iDreamPost
android-app
ios-app

జూన్ 10 – భారీగా OTT వినోదం

  • Published Jun 09, 2022 | 3:50 PM Updated Updated Jun 09, 2022 | 3:50 PM
జూన్ 10 – భారీగా OTT వినోదం

థియేటర్లలో ఎలాగూ కొత్త సినిమాలు వస్తుంటాయి కానీ ఇల్లు కదలకుండా కూర్చున్న చోటే కాలక్షేపం అయ్యే అవకాశం ఇస్తున్నవి ఓటిటిలే. 10వ తేదీన అంటే సుందరానికి, 777 ఛార్లీలతో పాటు ఇంకో రెండు చిన్న సినిమాలు హాల్లో అడుగుపెడుతున్నాయి. వాటికి ధీటుగా స్మాల్ స్క్రీన్ ఎంటర్ టైన్మెంట్ కూడా ముస్తాబవుతోంది. అవేంటో చూద్దాం. జీ5లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అందుకుంటున్న మూవీ ‘కిన్నెరసాని'(KINNERASANNI). మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన ఈ థ్రిల్లర్ జనవరిలో రావాల్సింది. కానీ మెగా ఫ్యామిలీతో అతని సంబంధాల గురించి ఏవో ప్రచారాలు జరుగుతున్న టైంలో దీని విడుదల ఆగిపోయింది. కట్ చేస్తే ఆరు నెలల తర్వాత ఇలా వస్తోంది.

శివకార్తికేయన్ ‘డాన్'(DON Movie) నెట్ ఫ్లిక్స్ లో వస్తోంది. తెలుగులోనూ మంచి రన్ దక్కించుకున్న ఈ కాలేజీ ఎంటర్ టైనర్ ని మిస్ అయినవాళ్లు చాలానే ఉన్నారు. సో వ్యూస్ పరంగా సదరు సంస్థ ధీమాగా ఉంది. రెండు రోజుల గ్యాప్ తో మమ్ముట్టి లేటెస్ట్ హిట్ ‘సిబిఐ 5 ది బ్రెయిన్'(CBI 5: The Brain)ని నెట్ ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తెలుగు వెర్షన్ కూడా ఉంటుంది. మురారి, శంకర్ దాదా ఎంబిబిఎస్, మన్మదుడు ఫేమ్ సోనాలి బెంద్రే క్యాన్సర్ తో పోరాడి గెలిచి చాలా గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న ‘ది బ్రోకెన్ న్యూస్'(The Broken News) జీ5(ZEE5)లో రాబోతోంది. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటంతో పాటు కాంటెంపరరీ ఇష్యూ మీద తీసుకున్న సబ్జెక్టు కావడంతో ఆడియన్స్ లో మంచి ఆసక్తి నెలకొంది.

ఇవి కాకుండా అర్త్(జీ5)(ARDH – ZEE5), కోడ్ ఎం(ఊట్ సెలెక్ట్), ఫస్ట్ కిల్(FIRST KILL – NETFLIX) ఇన్నలే వార్(సోనీ లివ్) తదితర సిరీస్ లు, సినిమాలు జూన్ 10నే వస్తున్నాయి. ఇంతేసి వినోదం ఉండగా అదే పనిగా థియేటర్ గురించి ఆలోచించేవాళ్ళు తగ్గమంటే తగ్గరా. ఓటిటి యాప్స్ మధ్య విపరీతమైన పోటీ నేలుకొన్న నేపథ్యంలో కంటెంట్ విషయంలో అందరూ భారీ బడ్జెట్ లతో ముందుకు వెళ్తున్నారు. క్వాలిటీ కోసం నో కాంప్రోమైజ్ అంటున్నారు. కాకపోతే అన్ని యాప్స్ కు చందాలు కడితేనే ఇవన్నీ చూసే వెసులుబాటు ఉంటుంది. దీనికీ ఆన్ లైన్ లో పరిష్కారాలు ఉన్నాయి కానీ మొత్తానికి ఏది చూడాలి ఏది వద్దనే నిర్ణయం తీసుకోవడం కూడా సవాల్ గా మారుతోంది