iDreamPost
android-app
ios-app

OTT Web Series: OTTలో సూపర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. క్షణ క్షణం వెన్నులో వణుకు పక్కా!

  • Published Apr 24, 2024 | 8:27 PM Updated Updated Apr 26, 2024 | 6:16 PM

క్షణ క్షణం వెన్నులో వణుకు పుట్టించే కొన్ని వెబ్ సిరీస్ లు సీజన్ల వారీగా కొన్ని ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో అందుబాటులో ఉన్నాయి. దానికి కంటిన్యుషన్ గా ఇంకా సరికొత్త సీజన్స్ వస్తూనే ఉన్నాయి. ఇంతకీ ఆ సిరీస్ ఏంటి అనే విషయాన్ని చూసేద్దాం.

క్షణ క్షణం వెన్నులో వణుకు పుట్టించే కొన్ని వెబ్ సిరీస్ లు సీజన్ల వారీగా కొన్ని ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో అందుబాటులో ఉన్నాయి. దానికి కంటిన్యుషన్ గా ఇంకా సరికొత్త సీజన్స్ వస్తూనే ఉన్నాయి. ఇంతకీ ఆ సిరీస్ ఏంటి అనే విషయాన్ని చూసేద్దాం.

  • Published Apr 24, 2024 | 8:27 PMUpdated Apr 26, 2024 | 6:16 PM
OTT Web Series: OTTలో సూపర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. క్షణ క్షణం వెన్నులో వణుకు పక్కా!

సినిమాలో ట్విస్ట్ లు, సస్పెన్స్ లు ఉంటాయి నిజమే. కానీ, సిరీస్ లలో అంతకుమించి ఉంటాయి. పైగా ప్రతి ఎపిసోడ్ ఒక సస్పెన్స్ తో ఎండ్ చేసి.. నెక్స్ట్ ఏమి జరుగుతుందా అనే ఆసక్తిని ప్రేక్షకులలో రప్పిస్తారు. దీనితో ప్రేక్షకులు కూడా రాత్రులు సమయం ఎంతైనా సరే ఆ సీజన్స్ ను కంప్లీట్ చేసేవరకు వదిలిపెట్టడంలేదు. ఈ మధ్య కాలంలో సిరీస్ లకు బాగానే ఆదరణ లభిస్తుంది. ఇంకా మేకర్స్ కూడా ఒక సీజన్ తో ఎండ్ చేయకుండా.. ఆ సీజన్స్ ను కంటిన్యూ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ మంచి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఒకటి ఓటీటీ లో అందుబాటులో ఉంది. ఇప్పటికే ఈ సిరీస్ రెండు సీజన్స్ ను పూర్తి చేసుకుని.. ఇప్పుడు మూడవ సీజన్ వరకు వచ్చింది. మరి ఈ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సిరీస్ పేరు “ఉండెఖి”. ఇది ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రెండు సీజన్స్ ప్రేక్షకులను ఇంప్రెస్స్ చేసేశాయి. ఈ సిరీస్ మొదటి సీజన్ 2020 లో విడుదల అయింది. ఈ సిరీస్ కు అప్పట్లో వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు, దీనితో ఈ సిరీస్ కు కంటిన్యుషన్ గా సీజన్ 2 ను 2022 లో విడుదల చేశారు. దానికి కూడా అంతే రెస్పాన్స్ వచ్చింది. దీనితో ఇప్పుడు ఈ సిరీస్ మూడవ సీజన్ ను కూడా ప్రకటించారు మేకర్స్. ఈ సిరీస్ కు ఆశిష్ ఆర్ శుక్లా దర్శకత్వం వహించారు. కాగా, దివ్యేందు భట్టాచార్య, సూర్య శర్మ, అంచల్ సింగ్, హర్ష ఛాయా, అంకుర్ రాతీ, అభిషేక్ చౌహాన్, అయన్ జోయా, అపేక్ష పోర్వాల్ లు ముఖ్య పాత్రలలో నటించారు, సోని లివ్ లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది. తెలుగులో కూడా ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక మే 10నుంచి మూడవ సీజన్ కూడా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

ఇక ఇప్పటివరకు మొదటి రెండు సీజన్స్ ను ఎవరైనా చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. అసలు ఈ సిరీస్ కథేంటంటే.. మనాలిలో ఒక వివాహం జరుగుతూ ఉంటుంది. అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో.. ఆ పెళ్ళిలో ఒక దారుణమైన హత్య జరుగుతుంది. ఆ హత్యను అక్కడున్న ఫోటోగ్రాఫర్ చిత్రీకరిస్తాడు. దానిని అతను మీడియా సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి అనుకుంటాడు. ఇక అక్కడి నుంచి కథ స్టార్ట్ అవుతుంది. ఆ హత్య చేసింది ఎవరు ! హత్యకు గురైంది ఎవరు ! ఫోటో గ్రాఫర్ దగ్గర ఉన్న ప్రూఫ్స్ తో కథ ఎలా ముందుకు సాగుతుంది అనేది ఈ సిరీస్ చూస్తే కానీ అర్ధం కాదు. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş