iDreamPost
android-app
ios-app

‘రానా నాయుడు 2’పై అప్డేట్ ఇచ్చిన వెంకీ మామ! ఎమన్నాడంటే?

  • Author Soma Sekhar Updated - 08:55 AM, Thu - 23 November 23

వెంకటేష్ కెరీర్ లో చేసిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే.. రానా నాయుడు వెబ్ సిరీస్ ఒకెత్తు. ఇక ఈ వెబ్ సిరీస్ పార్ట్ 2పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు ఈ స్టార్ హీరో.

వెంకటేష్ కెరీర్ లో చేసిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే.. రానా నాయుడు వెబ్ సిరీస్ ఒకెత్తు. ఇక ఈ వెబ్ సిరీస్ పార్ట్ 2పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు ఈ స్టార్ హీరో.

  • Author Soma Sekhar Updated - 08:55 AM, Thu - 23 November 23
‘రానా నాయుడు 2’పై అప్డేట్ ఇచ్చిన వెంకీ మామ! ఎమన్నాడంటే?

విక్టరీ వెంకటేష్.. టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన వెంకీ.. ఆ తర్వాత తన పంథా మార్చి మాస్ కథలను ఎంచుకోవడం మెుదలుపెట్టాడు. ప్రస్తుతం కథల ఎంపికలో కొత్తదనం వెతికేపనిలో పడ్డాడు. అందులో భాగంగానే వెబ్ సిరీస్ ల్లో కూడా నటించడం స్టార్ట్ చేశాడు. తన తొలి వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’తో వెంకీ సృష్టించిన సంచలనం అంతా.. ఇంతా కాదు. వెంకటేష్ కెరీర్ లో చేసిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే.. రానా నాయుడు వెబ్ సిరీస్ ఒకెత్తు. నాగనాయుడు పాత్రతో తనలో ఉన్న మరో నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాడు వెంకీ మామ. ఇక ఈ వెబ్ సిరీస్ పార్ట్ 2పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు ఈ స్టార్ హీరో.

“రానా నాయుడు” తెలుగు వెబ్ సిరీస్ ల్లో సరికొత్త సంచలనం అనే చెప్పాలి. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, యంగ్ హీరో రానా కలిసి నటించిన ఈ వెబ్ సిరీస్ ఎంత పెద్ద క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వెంకటేష్ తన కెరీర్ లో చేయని సరికొత్త పాత్రతో, సరికొత్త నటనతో కుర్రాళ్లకు కిక్కించాడు. అయితే ఈ వెబ్ సిరీస్ లో వెంకీ మామ బూతులు మాట్లాడాడని కొందరు తీవ్రంగా విమర్శించిన విషయం కూడా తెలిసిందే. 35 ఏళ్ల ఇమేజ్ ను పక్కన పెట్టి వెంకీ రిస్క తీసుకుని మరీ రానా నాయుడు చేశాడు. ముందుగానే ఈ సిరీస్ బోల్డ్ గా ఉంటుందని, భార్యా భర్తలు, కుటుంబ సభ్యులతో కలిసి దీన్ని చూడొద్దని ఆయన హెచ్చరించారు కూడా.

ఇదంతా కాసేపు పక్కనపెడితే.. ‘సైంధవ్’ మూవీ సాంగ్ లాంఛ్ కోసం ఓ కాలేజీకి వెళ్లిన వెంకీ మామకు ఓ ప్రశ్న ఎదురైంది. రానా నాయుడు సీజన్ 2 ఎప్పుడొస్తుందని స్టూడెంట్స్ అడగ్గా.. జనవరి నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుందని, ఫస్ట్ పార్ట్ చూశాక కుర్రాళ్లు షాకైతే.. పెద్దాళ్లు మాత్రం ఏంట్రా నువ్వు ఇలా మారిపోయావ్ అంటూ నవ్వుకున్నారని వెంకీ చెప్పుకొచ్చాడు. పార్ట్ 2లో నా క్యారెక్టర్ టిపికల్ గా ఉంటుందని, అంతే జాగ్రత్తలు కూడా తీసుకున్నానని ఈ కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు వెంకీ మామ. ఇక అతడు నటించిన సైంధవ్ మూవీ జనవరి 13న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించాడు. మరి రానా నాయుడు 2 లో వెంకీ పాత్ర ఎలా ఉండబోతోందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom