అంతా పూర్తయిపోయింది. ఒక మహాశకానికి సెలవు ఇస్తూ సూపర్ స్టార్ కృష్ణగారికి యావత్ ప్రపంచం తుది వీడ్కోలు పలికింది. మహేష్ బాబు మానసిక స్థితి, తన ఆలోచనల గురించి తలుచుకుని అభిమానులు కలవరపడుతున్నారు. ఒకే ఏడాదిలో అన్నయ్య, తల్లి, తండ్రిని కోల్పోవడం కన్నా పెద్ద విషాదం ఎవరికైనా ఇంకేముంటుంది. అందులోనూ తాను ప్రాణంగా ప్రేమించే వాళ్లంతా ఇలా దూరమైతే తట్టుకోవడం సులభం కాదు. నిన్నా మొన్నటి దాక కుటుంబ బాధ్యతను మోసిన వాళ్ళు లేకపోవడంతో ఇక మొత్తం […]
కన్నడ స్టార్ హీరో వి రవిచంద్రన్ అంటే మనవాళ్లకు అంతగా పరిచయం లేదు కానీ శాండల్ వుడ్ మార్కెట్ ని కమర్షియల్ గా పెంచినవాళ్లలో ఈయనా ఒకరు. ముఖ్యంగా ప్రేమలోక సినిమాతో సృష్టించిన రికార్డుల గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది తెలుగులో ప్రేమలోకంగా డబ్ అయ్యి ఇక్కడా బాగానే ఆడింది. 1991లో నాగార్జున రజనీకాంత్ లు తను కలిసి మొత్తం నాలుగు భాషల్లో శాంతి క్రాంతి అనే ప్యాన్ ఇండియా మూవీ చేసింది కూడా ఈయనే. […]
అభిమానులు కోరుకున్నట్టే పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ భీమ్లా నాయక్ 100 కోట్ల షేర్ కు దగ్గరలో ఉంది. ఏపిలో టికెట్ రేట్ల సమస్య ఉన్నప్పటికీ ఈ స్థాయిలో వసూళ్లు నమోదు కావడం సంచలనమే. పోటీగా ఏ సినిమా లేకపోవడంతో పవర్ స్టార్ కు బ్రేక్ వేసేవాళ్ళు లేకపోయారు. మొన్న వచ్చిన ఆడవాళ్ళూ మీకు జోహార్లు, సెబాస్టియన్ రెండూ సోసోగా టాక్ తెచ్చుకోడంతో జనం మళ్ళీ పవన్ మూవీకే ఓటు వేస్తున్నారు. ఇంకో నాలుగు రోజుల్లో రాధే […]
గత నెల 25న విడుదలై రెండో వారంలోకి అడుగు పెట్టిన భీమ్లా నాయక్ నెమ్మదించాడు. గత రెండు మూడు రోజులుగా చాలా కేంద్రాల్లో కలెక్షన్ల తగ్గుదల కనిపిస్తోంది. ఇంకో పాతిక కోట్లు షేర్ రావాల్సిన తరుణంలో ఇప్పుడీ వీకెండ్ చాలా కీలకంగా మారనుంది. నిన్న విడుదలైన కొత్త సినిమాలేవీ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో జనాల ఛాయస్ మళ్ళీ భీమ్లా ఒకటే కాబోతోంది. ఎలాగూ 10న సూర్య ఈటి, 11న రాధే శ్యామ్ వస్తాయి కాబట్టి ఆలోగా వీలైనంత రాబట్టుకుని […]
నిన్న భారీ ఎత్తున విడుదలైన భీమ్లా నాయక్ కు బ్రహ్మాండమైన స్పందన దక్కుతోంది. చాలా చోట్ల రికార్డు కలెక్షన్లతో గ్రాండ్ ఓపెనింగ్ దక్కించుకున్నాడు. నైజామ్ లో ఏకంగా 11 కోట్లకు పైగా షేర్ రాబట్టి మరీ సత్తా చాటాడు. మిగిలిన ఏరియాలకు సంబంధించిన వసూళ్ల రిపోర్ట్స్ ఒక్కొక్కటిగా అందుతున్నాయి. సరే రెస్పాన్స్ బాగానే ఉంది మరి ఛాన్స్ మిస్ అవ్వడమేంటి అనుకుంటున్నారా. అక్కడికే వద్దాం. ముందుగా ప్లాన్ చేసినట్టు హిందీ వెర్షన్ ఒకేసారి రిలీజ్ కాలేకపోయింది. డబ్బింగ్ […]
