iDreamPost
android-app
ios-app

Allu Arjun-Trivikram: బన్నీతో మూవీ.. నాగ్ అశ్విన్ ను ఫాలో అవుతున్న త్రివిక్రమ్!

  • Published Jul 16, 2024 | 1:46 PM Updated Updated Jul 16, 2024 | 1:46 PM

మాటల మాంత్రికుడు, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం త్రివిక్రమ్ నాగ్ అశ్విన్ ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

మాటల మాంత్రికుడు, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం త్రివిక్రమ్ నాగ్ అశ్విన్ ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Allu Arjun-Trivikram: బన్నీతో మూవీ.. నాగ్ అశ్విన్ ను ఫాలో అవుతున్న త్రివిక్రమ్!

ఇండస్ట్రీలో పుట్టే ప్రతి సినిమా కథకు ఎక్కడో ఒకచోట మూలం ఉంటుంది. కొన్ని స్టోరీలు కలలో పుడితే.. మరికొన్ని సమాజంలో పుడతాయి. ఇంకొన్ని ఇతిహాసాలు, పురాణాల్లోంచి ఉద్భవిస్తాయి. అలా ఇప్పటికే ఎన్నో సినిమాలు వెండితెరపై ఆవిష్కృతం అయ్యాయి.. అవుతున్నాయి కూడా. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కి మూవీ సైతం మహాభారతం ఆధారంగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో సినిమా మహాభారతం ఆధారంగా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. అవును ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఓ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా మూలకథకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

త్రివిక్రమ్ శ్రీనివాస్.. మాటలతోనే సినిమాను హిట్ కొట్టించే సత్తా ఉన్న డైరెక్టర్. డైలాగ్ రైటర్ గా కెరీర్ ప్రారంభించి.. స్టార్ డైరెక్టర్ రేంజ్ కు ఎదిగాడు. విలువలతో కూడిచిన సినిమాలకు కమర్షియల్ టచ్ ఇస్తూ.. సినిమాలు తెరకెక్కించడంలో గురూజీది అందెవేసిన చేయి. ఇతిహాసాలు, పురాణాలను మూల కథలుగా తీసుకుని అందులో నుంచి సినిమాలను తెరకెక్కిస్తుంటాడు ఈ మాటల మాంత్రికుడు. ఇప్పుడు మరోసారి అదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో తీసే సినిమాని ఆధునిక మహాభారతంలోని రెండు పర్వాలను ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్నట్లు సమాచారం. దుర్యోధన, అర్జున, కర్ణ పాత్రల ఆధారంగా ఈ మూవీ ఉండబోతుందట.

ఈ సోషియో ఫాంటసీ చిత్రం 1991లో వచ్చిన రజినీకాంత్ మూవీ ‘దళపతి’ మోడల్ లా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. 90వ దశకంలో దళపతి మూవీ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మహాభారతంలోని మూలాలను మిక్స్ చేసుకుని, దళపతి టచ్ ఇస్తూ.. గురూజీ స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నాడట. ఈ విషయం కాస్త వైరల్ కావడంతో.. త్రివిక్రమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ను ఫాలో అవుతున్నాడు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే? కల్కి మూవీ సైతం మహాభారతంలోని పాత్రల ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.