు.రాహుల్ చేస్తున్న దందా గురించి పోలీసులకు సమాచారం అందింది. పక్కా పథకం ప్రకారం రైడ్ చేసి 2 కిలోల కన్నా ఎక్కువగా గంజాయి, 163.4 గ్రాముల ఓషన్ గంజాయి అంటే ప్రీమియం గంజాయితో పాటు వ్యవసాయ సామగ్రి, కొన్ని రకాల కెమికల్స్ ని స్వాధీనం చేసుకున్నారు.ఆరు నెలల్లో 50కి పైగా మొక్కలు పెంచాడు.వాటిలో ఇప్పటి వరకు 20 మొక్కలు అమ్మి రూ.12 లక్షల వరకు సంపాదించినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు. దీని తర్వాత దాదాపు 80 మొక్కలకు ఆర్డర్ వచ్చిందని.. వీటి ధర రూ.48 లక్షలు ఉంటుందని పోలీసులకు తెలిపాడు.
ఓ విదేశీ ఆన్ లైన్ వెబ్ సైట్ ద్వారా గంజాయి మొక్క విత్తనాలను కొనుగోలు చేసినట్లు రాహుల్ తెలిపాడు.దేశంలో ఇటీవల గంజాయికి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. మైనర్లు కూడా గంజాయి మత్తకు బానిస అవుతున్నారు. గంజాయి సిగరెట్ రూపంలోనే కాదు.. వివిధ రకాలుగా వాడుతున్నారు. కొన్ని పట్టణాల్లో గల్లీ గల్లీకి లభిస్తున్నాయి. గంగజాయి పెంపకం గురించి రాహుల్ చౌదరి పోలీసులకు వివరించాడు. ఒక గంజాయి మొక్కను పండించానికి సుమారు ఆరు నుంచి ఏడు వేల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిపాడు. ఒక్కొక్క మొక్క 30 నుంచి 40 గ్రాముల OG ను ఉత్పత్తి చేస్తుంది. దీన్ని మార్కెట్ లో సుమారు 60 నుంచి 80 వేల రూపాయల వరకు అమ్మవొచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ లాభం వస్తుందని ఈ దందాలోకి దిగినట్లు రాహుల్ తెలిపాడు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని గ్రేటర్ నోయిడా డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ సాద్ మియా ఖాన్ తెలిపారు. నిందితుడికి సంబంధించి లింకులు, నెట్‌వర్క్‌పై కూడా సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని ఆయన చెప్పారు.
VIDEO | A Greater Noida resident has been arrested by the police after he was allegedly found cultivating cannabis inside his apartment.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/ia2YMh8Mp4
— Press Trust of India (@PTI_News) November 12, 2024