Arjun Suravaram
ఇక ఈ ఏడాదిలో ఎన్నో సినిమాలు, సిరీసులు విడుదల అయ్యాయి. అయితే ఓటీటీలో డైరెక్టుగా వచ్చిన సిరీసుల్లో కొన్ని మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఇక ఈ ఏడాదిలో ఎన్నో సినిమాలు, సిరీసులు విడుదల అయ్యాయి. అయితే ఓటీటీలో డైరెక్టుగా వచ్చిన సిరీసుల్లో కొన్ని మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
Arjun Suravaram
కొన్ని రోజుల్లో నూతన సంవత్సరం రానుంది. పాత ఏడాదికి గుడ్ బై చెబుతూ.. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందు అందరు సిద్ధంగా ఉన్నారు. అలానే ఎవరి ప్లాన్స్ లో వాళ్లు న్యూ ఇయర్ కి స్వాగతం పలికేందుకు ప్లాన్లు రెడీ చేసుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ ఏడాదిలో ఎన్నో సినిమాలు, ఎన్నో సిరీసులు విడుదలయ్యాయి. అలా ఓటీటీలోకి నేరుగా వచ్చిన సిరీస్లులో కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలా ఈ ఏడాదిలో విడుదలైన సిరీసుల్లో టాప్-10 ఏవే ఇప్పుడు చూద్దాం. అంతేకాక ఆ సిరీసులు మీరు మిస్సయ్యారా అనేది ఇక్కడ తెలుసుకోంది. మరి… ఆ టాప్-10 సిరీసులు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
కోవిడ్ తరువాత చాలా మంది ప్రేక్షకులు ఓటీటీ కంటెంట్ కు అలవాటు పడ్డారు. ఇక వారికి తగ్గట్లుగానే ప్రేక్షకుల కోసం ఓటీటీ సంస్థలు కూడా కొత్త కొత్త కంటెంట్ ను సినీ ప్రియుల ముందుకు తీసుకు వస్తుంటాయి.ఇది ఇలా ఉంటే ప్రతివారం కొత్త సినిమాలు, సరికొత్త వెబ్ సిరీసులతో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సినీ ప్రియులను అట్రాక్ట్ చేస్తుంటాయి. అలానే ఓటీటీలో ప్రతి ఏడాది ఎన్నో మూవీస్, సిరీసులు సందడి చేస్తూ ఉంటాయి. అయితే 2023 ఏడాదిలో కూడా చాలా సిరిసులు వచ్చాయి. వాటిలో కొన్ని వెబ్ సిరీసులకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. మరి.. ఈ ఏడాది టాప్-10 వెబ్ సిరీస్ లు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
1.హీరో అక్కినేని నాగచైతన్య నటించిన తొలి వెబ్ సిరీస్ ‘దూత’. ‘మనం’, ’24’ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ ఈ సిరీస్ ను రూపొందించారు. జర్నలిజం ఇతివృత్తంగా హారర్ మిస్టరీ థ్రిల్లర్‌లో నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కించారు. ప్రస్తుతం దూత వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. మిస్ అయిన వాళ్లు ఉంటే కనుక ఓ లుక్ వేసేయండి.
2.బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి కలిసి నటించిన తొలి సిరీస్ ‘ఫర్జీ’. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ను తెరకెక్కకించిన రాజ్- డీకే ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. తాత నెలకొల్పిన పత్రికా ఆఫీస్ మూతపడిపోవడంతో ఎలాగైనా దాన్ని తిరిగి ఓపేన చేయాలనుకున్న ఓ యువకుడి కథగా ఈ సిరీస్ ను రూపొందించారు. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.
3.1984లో చోటుచేసుకున్న భోపాల్ గ్యాస్ దుర్ఘటనను కళ్లకు కట్టినట్లు చూపించిన సిరీస్ ‘ది రైల్వేమెన్’. ఈ సిరీస్ కు శివ్ రావైల్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో మాధవన్, కేకే మేనన్, దివ్యేందు శర్మ, మందిరా బేడీ తదితరలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
4.అండమాన్ నికోబార్ దీవుల్లోని పరిస్థితుల ఆధారంగా తీసిన వెబ్ సిరీస్.. కాలపాని. ఇది..అండమాన్ నికోబార్ దీవుల్లోని నీరు కలుషితమవడానికి కారణమేంటి.. ఎలాంటి పరిస్థితులకు దారితీసింది? అనే అంశంతో తెరకెక్కంచారు. ఈ సిరీస్ ను సమీర్ సక్సేనా, అమిత్ సంయుక్తంగా రూపొందించారు. మోనా సింగ్, అశుతోష్ గోవారికర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ కూడా నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతుంది.
5.టాలీవుడ్ యంగ్ హీరో రానా, విక్టరీ వెంకటేష్ నటించిన సిరీస్ ‘రానా నాయుడు’. ఈ సిరీస్ ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంది. ‘నెట్‌ఫ్లిక్స్’ విడుదలైన ఈ వెబ్‌సిరీస్ వరల్డ్ వైడ్ ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకుంది.
6.ఓటీటీ ప్రియులను బాగా ఆకట్టుకున్న మరో వెబ్ సిరీస్ ది ఫ్రీలాన్సర్. సిరియా సరిహద్దుల్లో ఉన్న ఐసిస్‌కు చెరలో చిక్కుకున్న అలియా అనే మహిళను రక్షించేందుకు రంగంలోకి దిగిన అవినాష్ దామోదరన్ అనే వ్యక్తి ఎలాంటి సాహసం చేశాడనే ఈ సిరీస్ ను రూపొదించారు. ప్రస్తుతం ఈ సిరీస్ డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రిమింగ్ అవుతుంది.
7.ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న సినిమాల్లో సేవ్ ది టైగర్స్ ఒకటి. మంచి వినోదాన్ని పంచే ముగ్గురు భార్య బాధితుల భర్తల కథనే సేవ్ ది టైగర్స్. ఈ సిరీస్ డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవతుంది.
8.స్కామ్ 2003- ది తెల్గీ స్టోరీ అనే వెబ్ సిరీస్ కూడా అందిరని బాగా ఆకట్టుకుంది. 2003లో స్టాంప్ పేపర్ మోసానికి పాల్పడ్డ అబ్దుల్ కరీం తెల్గీ జీవితం ఆధారంగా ఈ స్కామ్ వెబ్ సిరీస్ ను రూపొదించారు. ఇది సోనిలీవ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
9.ఇక ఓటీటీలోలో ఆకట్టుకున్న మరో వెబ్ సిరీస్ దహద్. ఇది ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోతున్నానంటూ లేఖ రాసి పారిపోయిన యువతి, ఆ కేసులో భాగంగా ఎస్‌ఐ అంజలి భాటి ఎదుర్కొన్న ఇబ్బందులతో ఈ సిరీస్ ను తెరకెక్కించారు. ఈ సిరీస్ సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
10.ఇషాన్ ఖట్టర్ , సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ పిప్పా. 1971లో జరిగిన భారత్, పాక్ యుద్ధంలో తన తోబుట్టువులతో కలిసి దేశం కోసం పోరాడిన కెప్టెన్ బలరామ్ సింగ్ మెహతా జీవితం చరిత్ర ఆధారంగా దీనిని రూపొందింది. ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ టాప్ వెబ్ సిరీస్ లు ఈ ఏడాది.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరి..వీటిలో మీరేమైన మిస్సై ఉంటే.. చూసేండి. మరి.. ఈ టాప్-10 సిరీస్ లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.