iDreamPost
android-app
ios-app

త్రివిక్రమ్ మీద పూనమ్ కౌర్ సీరియస్.. తొలిసారి పేరు పెట్టి మరీ తిట్టిన హీరోయిన్!

  • Published Feb 22, 2024 | 2:03 PM Updated Updated Feb 22, 2024 | 2:03 PM

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద హీరోయిన్ పూనమ్ కౌర్ మరోమారు సీరియస్ అయ్యారు. తొలిసారి ఆయన్ను పేరు పెట్టి మరీ ఆమె తిట్టారు.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద హీరోయిన్ పూనమ్ కౌర్ మరోమారు సీరియస్ అయ్యారు. తొలిసారి ఆయన్ను పేరు పెట్టి మరీ ఆమె తిట్టారు.

  • Published Feb 22, 2024 | 2:03 PMUpdated Feb 22, 2024 | 2:03 PM
త్రివిక్రమ్ మీద పూనమ్ కౌర్ సీరియస్.. తొలిసారి పేరు పెట్టి మరీ తిట్టిన హీరోయిన్!

ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. ‘శౌర్యం’, ‘వినాయకుడు’ లాంటి హిట్ సినిమాలతో ఆడియెన్స్​లో మంచి గుర్తింపు సంపాదించారామె. అయితే గత కొంత కాలంగా మూవీస్​కు దూరంగా ఉంటున్న ఆమె సామాజిక, రాజకీయ అంశాల మీద మాత్రం ధైర్యంగా కామెంట్స్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఆమె వేసిన కొన్ని ట్వీట్లు కాంట్రవర్సీకి దారితీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవి జనసేనాని పవన్ కల్యాణ్​, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ఆమె కౌంటర్లు వేసినట్లుగానే కనిపిస్తుంటాయి. పవన్​పై కొన్నిసార్లు విమర్శలు చేస్తూ ఆమె చేసిన ట్వీట్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇంక గురూజీ అంటూ వేసే ట్వీట్ల మీద కూడా నెట్టింట జోరుగా డిస్కషన్స్ నడుస్తుంటాయి. అయితే పవన్, త్రివిక్రమ్​తో పూనమ్​కు ఉన్న గొడవ ఏంటనేది మాత్రం ఇంతదాకా క్లారిటీ రాలేదు. దీనిపై ఎప్పుడూ నోరు విప్పని పూనమ్.. ఈసారి మాత్రం త్రివిక్రమ్​ను పేరు పెట్టి మరీ తిట్టారు.

పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ మీద కౌంటర్ ట్వీట్లు వేసే పూనమ్ ఎప్పుడు కూడా నోరు విప్పి అసలు ఏం జరిగిందో చెప్పలేదు. వాళ్ల పేర్లు గానీ, తనకు జరిగిన అన్యాయం గురించి గానీ నేరుగా రియాక్ట్ కాలేదు. వాళ్ల పేర్లు ప్రస్తావించకుండానే ట్వీట్లు చేస్తూ వచ్చారు. కానీ ఫస్ట్ టైమ్ ఆమె ఓపెన్ అయ్యారు. ఓ పేరును చెప్పేశారు పూనమ్ కౌర్. తాజాగా పవన్ తన పొలిటికల్ స్పీచ్​లో భాగంగా త్రివిక్రమ్​ను ప్రస్తావించారు. పులి, సింహం అంటూ డైలాగ్స్ చెప్పడం తనకు అంతగా ఇష్టం ఉండదన్నారు. ‘అత్తారింటికి దారేది’ మూవీలో సింహం డైలాగ్​ చెప్పడానికీ చాలా ఇబ్బంది పడ్డానన్నారు. త్రివిక్రమ్ కామెడీగా చెప్పమంటే ఆ డైలాగ్ చెప్పేశానంటూ ఫిల్మ్ షూటింగ్​లో జరిగిన ఘటన గురించి జనసేనాని గుర్తుచేసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై పూనమ్ కామెంట్ చేశారు. ‘యూజ్​లెస్​ ఫెల్లో’ అంటూ త్రివిక్రమ్ పేరును ట్యాగ్ చేసి ఆ పోస్టుకు రిప్లై ఇచ్చారు.

త్రివిక్రమ్​ను డైరెక్ట్​గా తిట్టడంతో పూనమ్ రిప్లై చూసి అంతా షాకవుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఇన్నాళ్లూ చెప్పలేదని.. కానీ తొలిసారి ఇలా నేరుగా ఓ పేరు పెట్టి ట్వీట్ చేశావని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కాంట్రవర్సీ ఎక్కడికి దారితీస్తుందో చూడాలి. ఇక, త్రివిక్రమ్ కెరీర్ విషయానికొస్తే.. ఆయన డైరెక్షన్​లో రూపొందిన ‘గుంటూరు కారం’ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన సంగతి తెలిసిందే. మిక్స్​డ్ టాక్ వచ్చినా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సేల్ అయిపోయింది. ఇందులో త్రివిక్రమ్ మ్యాజిక్ మిస్సయిందనే కామెంట్స్ వినిపించాయి. అయితే మహేష్ మూవీ మాత్రం వసూళ్లలో అదరగొట్టింది. మరి.. త్రివిక్రమ్​పై పూనమ్ కౌర్ చేసిన వ్యాఖ్య మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: షణ్ముఖ్ కేసులో సంచలన నిజాలు! అవకాశాలు ఇప్పిస్తానని లైంగికంగా: మౌనిక!

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet