iDreamPost
android-app
ios-app

క్రేజీ న్యూస్.. మాటల మాంత్రికుడితోనే బన్నీ నెక్ట్ మూవీ..!

  • Published Sep 16, 2024 | 11:21 AM Updated Updated Sep 16, 2024 | 11:21 AM

అల్లు అర్జున్- సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్ప 2 షూటింగ్ చివరి దశకు చేరింది. ఈ క్రమంలో బన్నీ నెక్ట్స్ మూవీ ఏంటీ అన్న ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

అల్లు అర్జున్- సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్ప 2 షూటింగ్ చివరి దశకు చేరింది. ఈ క్రమంలో బన్నీ నెక్ట్స్ మూవీ ఏంటీ అన్న ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

  • Published Sep 16, 2024 | 11:21 AMUpdated Sep 16, 2024 | 11:21 AM
క్రేజీ న్యూస్.. మాటల మాంత్రికుడితోనే బన్నీ నెక్ట్ మూవీ..!

పుష్ప 2తో షూటింగ్‌లో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు అల్లు అర్జున్. మిగిలిన బిగ్ హీరోలంతా ఒక సినిమా సెట్స్ పై ఉండగానే.. మరో మూవీని లైన్లో పెడుతున్నారు. బన్నీ మాత్రం గత ఐదేళ్లుగా ఒకే దర్శకుడితో ప్రయాణం సాగిస్తున్నాడు. పుష్ప 2 తర్వాత స్టైలిష్ స్టార్ చేయబోయే క్రేజీ ప్రాజెక్ట్ ఏంటీ..? ఏ డైరెక్టర్‌తో డీల్ చేయబోతున్నాడన్న ఆసక్తి నెలకొంది. కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు అట్లీతో నెక్ట్స్ మూవీ ఉండబోతుందని రూమర్స్ మొదలయ్యాయి. అంతలోనే తూచ్ అంటూ ఓ వార్త కూడా హల్ చల్ చేస్తుంది. ఇంతకు బన్నీ తన తదుపరి సినిమా ఏ డైరెక్టర్‌తో చేస్తాడో అని ఉత్కంఠత నెలకొన్న వేళ క్రేజీ న్యూస్ బయటకు వచ్చేసింది. తనకు బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో నెక్ట్ మూవీ ఉండబోతుందట.

త్రివిక్రమ్- బన్నీ కాంబోలో ఇప్పటికే మూడు చిత్రాలు వచ్చిన సంగతి విదితమే. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో. ఈ త్రీ మూవీస్ బాక్సాఫీసును షేక్ చేసేశాయి. ఇప్పుడు ఈ మ్యాజిక్ రిపీట్ చేసేందుకు సిద్ధం అవుతుందట ఈ పెయిర్. అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కబోతుందని సమాచారం. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు సుమారు 6 నుండి 10 నెలలు పడుతుందని తెలుస్తుంది. ప్రీ పొడక్షన్ కోసమే ఈ గ్యాప్ తీసుకుంటున్నారట. గతంలో ఇదే విషయాన్ని స్టైలిష్ స్టార్ సన్నిహితుడు, నిర్మాత బన్నీ వాస్ చెప్పాడు. అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి స్టార్ట్ కాబోతుందని సమాచారం. ఇదే కనుక నిజమైతే.. మరోసారి బాక్సాఫీసు దద్దరిల్లాల్సిందే. బన్నీలో కేవలం యాక్షన్ ఎలివెంట్స్ మాత్రమే కాదు.. ఫన్నీ, ఈజ్..ఫ్యామిలీ డ్రామాను వెలికితీసే డైరెక్టర్ త్రివిక్రమ్. దీంతో మళ్లీ బన్నీని స్టైలిష్ యాంగిల్లో చూసోయోచ్చు అభిమానులు.

ప్రస్తుతం పుష్ప 2 సెట్స్‌ చివరి దశకు వచ్చేసింది. అన్ని సవ్యంగా జరిగితే డిసెంబర్ 6కి థియేటర్లకు రావడం పక్కా. ఇప్పటికే ఆ రోజు వచ్చేస్తామని హోప్స్ ఇచ్చేశారు దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్. అక్టోబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాబోతుందట. ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్, తర్వాత ప్రమోషన్లతో బిజీగా మారిపోనున్నాడు బన్నీ. రెండు, మూడు నెలలు గ్యాప్ తీసుకున్న తర్వాత గురువుగారి ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక పుష్ప2 విషయానికి వస్తే.. రూ. 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్. జగదీష్ ప్రతాప్ బండారి, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సునీల్, అనుసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom