iDreamPost
android-app
ios-app

ఓటీటీలోకి వాణీ కపూర్‌ రొమాంటిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

  • Published Mar 02, 2024 | 2:20 PM Updated Updated Mar 02, 2024 | 2:20 PM

Vaani Kapoor Mandala Murders Web Series: ఈ మధ్యకాలంలో సినీ ప్రేక్షకులు ఎక్కువగా ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్ సీరీస్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. క్రైమ్, థ్రిల్లర్, కామెడీ అన్ని రకాల జోనర్లలో వెబ్ సీరీస్ సినిమా రేంజ్ లో వస్తున్నాయి.

Vaani Kapoor Mandala Murders Web Series: ఈ మధ్యకాలంలో సినీ ప్రేక్షకులు ఎక్కువగా ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్ సీరీస్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. క్రైమ్, థ్రిల్లర్, కామెడీ అన్ని రకాల జోనర్లలో వెబ్ సీరీస్ సినిమా రేంజ్ లో వస్తున్నాయి.

  • Published Mar 02, 2024 | 2:20 PMUpdated Mar 02, 2024 | 2:20 PM
ఓటీటీలోకి వాణీ కపూర్‌ రొమాంటిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

ఇటీవల ఓటీటీలో సినిమాలకు, వెబ్ సీరీస్ లకు ఎంతో క్రేజ్ పెరుగుతుంది. జోనర్ తో సంబంధం లేకుండా ఓటీటీలో వస్తున్న వెబ్ సీరీస్, మూవీస్ కంటెంట్ బాగుంటే చాలు ఎంతో గొప్పగా ఆదరిస్తున్నారు మూవీ లవర్స్. భారతీయ చిత్రాలు మాత్రమే కాదు.. ఇతర భాషా చిత్రాలు, వెబ్ సీరీస్ బాగా ఆకట్టుకుంటున్నాయి. కొన్ని మూవీస్ అయితే డైరెక్ట్ గా ఓటీటీ లోనే రిలీజ్ చేస్తున్నారు. ఇటీవల హర్రర్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న వెబ్ సీరీస్ కి ఓటీటీలో విపరీతమైన క్రేజ్ లభిస్తుంది. తాజాగా యూత్ లో మంచి క్రేజ్ ఉన్న హాట్ బ్యూటీ వాణీ కపూర్ రొమాంటిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ గా వస్తున్న ‘మండాల మర్డర్స్’ వెబ్ సీరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. దీని స్ట్రీమింగ్ ఎక్కడనే విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న క్రేజీ హీరోయిన్లలో ఒకరు వాణీ కపూర్. గతంలో నేచురల్ స్టార్ నానీ నటించిన ‘ఆహా కళ్యాణం’ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించించి మంచి ఫాలోయింగ్ పెంచుకుంది. సోషల్ మీడియాలో తన బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తూ తెగ హంగామా చేస్తుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ ద్వారా బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈ హాట్ బ్యూటీ తాజాగా ‘మండాల మర్డర్స్’ వెబ్ సీరీస్ ద్వారా ఓటీటీ వేధికపై అరంగేట్రం చేస్తుంది. గోపీ పుత్రన్ దర్శకత్వంలో వస్తున్న ఈ వెబ్ సీరీస్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో ఉండబోతున్నట్లు తెలుస్తుది. యశ్ రాజ్ ఫిలిమ్స్ వారు నిర్మించిన ఈ సీరీస్ ని త్వరలో నెట్ ఫ్లిక్స్ వారు స్ట్రీమింగ్ చేయనున్నారు.

గతంలో ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ వెబ్ సీరీస్ రూపొందించారు. మర్డర్ మిస్టరీని ఛేదించే డిటెక్టీవ్ గా వాణి కపూర్ కనిపించనుంది. వాణి కపూర్ కెరీర్ లో మొదటి వెబ్ సీరీస్ ఇది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించాను.. వెబ్ సీరీస్ లో చేయాలనే కోరిక ఇటీవల కలిగింది. అందుకు సరైన కథ, పాత్ర కోసం ఎదురు చూశాను. లక్కీగా నాకు తగ్గ పాత్ర ఈ ప్రాజెక్ట్ ద్వారా లభించింది. నా నిరీక్షణ ఇంత త్వరగా ఫలిస్తుందని నేను అనుకోలేదు. విజయానికి దగ్గరి దారులు లేవనే సిద్దాంతాన్ిన నేను బాగతా నమ్ముతాను.. ఈ సీరీస్ నన్ను నటిగా ఓ మెట్టు ఎక్కిస్తుందని భావిస్తున్నా’ అని చెప్పింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet giriş