Krishna Kowshik
సినిమా, వెబ్ సిరిస్ లు ఏ జోనర్ అయినా.. చివరి వరకు ఇంట్రస్టింగ్ అండ్ క్యూరియాసిటీ ఉంటేనే చూడగలం. అలాంటి ఓ వెబ్ సిరీస్సే ఓటీటీలో సందడి చేస్తోంది. నెక్ట్స్ ఏం జరుగుతుందీ అన్న ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం...
సినిమా, వెబ్ సిరిస్ లు ఏ జోనర్ అయినా.. చివరి వరకు ఇంట్రస్టింగ్ అండ్ క్యూరియాసిటీ ఉంటేనే చూడగలం. అలాంటి ఓ వెబ్ సిరీస్సే ఓటీటీలో సందడి చేస్తోంది. నెక్ట్స్ ఏం జరుగుతుందీ అన్న ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం...
Krishna Kowshik
ప్రస్తుతం సినీ ప్రియులకు వరంగా మారిపోయాయి ఓటీటీలు. వీకెండ్ వస్తే చాలు.. ఏ డిజిట్ ఫ్లాట్ ఫాంలోకి ఏ మూవీ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. కేవలం టాలీవుడ్ చిత్రాలే కాకుండా నాన్ తెలుగు మూవీస్ కూడా వాచ్ చేస్తున్నారు. క్రైమ్, థ్రిల్లర్, సస్పెన్స్, హార్రర్ అనే కాదూ .. గిప్లింగ్ కథ, స్ట్ర్కీన్ ప్లే ఉంటే చాలు.. టీవీ లేదా సెల్ ఫోన్లలో ప్రతి సీన్ స్కిప్ చేయకుండా వీక్షిస్తున్నారు. సినిమానే కాదూ.. సిరీస్‌లు కూడా బాగా అలరిస్తున్నాయి. ఇప్పుడు ఓటీటీల్లో వీటిదే హవా. రెండు మూడు గంటల్లో చెప్పలేని కథలను వెబ్ సిరీస్ రూపంలో తీసుకువస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇది సక్సెస్ అయితే.. దీన్ని సీక్వెల్స్ కూడా తెరకెక్కిస్తున్నారు. అలాంటి ఓ వెబ్ సిరీస్సే కాలా పానీ.
గతంలో కాలాపానీ పేరుతో ప్రముఖ మాలీవుడ్ డైరెక్టర్ ప్రియదర్శన్ మూవీ తెరకెక్కించగా.. ఎంత పెద్ద హిట్ కొట్టిందో అందరికీ తెలుసు. ఇదే పేరుతో ఇప్పుడు వెబ్ సిరీస్ తీసుకు వచ్చారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్‌లో అక్టోబర్ 18 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. అండమాన్ చుట్టూ తిరిగే ఓ సస్పెన్షియల్ స్టోరీ ఇది. ఇందులో మోనా సింగ్, అశుతోష్ గోవార్కర్, ఆరుషి శర్మ, వికాస్ కుమార్, చిన్నయ్ మాండ్లేకర్, సుకాంత్ గోయెల్, రాధిక మెహ్రెుత్రా, పూర్ణిమ ఇంద్ర జిత్ ప్రధానపాత్రలు పోషించారు. పోషమ్ పా పిక్చర్స్ బ్యానర్ పై విశ్వపతి సర్కార్, అమిత్ గోలాని, సందీప్ సాకేత్, నిమిషా మిశ్రా సంయుక్తంగా నిర్మించారు. అమిత్, సమీర్ సక్సెనా దీనికి దర్శకులు. సీజన్ 1 మొత్తం 7 ఎపిసోడ్స్ ఉన్నాయి.