గత ఏడాది లాక్ డౌన్ వల్ల వకీల్ సాబ్ కు బ్రేక్ పడినట్టే అచ్చం అదే తరహాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు అయ్యప్పనుం కోశియుమ్ రీమేక్ కూడా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇవాళ్టి నుంచి ఫ్రెష్ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. ఇందులో పవన్ కూడా ఎంటరయ్యాడు. ఇంకో నెల రోజులు షూటింగులకు రాకపోవచ్చని కొద్దిరోజుల క్రితం ప్రచారం జరిగిన నేపథ్యంలో ఇప్పుడీ కీలక అప్ డేట్ రావడం అభిమానులకు గుడ్ న్యూసే. వకీల్ సాబ్ లాగే […]
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు కరోనా వల్ల వచ్చిన బ్రేక్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ వైరస్ ప్రభావం లేకపోయి ఉంటె ఇంకో రెండు నెలల్లో ఇదీ సెట్స్ పైకి వెళ్లేదే. కాని ఇప్పుడా ఛాన్స్ లేదు. వాయిదా తప్పదు. ఈలోగా స్క్రిప్ట్ ని ఫైనల్ చేయడంతో పాటు టీంని సెట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు త్రివిక్రమ్. ఇందులో […]
మాటల మాంత్రికుడిగా పేరున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. స్వయంవరం, చిరునవ్వుతో లాంటి సినిమాలతో సంభాషణల రచయితగా అవార్డులు సైతం సాధించిన త్రివిక్రమ్ దర్శకుడిగా మారాక టాలీవుడ్ కో కొత్త పోకడ పరిచయం చేసిన మాట వాస్తవం. అయితే త్రివిక్రమ్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు అతని క్లాస్ మెట్ అబ్బూరి రవి ద్వారా తెలుసుకోవచ్చు. బొమ్మరిల్లు, ఊపిరి లాంటి బ్లాక్ బస్టర్స్ ద్వారా తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్న రవి మాటల్లో […]
ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న కరోనా బారి నుంచి ప్రజల్ని కాపాడడానికి ప్రభుత్వానికి తమ వంతు చేయూతనిస్తున్నాయి టాలీవుడ్ పెద్ద మనసులు. ఒకటి రెండు రోజులు ఆలస్యమవుతున్నట్టు అనిపిస్తున్నా నిజానికి ఇదే సరైన సమయం. చర్యలు ఇప్పుడిప్పుడే వేగమందుకుంటున్నాయి. జనంలో కూడా చైతన్యం వచ్చి తమ వంతుగా సహాయం చేసేందుకు స్ఫూర్తి పొందుతారు. అధికారిక లాక్ డౌన్ ఇంకా 20 రోజులు ఉంది కాబట్టి ఆ మేరకు చిన్నా చితకా కార్మిక వర్గాలకు భుక్తిని అందించడం ఇప్పుడు ప్రధానంగా […]
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జూలై నుంచి ఫ్రీ అయిపోతాడు. తర్వాత దాని ప్రమోషన్ లో పాల్గొనాల్సి ఉంటుంది కాని మరీ నెలల తరబడి అయితే అవసరం ఉండదు. అక్టోబర్ నుంచి పబ్లిసిటీ ఉదృతంగా జరిగేలా రాజమౌళి ప్లాన్ చేసుకున్నాడు. కాని దీని తర్వాత చరణ్ ఏ సినిమా చేస్తాడనే క్లారిటీ మాత్రం ఇప్పటిదాకా రాలేదు. సాహోతో భారీ బడ్జెట్ సినిమాను హ్యాండిల్ చేసిన సుజిత్ వైపు […]