iDreamPost
android-app
ios-app

OTTలోకి వీరప్పన్ జీవిత చరిత్ర.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడంటే?

  • Author Soma Sekhar Published - 04:45 PM, Sun - 26 November 23

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గంధపు చక్కల స్మగ్లర్.. వీరప్పన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'కూసే మునిస్వామి వీరప్పన్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గంధపు చక్కల స్మగ్లర్.. వీరప్పన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'కూసే మునిస్వామి వీరప్పన్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.

  • Author Soma Sekhar Published - 04:45 PM, Sun - 26 November 23
OTTలోకి వీరప్పన్ జీవిత చరిత్ర.. స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడంటే?

ప్రేక్షకులపై థియేటర్ల ప్రభావం ఎలా ఉందో తెలీదుగానీ.. ఓటీటీ ప్రభావం మాత్రం బాగానే ఉంది. ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఈ ఫ్లాట్ ఫామ్ లపై ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు కుటుంబ సభ్యులు అందరూ ఇంట్లోనే కూర్చుని చక్కగా సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక వారి టేస్ట్ కు తగ్గట్లుగానే ప్రతీవారం ఓటీటీలో పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గంధపు చక్కల స్మగ్లర్ వీరప్పన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘కూసే మునిస్వామి వీరప్పన్’ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. మరి ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో ఆ వివరాలు..

వీరప్పన్.. భారతదేశంలో ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తికాదు. అంతలా సంచలనం సృష్టించాడు ఈ గంధపు చెక్కల స్మగ్లర్. ఇక అతడి జీవితంపై ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. గతంలో సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సైతం వీరప్పన్ పై ఓ చిత్రాన్ని తీశాడు. తాజాగా మరోసారి అతడి జీవిత చరిత్ర ఆధారంగా ‘కూసే మునిస్వామి వీరప్పన్’ అనే టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ రూపొందింది. ఇప్పటికే ఈ సిరీస్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. దానికి విశేష స్పందన లభించింది. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను వెల్లడించారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ జీ5లో డిసెంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది కూసే మునిస్వామి వీరప్పన్. ఈ సిరీస్ కు శరత్ జ్యోతి దర్శకత్వం వహించాడు. కాగా.. గతంలో వీరప్పన్ జీవిత చరిత్ర ఆధారంగా పలు సినిమాలు వచ్చిన సంగతి మనకు తెలియనిది కాదు. మూడు దశాబ్దాల పాటు ప్రభుత్వాలను ముప్పు తిప్పలు పెట్టాడు వీరప్పన్. గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేస్తూ.. అటు ప్రభుత్వాలకు ఇటు పోలీసులకు చిక్కకుండా తిరిగాడు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) టీమ్ చేసిన ఎన్ కౌంటర్ లో మరణించాడు వీరప్పన్.