అండమాన్ నికోబార్ దీవులు అనగానే.. మన ఇండియన్స్‌కు ఎప్పుడూ క్యూరియాసిటీనే. ఎందుకంటే అక్కడ జైలు గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇప్పుడు ఈ సిరిస్ కూడా అలాంటి క్యూరియాసిటీని పెంచుతుంది. ఎక్కడో విసిరేసినట్లు ఉండే ఈ దీవిలో.. కరోనా లాంటి మిస్టిరీయస్ డిసీజ్ వస్తే పరిస్థితి ఏందటన్నదే ఈ కథే. ఇలాంటి కథలు హాలీవుడ్ వాళ్లకు కొత్త కాదూ కానీ.. ఇప్పుడిప్పుడే ఈ లాంటి జోనర్లను ట్రై చేస్తున్నాయి.. ఇండియన్ సినీ ఇండస్ట్రీస్. ఇక కాలాపాని కథ విషయానికి వస్తే.. కథ 2027 చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అక్కడ నీళ్లు పొల్యూట్ అయ్యి.. ఓ విచిత్రమైన వ్యాధి వ్యాపిస్తుంది. 11 మంది ఆసుపత్రిలో చేరుతారు.అదే ఆసుపత్రిలో డాక్టర్ సౌదామిని (మోనా సింగ్ ) పని చేస్తూ ఉంటుంది.
హాస్పిటల్లో చేరిన పేషెండ్స్‌కు నల్లని మచ్చలు ఏర్పడటం.. తగ్గుతుంది అనుకులోపు.. మళ్లీ తిరగబెట్టడం.. ఆ వ్యాధితోనే చనిపోతుంటారు. తొలుత సౌదామిని ఏదో వైరస్ అని భావిస్తూ ఉంటుంది. దానికి సంబంధించిన పరిశోధనలు చేస్తుండగా.. అది 1989లో ఇదే రకమైన వైరస్ వచ్చినట్లు తేలుతుంది. చివరకు ఒక ప్రదేశంలోని వ్యక్తులకు వైరస్ సోకుతుందని తెలిసి.. అక్కడకు వెళుతుంది. అప్పుడు కానీ అసలు విషయం తెలియదు. ఆ వైరస్ ఏంటో కనిపెట్టి.. అది వేగంగా వ్యాపిస్తుందని తెలుసుకుంటుంది. అంతలోనే డాక్టర్ సౌదామిని చనిపోతుంది. ఆ తర్వాత జరిగే న్యూయర్ వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ఈ వైరస్ ఫాస్ట్ గా వ్యాప్తి చెందుతుందని తెలిసి.. అన్ని రవాణా మార్గాలను మూసేస్తారు అధికారులు.
అప్పుడు సంతోష్ (వికాస్ కుమార్) దంపతులు అండమాన్‌కు తమ పిల్లతో వస్తారు.. ఆ తర్వాత ఏం జరిగింది. ఇంతకు ఆ వైరస్ ఏంటీ.. దాన్ని అంతమొందిస్తారా అనేది మిగిలిన కధ. నెట్ ఫ్లిక్స్‌లో చూసేయండి. కరోనా సమయంలో ఎదుర్కొన్న పరిస్థితులు ఇందులో కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. చాలా ఇంట్రస్టింగ్, ఎమోషనల్ డ్రామా అని చెప్పొచ్చు.. కాస్త స్లో నేరేషన్ ఉన్నప్పటికీ.. ఒక సారి వాచ్ చేయడం మొదలు పెడితే.. నెక్ట్స్ ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ బిల్డ్ అవుతూనే ఉంటుంది. ఈ డిసీజ్ ఏంటీ.. ఎలా చనిపోతున్నారు అని ఫైండ్ అవుట్ చేసే సన్నివేశాలు చాలా ఆసక్తి కరంగా ఉంటాయి. అయితే కొన్ని ప్రశ్నలను హోల్డ్ చేశారు. మిగిలినవి సీజన్ 2లో చూపించనున్నారు. తెలుగులో కూడా ఎవిలబుల్ ఉంది.. ఇంకెందుకు ఆలస్యం చూసేయండి.