భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటన జరిగిన దాదాపు 39 ఏళ్లు కావొస్తుంది. కానీ దాని ప్రభావం మాత్రం పూర్తిగా పోలేదు. ఇక సంఘటన ఆధారంగా ది రైల్వే మెన్ అనే పేరుతో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కింది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం.
భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటన జరిగిన దాదాపు 39 ఏళ్లు కావొస్తుంది. కానీ దాని ప్రభావం మాత్రం పూర్తిగా పోలేదు. ఇక సంఘటన ఆధారంగా ది రైల్వే మెన్ అనే పేరుతో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కింది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం.
భోపాల్ గ్యాస్ లీక్.. ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక దుర్ఘటనగా నిలిచింది. 1984 డిసెంబర్ 2, 3 తేదీల్లో జరిగిన ఈ హృదయ విదారక సంఘటన దాదాపు 6 లక్షల మందిపై ప్రభావం చూపింది. చాలా మంది మరణించిగా.. వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. మిథైల్ ఐసోసైనైడ్ అనే విషపూరిత రసాయనం లీక్ కావడంతో.. ఈ విపత్తు సంభవించింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో గల యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్(యూసీఐఎల్) ప్లాంట్ లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘోర సంఘటన జరిగి దాదాపు 39 ఏళ్లు కావొస్తున్నప్పటికీ.. దాని ప్రభావం ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తూనే ఉంది. ఇదిలా ఉండగా.. ఈ సంఘటనపై ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ‘ది రైల్వే మెన్’ పేరుతో రూపొందుతున్న ఈ సిరీస్ లో స్టార్ యాక్టర్ మధవన్ కీ రోల్ పోషిస్తున్నాడు. మరి ఈ వెబ్ సిరీస్ ఏ ఓటీటీలోకి వస్తుంది? ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం.
1984 డిసెంబర్ 2,3 తేదీలను భారతీయులు ఎన్నటికీ మర్చిపోలేరు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో మిథైల్ ఐసోసైనైడ్ గ్యాస్ లీక్ కావడంతో.. వేలాది మంది ఊపిరాడక చనిపోయారు. లక్షల్లో మంది గాయపడ్డారు. ఇక ఈ దుర్ఘటన తాలూకు ఛాయలు ఇంకా అక్కడి ప్రాంతాల్లో కనిపిస్తూనే ఉన్నాయి. ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని ఓ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ‘ది రైల్వే మెన్’ అనే పేరుతో ఈ సిరీస్ రూపొందుతోంది. దాదాపు షూటింగ్ మెుత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే.. ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ‘ది రైల్వే మెన్’ వెబ్ సిరీస్ నవంబర్ 18 నుంచి ప్రముఖ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఇక ఇందుకు సంబంధించిన విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్, యశ్ రాజ్ సంస్థ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. డైరెక్టర్ శివ్ రావైల్ ప్రతిష్టాత్మకంగా దీనిని నాలుగు ఎపిసోడ్లుగా తెరకెక్కించాడు. భోపాల్ గ్యాస్ లీకేజీ సంఘటనలో రైల్వే ఉద్యోగులు సహృదయంతో బాధితులకు సాయం చేసేందుకు వెళ్లారు. వందలమంది ప్రాణాలను కాపాడారు. దీనినే రైల్వె మెన్ సిరీస్‌లో చూపించనున్నట్లు డైరెక్టర్ తెలిపారు. ఇక ఈ సిరీస్‌లో ప్రముఖ నటుడు మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే కే కే మేనన్, దివ్యేందు, బాబిల్ ఖాన్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.