Tirupathi Rao
Trivikram & Mahesh Babu: త్రివిక్రమ్ శ్రీనివాస్- సూపర్ స్టార్ మహేశ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం సినిమా డీసెంట్ హిట్టుగా బాక్సాఫీస్ వద్దా సత్తా చాటింది. కానీ, త్రివిక్రమ్ మాత్రం ఎందుకో దూరంగా ఉంటున్నారు.
Trivikram & Mahesh Babu: త్రివిక్రమ్ శ్రీనివాస్- సూపర్ స్టార్ మహేశ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం సినిమా డీసెంట్ హిట్టుగా బాక్సాఫీస్ వద్దా సత్తా చాటింది. కానీ, త్రివిక్రమ్ మాత్రం ఎందుకో దూరంగా ఉంటున్నారు.
Tirupathi Rao
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ఈ పేరు వినగానే తెలుగు ఆడియన్స్ లో ఒక జోష్ వచ్చేస్తుంది. ఆయన రాసే డైలాగులకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాంటి త్రివిక్రమ్.. సూపర్ స్టార్ మహేశ్ తో కలిసి మరో సినిమా తీస్తున్నారు అనగానే టాలీవుడ్ లో పెద్ద చర్చే జరిగింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అని ముందే ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కడో ఒక పాయింట్ లో నెగిటివిటీ వస్తూనే ఉంది. కొందరైతే పని గట్టుకుని పుకార్లు పుట్టించారు. అన్నింటినీ తట్టుకుని గుంటూరు కారం సంక్రాంతి బరిలోకి దిగింది. డీసెంట్ హిట్టు కూడా సొంతం చేసుకుంది. కానీ, ఇప్పటికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం ఎందుకో దూరంగా ఉంటున్నాడు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా ఆ రోజుల్లో కమర్షియల్ గా వర్కౌట్ కాకపోయినా ఫ్యాన్స్ కి మాత్రం కల్ట్ క్లాసిక్స్ గా మిగిలిపోతాయి. అలాంటి కాంబో మళ్లీ రిపీట్ అవుతోంది అనగానే అందరూ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ, గుంటూరు కారం సినిమా ప్రారంభం నుంచి మూవీపై నెగిటివిటీని అయితే స్ప్రెడ్ చేస్తూ వచ్చారు. ముఖ్యంగా త్రివిక్రమ్ ని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ కూడా చేశారు. వాటన్నింటిని దాటుకుని సంక్రాంతి బరిలోకి అయితే గుంటూరు కారం దిగింది. అర్ధరాత్రి ఒంటి గంట షో పూర్తవగానే నెగిటివ్ టాక్ స్టార్ట్ అయ్యింది. సినిమాపై వచ్చిన నెగిటివ్ టాక్ గురించి నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా ఒప్పుకున్నారు. కానీ, ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయదగిన సినిమా అని మాత్రం భరోసాని ఇచ్చారు. మొదటిరోజు తర్వాత సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యారు.
డిజాస్టర్ అంటూ ప్రచారం చేసిన సినిమా ఏకంగా రూ.230 కోట్లకు పైగా గ్రాస్, రూ.120 కోట్లకు పైగా షేర్ ని కలెక్ట్ చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇంకేముంది.. గుంటూరు కారం డీసెంట్ హిట్ అని అర్థమైపోయింది. కానీ, త్రివిక్రమ్ మాత్రం ఎందుకో దూరంగా ఉండిపోయినట్లు అనిపించింది. సినిమా ప్రమోషన్స్ లో కూడా అంతగా పాల్గొన్నట్లు కనిపించలేదు. సినిమా సక్సెస్ అయిన తర్వాత అయినా త్రివిక్రమ్ ప్రెస్ మీట్లు, సక్సెస్ మీట్లు అంటూ మాటల మాంత్రికుడు హడావుడి చేస్తారని భావించిన వారికి నిరాశే మిగిలింది. సినిమా విడుదల తర్వాత అస్సలు టీమ్ కి అందుబాటులో లేకుండా వెళ్లిపోయిన పరిస్థితి అయితే కనిపించింది. అయితే ఇలా జరగడానికి సరైన కారణాలు మాత్రం తెలియరాలేదు. ఇప్పటికీ ఎందుకు గురూజీ దూరంగా ఉంటున్నారు? అంటూ సినిమా వర్గాలే కాకుండా.. ఫ్యాన్స్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మరి.. గురూజీ ఎందుకు దూరంగా ఉంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేండి.