iDreamPost
android-app
ios-app

Trisha: OTTలోకి త్రిష ఫస్ట్‌ వెబ్‌ సిరీస్‌.. అంచనాలు పెంచిన టీజర్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

  • Published Jul 09, 2024 | 8:40 AM Updated Updated Jul 09, 2024 | 8:40 AM

స్టార్‌ హీరోయిన్‌ త్రిష నేరుగా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఆమె నటించిన బృంద వెబ్‌ సిరీస్‌ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ సిరీస్‌ మీద అంచనాలు పెంచగా.. స్ట్రీమింగ్‌ తేదీ ప్రకటించారు మేకర్స్‌. ఆ వివరాలు..

స్టార్‌ హీరోయిన్‌ త్రిష నేరుగా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఆమె నటించిన బృంద వెబ్‌ సిరీస్‌ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ సిరీస్‌ మీద అంచనాలు పెంచగా.. స్ట్రీమింగ్‌ తేదీ ప్రకటించారు మేకర్స్‌. ఆ వివరాలు..

  • Published Jul 09, 2024 | 8:40 AMUpdated Jul 09, 2024 | 8:40 AM
Trisha: OTTలోకి త్రిష ఫస్ట్‌ వెబ్‌ సిరీస్‌.. అంచనాలు పెంచిన టీజర్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే

ఇప్పుడు నడిచేదంతా ఓటీటీల కాలం. వాటికి క్రేజ్‌ ఎంతలా పెరిగిందంటే.. స్టార్‌ హీరోయిన్లు, హీరోలు సైతం.. ఓటీటీ వెబ్‌ సిరీస్‌లలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. నాగచైతన్య సహా ఇప్పటికే అనేక మంది ఇండియన్‌ టాప్‌ హీరో, హీరోయిన్లు.. నేరుగా ఓటీటీల్లో విడుదలయ్యే వెబ్‌ సిరీస్‌లలో నటించగా.. ఇప్పుడు ఈ జాబితాలోకి సౌత్‌ బ్యూటీ త్రిష కూడా చేరింది. దక్షిణాదిలో దశాబ్దానికి పైబడి స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది త్రిష. ఏళ్లు గడుస్తున్న కొద్ది ఈ బ్యూటీ గ్లామర్‌ మరింత పెరుగుతోంది తప్ప ఇసుమంత కూడా తగ్గడం లేదు.

నాలుగు పదుల వయసులో కుర్ర హీరోయిన్లను మించిన అందంతో మెరిసిపోతుంది త్రిష. సినిమాల విషయంలో కూడా ఆమెతో పోటీ పడే మరో హీరోయిన్‌ దరిదాపుల్లో కనిపించడం లేదు. వరుస అవకాశాలు అంది పుచ్చుకుంటూ.. దూసుకుపోతుంది. ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఆమె నటించిన ఫస్ట్‌ వెబ్‌ సిరీస్‌ బృంద స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. ఆ వివరాలు..

స్టార్ హీరోయిన్ త్రిష.. ఓటీటీల్లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఆమె నటించిన తొలి ఓటీటీ వెబ్‌ సిరీస్‌ ‘బృంద’ విడుదలపై ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సిరీస్‍లో త్రిష పోలీస్ ఆఫీసర్‌ బృందగా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆమెకు ఇదే తొలి ఓటీటీ ప్రాజెక్ట్‌. దీంతో బృందపై ఆసక్తి నెలకొంది. సంవత్సరంగా ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు విడుదలకు రెడీ అయింది.  ఈక్రమంలో సోమవారం నాడు అనగా జూలై 8 మేకర్స్‌ బృంద సిరీస్ టీజర్ రిలీజ్ చేశారు. ఎంతో ఆసక్తికరంగా సాగిన ఈ టీజర్‌.. వెబ్‌ సీరిస్‌ మీద అంచనాలు పెంచింది. అలానే బృంద విడుదల తేదీ కూడా ఫిక్స్‌ చేశారు మేకర్స.

స్ట్రీమింగ్ డేట్ ఇదే..

బృంద వెబ్ సిరీస్ ఆగస్టు 2వ తేదీన సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. టీజర్‌ విడుదల సందర్భంగా స్ట్రీమింగ్ డేట్‍ను కూడా సోనీ లివ్ వెల్లడించింది. తెలుగులోనే ఈ సిరీస్ రూపొందింది. మరిన్ని ముఖ్యమైన భాషల్లోనూ వస్తుందని పేర్కొంది. “థ్రిల్లర్ ఫ్యాన్స్..సిద్ధంగా ఉండండి. కొత్త సిరీస్‍తో త్రిష తన ఓటీటీ డెబ్యూట్‍తో వస్తున్నారు. ఆగస్టు 2న బృంద స్ట్రీమింగ్‍కు రానుంది” అని సోనీ లివ్ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.

బృంద వెబ్ సిరీస్‍ను యాడింగ్ అడ్వర్టైజింగ్ పతాకంపై కొల్ల ఆశిష్ నిర్మించారు. దీనికి సూర్య మనోజ్ వంగల దర్శకత్వం వహించారు. గతంలో ఇతను.. స్టార్ డైరెక్టర్లు శేఖర్ కమ్ముల, హను రాఘవపూడి దగ్గర అసిసెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. బృంద సిరీస్‍లో త్రిష, ఇంద్రజిత్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషించగా.. జయ ప్రకాశ్, ఆమని, రవీంద్ర విజయ్, ఆనంద్ సామి, రాకేందు మౌళి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్‍కు శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తుండగా.. దినేశ్‌ కే బాబు సినిమాటోగ్రాఫర్‌గా ఉన్నారు. ఆగస్టు 2 నుంచి ఈ సిరీస్‍ను సోనీ లివ్‍లో చూడొచ్చు.

Jojobet GirişmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GiriştestereCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swapholiganbet giriş