iDreamPost
android-app
ios-app

కుర్చీ మడత పెట్టి ఫుల్ వీడియో రిలీజ్.. యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న మహేశ్!

  • Published Feb 01, 2024 | 7:28 PM Updated Updated Feb 01, 2024 | 7:28 PM

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘గుంటూరు కారం ’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి మంచి కలెక్షన్లు సాధించింది. ఈ మూవీలో ‘కుర్చి మడత పెట్టి’ సాంగ్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘గుంటూరు కారం ’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి మంచి కలెక్షన్లు సాధించింది. ఈ మూవీలో ‘కుర్చి మడత పెట్టి’ సాంగ్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది.

  • Published Feb 01, 2024 | 7:28 PMUpdated Feb 01, 2024 | 7:28 PM
కుర్చీ మడత పెట్టి ఫుల్ వీడియో రిలీజ్.. యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న మహేశ్!

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతోమంది స్టార్ హీరోల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు ఒకరు.  బాలనటుడిగా ‘నీడ’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో బాలనటుడిగా నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘రాజకుమారుడు’ చిత్రంతో హీరోగా మారి క్లాస్, మాస్ ఆడియన్స్ ని మెప్పించాడు. టాలీవుడ్ లో సంక్రాంతి కానుకగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలోని సాంగ్స్ కి మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ మూవీ నుంచి మాస్ సాంగ్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

గతంలో ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన అతడు బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ఖలేజా చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. చాలా కాలం తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘గుంటూరు కారం’. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది. కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన అందాల తార శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించింది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో మహేష్ బాబు యాక్టింగ్, డ్యాన్స్ కి మంచి మార్కులు పడ్డాయి.

గుంటూరు కారం చిత్రంలో ‘కుర్చి మడత పెట్టి’ ఫుల్ ఎనర్జీతో సాగిన సాంగ్ కి మహేష్ బాబు, శ్రీలీల ఊర మాస్ డ్యాన్స్ తో దుమ్మురేపారు. ఈ పాట వస్తున్నంత సేపు ధియేటర్లో ఊలీలు, చప్పట్లతో మార్మోగింది. తాజాగా ఈ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ చేయగా.. మహేష్ బాబు స్టెప్పులు చూసి సూపర్ స్టార్ అభిమారుల, ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇప్పటి వరకు ఈ వీడియోకి 81 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తాజాగా ‘కుర్చి మడత పెట్టి’ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ కి తమన్ సంగీతం అదిరిపోయింది. ఈ పాట సాహితి చాగంటి, శ్రీకృష్ణ ఆలపించారు. సోషల్ మీడియాలో ఈ సాంగ్ దుమ్మురేపుతుంది.ఈ సాంగ్ రిలీజ్ చేసిన గంట వ్యవధిలోనే 4 లక్షల వ్యూస్, 44 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.  ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom