iDreamPost
android-app
ios-app

OTTలోకి ఆర్య తొలి వెబ్ సిరీస్.. ఆసక్తి రేకెత్తించేలా టీజర్! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

  • Author Soma Sekhar Published - 07:17 PM, Thu - 9 November 23

నటుడు ఆర్య నటించిన తొలి వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి ఈ వెబ్ సిరీస్ ఏ ఓటీటీలో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందో తెలుసుకుందాం.

నటుడు ఆర్య నటించిన తొలి వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి ఈ వెబ్ సిరీస్ ఏ ఓటీటీలో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందో తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Published - 07:17 PM, Thu - 9 November 23
OTTలోకి ఆర్య తొలి వెబ్ సిరీస్.. ఆసక్తి రేకెత్తించేలా టీజర్! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ప్రస్తుతం వెబ్ సిరీస్ ల హవా నడుస్తోంది. ఇప్పటికే ఎందరో హీరోలు, హీరోయిన్లు ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వెబ్ సిరీస్ ల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇక ఇదే కోవలోకి రాబోతున్నాడు టాలెంటెడ్ యాక్టర్ ఆర్య. అతడు నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్’ది విలేజ్’. ది విలేజ్ అనే నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ కు మిలింద్ రాజు దర్శకత్వం వహించాడు. తాజాగా దీనికి సంబంధించిన స్ట్రీమింగ్ తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు రిలీజ్ చేసిన టీజర్ ఉత్కంఠంగా ఉంది. మరి సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సిరీస్ ఎప్పటినుంచి ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందో ఇప్పుడు తెలుసుకుందాం.

‘ది విలేజ్’ టాలెంటెడ్ యాక్టర్ ఆర్య నటించిన తొలి వెబ్ సిరీస్. దీనికి మిలింద్ రాజు దర్శకత్వం వహించగా.. ది విలేజ్ అనే గ్రాఫిక్ నవల ఆధారంగా ఈ సిరీస్ ను రూపొందించారు. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఆద్యాంతం ఆసక్తిని రేకెత్తించే విధంగా ఈ వెబ్ సిరీస్ ను మలిచినట్లు టీజర్ చూస్తేనే తెలుస్తోంది. హార్రర్ నేపథ్యంలో రూపొందిన ఇందులో దివ్య పిళ్లై, ఆడుకాలం నరేన్, జార్జ్ మయన్, పూజా రామచంద్రన్ కీలక పాత్రలు పోషించారు.

ఇక ఈ వెబ్ సిరీస్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 24 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అధికారికంగా తెలిపారు. కేవలం 30 సెకండ్ల నిడివితో రిలీజ్ చేసిన టీజర్ ఈ సిరీస్ పై ఎంతో ఆసక్తిని పెంచుతోంది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ది విలేజ్ వెబ్ సిరీస్ అందుబాటులో ఉండనుంది. ఇదిలా ఉండగా.. ఆర్య ప్రస్తుతం తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న ‘సైంధవ్’ మూవీలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కిస్తుండగా.. సంక్రాంతికి విడుదల కానుంది.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet